తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Know About Alzheimer's: అల్జీమర్స్ అంటే ఏంటి? దాన్నెలా ఎదుర్కోవాలో.. వైద్యుల మాటలో తెల్సుకోండి..

Know about Alzheimer's: అల్జీమర్స్ అంటే ఏంటి? దాన్నెలా ఎదుర్కోవాలో.. వైద్యుల మాటలో తెల్సుకోండి..

20 September 2023, 13:02 IST

google News
  • Know about Alzheimer's: అల్జీమర్స్ వ్యాధి ప్రభావం, దాని లక్షణాలు, పురోగతి గురించి వైద్యులు ఇచ్చిన సమాచారం వివరంగా తెలుసుకోండి. 

అల్జీమర్స్
అల్జీమర్స్ (pexels)

అల్జీమర్స్

అల్జీమర్స్ అనేది ప్రగతిశీల నాడీ సంబంధిత రుగ్మత. ఇది ప్రధానంగా వృద్ధులను ప్రభావితం చేస్తుంది. బీటా-అమిలాయిడ్ ఫలకాలు, టౌ టాంగిల్స్‌ తో సహా మెదడులో అసాధారణమైన ప్రోటీన్ నిక్షేపాలు చేరడం ద్వారా అల్జీమర్స్ వ్యాధి వస్తుంది. ఈ మార్పులు మెదడు కణాల మరణానికి దారితీస్తాయి. అభిజ్ఞా విధులు క్రమంగా క్షీణిస్తాయి. అల్జీమర్స్ ప్రధానంగా వృద్ధులను ప్రభావితం చేస్తున్నప్పటికీ, ఇది 40 లేదా 50 ఏళ్ల వయస్సులోపు వ్యక్తులలో కూడా సంభవించవచ్చు. అయితే ఇది సాధారణంగా 65 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలోనే ఎక్కువగా నిర్ధారణ అవుతుంది.

అల్జీమర్స్‌ లక్షణాలు, పురోగతి, సవాళ్లు:

జ్ఞాపకశక్తి కోల్పోవడం, దిక్కుతోచని స్థితి, భాషా సమస్యలు, మానసిక స్థితిలో మార్పులు, సాధారణ పనులలో ఇబ్బంది అల్జీమర్స్ లక్షణాలు. వ్యాధి ప్రారంభ, మధ్య, చివరి దశల ద్వారా అభివృద్ధి చెందుతుంది. పెరుగుతున్న అభిజ్ఞా క్షీణత, సంరక్షణ కోసం ఇతరులపై ఆధారపడటం, మానసిక క్షోభ, శారీరక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అల్జీమర్స్ రోగులను చూసుకునే సంరక్షకులు భావోద్వేగ, శారీరక ఇబ్బందులు, ఆర్థిక ఒత్తిడి, నిరంతర సంరక్షణ అవసరం ఏర్పడడం, కమ్యూనికేషన్ ఇబ్బందులు, పరిమిత మద్దతు, ఇతర వనరుల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి.

సంరక్షణ పద్ధతులు:

లక్షణాల తీవ్రతపై ఆధారపడి, అల్జీమర్స్ వ్యాధి ఉన్న వ్యక్తులకు అనేక సంరక్షణ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు.. ఆరోగ్య నిపుణుల సహాయంతో సుపరిచితమైన వాతావరణంలో రోగులకు ఇంటిలో సంరక్షణ అందించే వీలుంది. నిర్మాణాత్మక కార్యకలాపాలు, రవాణా, భోజనం అందిం చడంతో పాటు.. పగటిపూట కూడా సంరక్షణ అవసరమయ్యే వారికి అడల్ట్ డే సెంటర్‌లు సురక్షితమైన, ఆకర్షణీయ మైన వాతావరణాన్ని అందిస్తాయి. నర్సింగ్ హోమ్‌లు లేదా అసిస్టెడ్ లివింగ్ కమ్యూనిటీలు వంటి దీర్ఘ కాలిక సంరక్షణ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. మరింత ముదిరిపోయిన లక్షణాలు ఉన్నవారికి 24 గంటల సంరక్షణ లేదా సహాయాన్ని ఇవి అందిస్తాయి. కొన్ని రోజులు రెస్పైట్ కేర్ (సంరక్షకులు మారిపోవడం) అనేది అప్పటి వరకూ సంరక్షకులుగా ఉన్నవారికి స్వల్పకాలిక ఉపశమనాన్ని అందిస్తుంది. సౌకర్యం, సంరక్షణను అందించవచ్చు.

సంరక్షకులకు సలహాలు:

అల్జీమర్స్ వ్యాధి ఉన్న వ్యక్తుల సంరక్షకులు, గుర్తుంచుకోవలసిన కొన్ని చిట్కాలు ఉన్నాయి. పరిస్థితి గురించి మీకు మీరుగా అవగాహన కల్పించుకోవడం, వైద్యుల అపాయింట్‌మెంట్‌లకు హాజరు కావడం, ప్రశ్నలు అడగడం ద్వారా మీ ప్రియమైన వారితో కమ్యూనికేషన్ మెరుగుపరచవచ్చు. వారి మారుతున్న ప్రవర్తనను ఎదుర్కోవచ్చు. రోజువారీ దినచర్యను ఏర్పరచుకోవడం అనేది స్నానం చేయడానికి, దుస్తులు ధరించడానికి, తినడానికి నిర్ణయించిన సమయాలతో సహా స్వల్పకాల జ్ఞాపకశక్తి కోల్పోయే వ్యక్తుల విషయంలో సహాయపడుతుంది. శారీరక శ్రమ, వ్యాయామం అభిజ్ఞా మార్పులను నెమ్మదింపచేస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అంతేగాకుండా ఇంటి పనులు చేయడం వంటి మానసిక కార్యకలాపాలు కూడా అభిజ్ఞా క్షీణతను తగ్గించడంలో సహాయపడతాయి.

వృద్ధుల జనాభా పెరుగుతున్న కొద్దీ అల్జీమర్స్ వ్యాధి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై గణనీయమైన భారాన్ని మోపుతుంది. అంతిమంగా చూస్తే, అల్జీమర్స్ వ్యాధి వృద్ధుల జనాభా, వారి సంరక్షకులు, మొత్తం సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ వ్యాధి ద్వారా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో కొనసాగుతున్న పరిశోధన, మద్దతు నెట్‌వర్క్‌ లు, అవగాహన చాలా కీలకం.

- డాక్టర్ మురళీ చేకూరి, సీనియర్ కన్సల్టెంట్, డిపార్ట్‌ మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్, మణిపాల్ హాస్పిటల్, విజయవాడ

డాక్టర్ మురళీ చేకూరి
తదుపరి వ్యాసం