Kitchen Management Tips : ఆహారం వృథా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
13 March 2023, 15:54 IST
- Kitchen Management Tips : ఇటీవల ఆహార నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెరిగింది. పెద్ద నగరాల్లో దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే, ఆహారం వృథా కాకుండా ఉండటం సాధ్యం కాదు... కొంతైనా వృథా చేస్తారు. అయితే ఆహార పదార్థాలు వృథా కాకుండా వంటగదిని ఎలా నిర్వహించాలి? ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
కిచెన్
ఆకలి లేని మనిషి లేడు. ప్రపంచంలో చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు. ఒక్కపూట భోజనం కోసం కష్టపడుతున్నవారు. మూడు పూటల కుటుంబ సభ్యులకు అన్నం పెట్టేందుకు కష్టపడేవారు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. కానీ ధనవంతులు ఆహారాన్ని వీధిలో పారేస్తారు. ఇలా ప్రతిరోజు వేల టన్నుల ఆహారం వృథా అవుతోంది.
ఆహారాన్ని తయారు చేయడానికి అవసరమైన పదార్థాలను విసిరేయడం, పారవేయడం వల్ల డబ్బు ఖర్చు చేయడమే కాకుండా పర్యావరణానికి కూడా హాని జరుగుతుంది. వ్యర్థమైన ఆహారాన్ని సేకరించడం, రవాణా చేయడం, డంపింగ్ చేయడం వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుంది. ఈ ప్రక్రియలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం కూడా పెరుగుతుంది. ఇటీవల ఆహార నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెరిగింది. పెద్ద నగరాల్లో దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే, ఆహారం వృథా కాకుండా ఉండటం సాధ్యం కాదు. కాబట్టి ఆహార పదార్థాలు వృధా కాకుండా వంటగదిని ఎలా నిర్వహించాలి? ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
షాపింగ్‌కు వెళ్లే ముందు
మీరు వంటకాన్ని తయారు చేయాలనుకున్నప్పుడు, మీరు తీసుకురావాల్సిన పదార్థాల జాబితాను తయారు చేస్తారు. కానీ ఆ జాబితాను రూపొందించేటప్పుడు, వంటగది, ఫ్రిజ్‌ను చూడండి. ఎందుకంటే మీరు ఇప్పటికే మీ రెసిపీ కోసం పదార్థాలను కలిగి ఉండవచ్చు. మీరు ఉపయోగించగల ప్రత్యామ్నాయాలను మీరు కనుగొనవచ్చు. ఉదాహరణకు చింతపండుకు బదులుగా టమోటా, నిమ్మకాయలాంటివి కావచ్చు.
వంట చేయడానికి ముందు
వంట చేయడానికి ముందు, వంటగదిలో, ముఖ్యంగా ఫ్రిజ్లో ఏముందో చూడండి. ఎండిన కూరగాయలను ముందుగా వాడాలి. కొన్ని కూరగాయలు, పదార్థాలు త్వరగా పాడవుతాయి. కాబట్టి వాటిని ఉంచే విధానం కూడా ముఖ్యం. దీనితో, ఒక్కొక్కటి విడిగా విభజించి, కవర్ లేదా కంటైనర్‌పై లేబుల్‌ను అతికించండి. అప్పుడు పదార్థాలు వెంటనే కనిపిస్తాయి. అవసరమైనప్పుడు తీసివేయడం, ఉపయోగించడం సులభం. ఇలా చేయడం వల్ల వస్తువులు చెడిపోకుండా, కూరగాయలు కుళ్లిపోకుండా నివారించవచ్చు. అలాగే దీనివల్ల ఆహార పదార్థాల వృథాను నివారించవచ్చు.
వంట తయారీ సమయంలో
కొన్ని కూరగాయలను కట్ చేశాక పారేస్తాం. సాంబార్ కోసం మనకు కావలసినన్ని కూరగాయలు కట్ చేసిన తర్వాత, తురిమిన కూరగాయల భాగాన్ని విసిరేస్తాం. బదులుగా, మీరు వంట ప్రారంభించే ముందు మీరు ఏమి చేస్తారో ఆలోచించండి. మిగిలిపోయిన కూరగాయలు, ఆకుకూరలు, ఉల్లిపాయలు, వాటితో మీరు ఏ ఇతర వంటకాలను తయారు చేయవచ్చో ఆలోచించండి. మిగిలిపోయిన వాటిని పారేసే బదులు, మీరు భోజనం రుచిని పెంచడానికి దానితో విభిన్నమైన వంటకాన్ని తయారు చేసుకోవచ్చు.
కొత్తది ప్రయత్నించండి
డిన్నర్‌కి హోటల్‌కి వెళ్లినప్పుడు ఆహారాన్ని వృథా చేయడం మామూలే. అలాంటి సమయాల్లో మిగిలిపోయిన ఆహారాన్ని ఇంటికి తెచ్చి వేడి చేసి తినవచ్చు. హోటల్ నుంచి ఫుడ్ పార్శిల్ తీసుకొచ్చేటప్పుడు కూడా వాటిని పారేయడం కంటే వాటిని వేడి చేసి మళ్లీ ఉపయోగించడం మంచిది. దీంతో మిగిలిన ఆహార పదార్థాల నుంచి మరో కొత్త వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మళ్లీ ఏం తింటాంలే అనుకుంటే.. రోడ్డు మీద చాలా మంది ఆకలి చూపులు కనిపిస్తాయి. మీ పేరు చెప్పుకొని కడుపునిండా వాళ్లు భోజనం చేస్తారు.
టాపిక్