తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kissing - Brushing | ముద్దుతో నోరు బ్రష్ చేసుకున్నంత పరిశుభ్రం అవుతుంది!

Kissing - Brushing | ముద్దుతో నోరు బ్రష్ చేసుకున్నంత పరిశుభ్రం అవుతుంది!

HT Telugu Desk HT Telugu

26 April 2022, 21:32 IST

google News
    • ముద్దుపెడితే నోరు పరిశుభ్రమవుతుందట. ప్రతిరోజూ బ్రష్ చేసుకోవడంతో పాటు గాఢంగా ముద్దు పెట్టుకోవాలని ఓ డెంటిస్ట్ సలహా ఇస్తున్నారు.
Kissing vs Brushing
Kissing vs Brushing (Pixabay)

Kissing vs Brushing

నోటిని శుభ్రపరుచుకోవాలంటే ఏం చేయాలో మనందరికీ తెలుసు. పళ్లు తోముకోవడం, మౌత్ వాష్ తో నోటిని కడుక్కోవడం, నీటితో నోటిని పుకిలించడం ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి. అయితే నోటితో నోటికి తాళం వేసి గాఢమైన చుంబనం చేయడం ద్వారా కూడా నోరు పరిశుభ్రమవుతుందట. ఇలా అన్నది ఎవరో సాధారణ వ్యక్తి కాదు. బాగా విషపరిజ్ఞానం కలిగిన ఒక దంద వైద్య నిపుణుడు.

స్పెయిన్‌లోని బార్సిలోనాకు చెందిన డాక్టర్ ఖలేద్ కాసిమ్ ఒక ఆర్థోడాంటిస్ట్. ఈయనకు దంత వైద్యంలో సుదీర్ఘమైన అనుభవం ఉంది.

ముద్దుపెడితే కూడా బ్రష్ చేసినంతగా నోరు శుభ్రపడుతుందని ఈయన అంటున్నారు. ప్రతిరోజూ ఓ నాలుగు నిమిషాల పాటు అదరాలను తడుపుతూ, నాలుకలను పెనవేస్తూ గాఢమైన ముద్దు ఇస్తే నోరు శుభ్రపడుతుంది, దంతాల ఆరోగ్యం బాగుంటుంది, నోటి దుర్వాసన పోతుంది. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు.

డాక్టర్ ఖలేద్ ప్రకారం.. కిస్సింగ్ - స్మూచింగ్ ద్వారా నోట్లో లాలాజల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో దంతాలపై పేరుకుపోయిన ఆమ్లాలు తటస్థీకరణకు గురవుతాయి. దంతక్షయం కలిగించే బాక్టీరియా నాశనం అవుతుంది. నోరు శుభ్రపడుతుంది, తద్వారా నోటి దుర్వాసన తొలగిపోతుంది. ఒకరకంగా బ్రష్ చేసినపుడు కూడా ఇలాంటి ఫలితమే ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ బ్రష్ చేయండి అలాగే నాలుగు నిమిషాలు ముద్దు పెట్టుకోండి అంటూ సలహా ఇచ్చారు.

అయితే డాక్టర్ ఖలేద్ ఇచ్చిన సలహా ఇతర దంతవైద్య నిపుణులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది నిజమేనా.. అబద్ధమా అని చర్చ జరుగుతుంది. బహుశా ప్రయోగాత్మక పరిశీలనలు అవసరం కావొచ్చు. అయితే సరైన నోటి పరిశుభ్రత కోసం ముద్దులు ప్రత్యామ్నాయం కావని బ్రిటీష్ డెంటల్ అసోసియేషన్ తెలిపింది. రోజులో వీలుచిక్కినప్పుడల్లా స్నాక్స్ తినడం, ఫిజీ డ్రింక్స్ త్రాగడం వలన దంతక్షయం కలుగుతుంది. ఇది నివారించాలంటే మౌత్ వాష్ చేసుకోవాలి, ముద్దులు పెట్టుకోవడం కాదని తెలిపింది.

టాపిక్

తదుపరి వ్యాసం