తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Happy Republic Day 2023 | తినండి తిరంగా ఇడ్లీ.. ఎక్కించండి నరనరాన దేశభక్తి!

Happy Republic Day 2023 | తినండి తిరంగా ఇడ్లీ.. ఎక్కించండి నరనరాన దేశభక్తి!

HT Telugu Desk HT Telugu

25 January 2023, 22:11 IST

    • Happy Republic Day 2023: ఉదయాన్నే టీవీలో గణతంత్ర తినోత్సవ వేడుకలు చేస్తూ.. మూడు రంగుల తిరంగా ఇడ్లీలు తింటుంటే ఆ కిక్కే వేరప్పా. Tri Color Idli Recipe ఇక్కడ ఉంది చూడండి.
Tri Color Idli Recipe
Tri Color Idli Recipe (Unsplash)

Tri Color Idli Recipe

Happy Republic Day 2023: భారతదేశం 2023 జనవరి 26న తన 74వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటోంది. మరి మనమంతా కలిసి సగర్వంగా, ఆనందంగా జరుపుకునే ఈ జాతీయ పండగను ఎందుకు ప్రత్యేకం చేసుకోకూడదు. మీ వేడుకల్లో కొత్త రంగు, రుచి, దేశభక్తిని జోడించటానికి ఒక అద్భుతమైన ఉపాయాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాం.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

ఇడ్లీలు మనమంతా ఇష్టపడే ఒక మంచి అల్పాహారం. మీరు ఎప్పుడూ తినే తెల్లని ఇడ్లీలు కాకుండా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మన జెండా రంగుల్లోని మూడు రంగుల ఇడ్లీలను తయారు చేసుకొని తినవచ్చు. ఇందుకోసం ఇడ్లీలకు రంగు వేయాల్సిన అవసరం లేదు. కొన్ని కూరగాయలు కలిపితే అవే మంచి రంగు వస్తాయి, రుచిగా ఉంటాయి, పోషకాలు పెరుగుతాయి ఆరోగ్యకరం కూడా.

మరి చాలా సింపుల్‌గా తిరంగా ఇడ్లీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి. ఈ తిరంగా ఇడ్లీ రెసిపీని ఓ సారి ప్రయత్నించి చూడండి.

Tri Color Idli Recipe కోసం కావలసినవి

  • ఇడ్లీ పిండి - కావలసినంత
  • టమోటా లేదా క్యారెట్ 1
  • ఎర్ర మిరపకాయలు - 2
  • కొత్తిమీర/పుదీనా లేదా పాలకూర - 1 కప్పు
  • పచ్చిమిర్చి - 1
  • జీలకర్ర - 1/4 tsp (ఐచ్ఛికం)

Tiranga Idli - తిరంగా ఇడ్లీ/ త్రివర్ణ ఇడ్లీ తయారు చేసే విధానం

  1. ముందుగా అవసరం మేరకు ఇడ్లీ పిండిని తీసుకుని మూడు సమాన భాగాలుగా విభజించండి. త్రివర్ణ ఇడ్లీలలో తెలుపు రంగు కోసం ఒక భాగాన్ని అలాగే ఉంచండి. మిగిలిన రెండు భాగాల పిండిని కాషాయ రంగు, ఆకుపచ్చ రంగు కోసం ఉపయోగించాలి.
  2. ఇప్పుడు కాషాయ లేదా నారింజ రంగు కోసం టొమాటోలను, ఎర్ర మిరపకాయలను ముక్కలుగా కోసుకొని రెండు నిమిషాల పాటు వేయించి మెత్తని ప్యూరీలాగా రుబ్బుకోవాలి. మీకు టమోటా వద్దనుకుంటే దాని స్థానంలో క్యారెట్ ఉపయోగించవచ్చు. ఇలా రుబ్బుకున్న నారింజ రంగు ప్యూరీని ఇడ్లీ పిండిలో ఒక భాగానికి కలుపుకోండి.
  3. ఇప్పుడు ఆకుపచ్చ రంగు చేద్దాం. ఇప్పుడు కొత్తిమీర లేదా పుదీనా లేదా పాలకూర మీకు నచ్చిన ఏదో ఒక ఆకుకూరను ఎంచుకోండి, మిరపకాయతో కలిపి మెత్తని ప్యూరీ లాగా రుబ్బుకోండి, దీనిని మరొక భాగం ఇడ్లీ పిండికి కలుపుకోండి.
  4. ఇలా వేర్వేరుగా మూడు రంగుల్లో సిద్ధం చేసుకున్న ఇడ్లీ పిండిని ఇడ్లీకుక్కర్లో ఒక్కో పాత్రలో ఒక్కో రంగు పిండివేసి ఆవిరి మీద ఉడికించాలి.

అంతే, తీసి చూస్తే తిరంగా ఇడ్లీలు రెడీ. సర్వింగ్ ప్లేట్ లో మూడు రంగుల ఇడ్లీలను వరుస క్రమంలో పేర్చి మీకు నచ్చిన చట్నీతో తినండి.

హాయిగా టీవీ ముందు కూర్చొని రిపబ్లిక్ డే పరేడ్, ఇతర కార్యక్రమాలను చూస్తూ ఆస్వాదించండి. మీకు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

టాపిక్

తదుపరి వ్యాసం