Happy Republic Day 2023। గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. మీ దేశభక్తిని ఘనంగా చాటడానికి ఇవిగో సందేశాలు!-happy republic day 2023 wishes telugu greetings patriotic messages quotes to share with your proud fellow indians ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Happy Republic Day 2023 Wishes, Telugu Greetings, Patriotic Messages, Quotes To Share With Your Proud Fellow Indians

Happy Republic Day 2023। గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. మీ దేశభక్తిని ఘనంగా చాటడానికి ఇవిగో సందేశాలు!

HT Telugu Desk HT Telugu
Jan 25, 2023 07:19 PM IST

Happy Republic Day 2023: భారతదేశం 2023 జనవరి 26న తన 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. భారతీయులుగా మన దేశంపై కృతజ్ఞతా భావాన్ని తెలియజేయడానికి, దేశ భక్తిని చాటడానికి మీ తోటి పంచుకోగల గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, Republic Greetings Telugu, సందేశాలు, సూక్తులు ఇక్కడ చూడండి.

Happy Republic Day 2023 Wishes Telugu
Happy Republic Day 2023 Wishes Telugu

ప్రతి సంవత్సరం జనవరి 26న, భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని చాలా వైభవంగా, ఉత్సాహంతో జరుపుకుంటాం. ఈ సంవత్సరం దేశం తన 74వ గణతంత్ర దినోత్సవం జరుపుకోనుంది. ఇది 1950లో జనవరి 26న భారత రాజ్యాంగం ఆమోదం పొందడాన్ని సూచిస్తుంది. భారతదేశం 1947లో వలస పాలన నుండి స్వాతంత్య్రం పొందినప్పటికీ, జనవరి 26, 1950 వరకు భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. దీని తరువాత, భారతదేశం తన స్వంత రాజ్యాంగం కలిగిన ఒక సార్వభౌమ రాజ్యంగా అవతరించింది. అప్పటి నుంచి ఒక ప్రజాపరిపాలన వ్యవస్థ కలిగిన గణతంత్ర దేశంగా భారతదేశం తనని తాను ప్రకటించుకుంది.

రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఏడాది న్యూఢిల్లీలోని కర్తవ్య మార్గంలో ఘనంగా వేడుకలు జరగనున్నాయి. ఇందులో భాగంగా దేశ సంప్రదాయం, సాంస్కృతిక వారసత్వం, గత 74 ఏళ్లలో దేశం సాధించిన పురోగతి, విజయాలు, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రదర్శనలు, గ్రాండ్ పరేడ్ ఉంటుంది. మరెన్నో కార్యక్రమాలు వరుసగా జరగనున్నాయి.

గణతంత్ర దినోత్సవం ఒక జాతీయ పండుగ, దేశంలోని ప్రతి పౌరుడు ఉత్సుకతతో సాక్ష్యమివ్వడానికి ఎదురుచూస్తున్న రోజు. సుసంపన్నమైన, బహువిధమైన భారతదేశ ఔన్నత్యాన్ని ఎలుగెత్తి సగర్వంగా ప్రపంచానికే చాటే ఒక సందర్భం ఇది.

ఈ గణతంత్ర దినోత్సవం 2023 సందర్భంగా, మీరు మీ తోటి భారతీయులతో పంచుకోగల గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, స్ఫూర్తిదాయకమైన సందేశాలు, దేశభక్తి సూక్తులు Happy Republic Day 2023 Wishes, Republic Greetings Telugu, Republic Day Quotes ఇక్కడ ఉన్నాయి. వీటిని మీ సోషల్ మీడియా ద్వారా మీ మిత్రులకు షేర్ చేస్తూ మీ దేశభక్తిని చాటండి, భారతీయుడిగా గర్వపడండి.- జైహింద్!

Happy Republic Day- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

మనమంతా భారతీయులం.. అందరూ కలిసి ఐక్యంగా ఉండటమే మన తత్వం- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

Happy Republic Day 2023 Wishes Telugu
Happy Republic Day 2023 Wishes Telugu

మీరు ఈ ప్రపంచంలో చూడాలనుకుంటున్న మార్పు మీరే అవ్వండి.. నాయకుడిగా మార్గనిర్ధేశనం చేయండి. మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం. మన గొప్ప భారత రాజ్యాంగ మూల స్తంభాలకు వందనం. మన త్రివర్ణ పతాకం ఎప్పుడూ ఎత్తుగా ఎగరాలి. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

Happy Republic Day 2023 Wishes Telugu
Happy Republic Day 2023 Wishes Telugu

మన ఘనమైన భరతజాతికి శతకోటి వందనాలు. మీకు, నాకు, మనందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

Happy Republic Day 2023 Wishes Telugu
Happy Republic Day 2023 Wishes Telugu

ఉన్నతమైన చరిత్ర, మహోన్నతమైన వారసత్వం కలిగిన దేశంలో జీవిస్తున్నందుకు గర్వపడండి. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

Happy Republic Day 2023 Wishes Telugu
Happy Republic Day 2023 Wishes Telugu

దేశానికి కాపు కాచే సైనికులకు సెల్యూట్, దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు సెల్యూట్, మన భారతదేశానికి పెద్ద సెల్యూట్- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

భారతీయులందరికీ హిందూస్తాన్ టైమ్స్ - తెలుగు తరఫున 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్