తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken With Skin : స్కిన్‌తో చికెన్ తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

Chicken With Skin : స్కిన్‌తో చికెన్ తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

Anand Sai HT Telugu

20 February 2024, 14:00 IST

    • Chicken With Skin In Telugu : చాలా మంది స్కిన్ లెస్ చికెన్ తినేందుకు ఇష్టపడాతరు. కానీ ఆరోగ్యపరంగా చికెన్ ఎలా తినడం మంచిదని ఎప్పుడైనా ఆలోచించారా?
చికెన్ స్కిన్ ప్రయోజనాలు
చికెన్ స్కిన్ ప్రయోజనాలు

చికెన్ స్కిన్ ప్రయోజనాలు

మీరు చికెన్ షాప్‌కి వెళ్లినప్పుడు కచ్చితంగా స్కిన్ లెస్ చికెన్ ఇవ్వమని అడుగుతారు. దుకాణాదారుడు కూడా మీకు ఏది కావాలని ప్రశ్నిస్తాడు. అంటే స్కిన్ ఉంచాలా? వద్దా అని ప్రశ్న వేస్తాడు. వందలో 90 మంది స్కిన్ లెస్ చికెన్ కావాలనే అడుగుతారు. ఆ తర్వాత కేవలం చర్మంతో మాంసం మాత్రమే ఇస్తాడు. చర్మం వద్దనుకునే వారు అందులో కొవ్వు, కొలెస్ట్రాల్, గుండెకు మంచిది కాదంటూ కారణాలు చెబుతారు.

ట్రెండింగ్ వార్తలు

Milk Ghee Benefits : రాత్రి పడుకునే ముందు పాలలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని తాగండి

Nude Boat Trip : బట్టలు లేకుండా 11 రోజులు న్యూడ్ బోట్ ట్రిప్.. నగ్నంగా ఉంటేనే అనుమతి!

Egg Masala Fry: కోడిగుడ్డు మసాలా వేపుడు ఇలా చేశారంటే లొట్టలు వేసుకొని తింటారు, రెసిపీ ఇదిగో

Never Eat Foods : ఖాళీ కడుపుతో ఈ 5 ఆహారాలు తినకండి.. ఎందుకో తెలుసుకోండి

కానీ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, కోడి చర్మం ఆరోగ్యానికి మంచిది. కానీ దాని పరిమాణం మితంగా ఉండాలి. అంటే తక్కువ మెుత్తంలో తినాలి. అంటే మాంసంతో పాటు కొంచెం తోలు ఉంటే టేస్టీగా, హెల్తీగా ఉంటుందన్నమాట. మనందరం అనుకునే విధంగా చికెన్ స్కిన్ అంత చెడ్డది కాదు. దీని గురించి కచ్చితంగా తెలుసుకుందాం..

చికెన్ చర్మంతో తినవచ్చు

కొవ్వు విషయానికి వస్తే, ఒక ఔన్స్ చికెన్ చర్మంలో కేవలం ఎనిమిది గ్రాముల అసంతృప్త కొవ్వు, మూడు గ్రాముల సంతృప్త కొవ్వు ఉంటుంది. చర్మాన్ని పరీక్షించిన నిపుణులు అందులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు (లేదా ఒలీక్ యాసిడ్) ఉన్నట్లు గుర్తించారు. ఈ యాసిడ్ యొక్క ప్రయోజనాల్లో ఒకటి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అంటే మనం ఇప్పటివరకు భయపడినట్లుగా ఇది కార్డియాక్ అరెస్ట్ ప్రమాదాన్ని పెంచదు. దానిని తగ్గిస్తుంది. ఇది శరీరంలోని హార్మోన్ల పరిమాణాన్ని కూడా నియంత్రిస్తుంది.

స్కిన్ లెస్ అయితే నూనె ఎక్కవగా కావాలి

చికెన్ తినేవాళ్లు క్యాలరీల గురించి చాలా ఆందోళన చెందుతారు. కానీ చికెన్ స్కిన్ లేని మాంసంలో కేలరీలలో తేడా ఎక్కువగా లేదు. చర్మంపై ఉన్న మాంసంలో కొన్ని కేలరీలు మాత్రమే ఎక్కువగా ఉంటాయి. చర్మంతో మాంసం తక్కువ నూనెను గ్రహిస్తుంది. చర్మం లేని మాంసం ఎక్కువ నూనెను తీసుకుంటుంది. చికెన్ వండేప్పుడు స్కిన్ లెస్ అయితే నూనె ఎక్కువగా కావాలి. వంట సమయంలో ఎక్కువ నూనె వేయాలి.

కానీ మీరు చర్మంతో ఎక్కువ మాంసం తినగలరా? తినలేరని చెప్పాలి. చర్మం ఉంటే చూసేందుకు, తినేందుకు బాగా అనిపించదు. ఎందుకంటే చర్మం పరిమాణం పెరిగితే, అది శరీరంలో మంటను కలిగిస్తుంది. అందుకే చికెన్ తెచ్చుకునేప్పుడు మితమైన చర్మం కలిగి ఉండటం చాలా ముఖ్యం.

మీరు చర్మంతో చికెన్ మాంసం తింటే చాలా తినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు తక్కువ మొత్తంతో సంతృప్తి చెందవచ్చు. కానీ చర్మం లేని మాంసాహారం తింటే ఎంత తిన్నా తృప్తి కలగదు. మరింత ఎక్కువగా తినాలనే ఉత్సాహం వస్తుంది.

మీరు మాంసం ఫ్రై చేయాలని చూస్తే.. చర్మం క్రిస్పీగా మారే వరకు వేయించవద్దు. ఎందుకంటే నల్లటి చర్మం దానిలోని అన్ని మంచి లక్షణాలను కోల్పోయేలా చేస్తుంది. నలుపులో కొంత భాగం ఆరోగ్యానికి హాని కలిగించే కార్బన్‌గా మారుతుంది.

చికెన్ రోజూ తినవచ్చా?

అయితే మరో ముఖ్య విషయం ఏంటంటే.. ప్రతిరోజూ చికెన్ తినడం వల్ల శరీరంలో ప్రోటీన్ అధికంగా పేరుకుపోతుంది. దీనిని తగ్గించాలి. వారంలో ఒక్కసారి తింటే సరిపోతుంది. అలాగే ఎక్కువగా తింటే ఎముకల సమస్యలు కూడా వస్తాయి. చికెన్‌లో ఒక రసాయనం ఉంటుంది, ఇది పెద్దప్రేగు క్యాన్సర్‌కు కారణమవుతుంది. ప్రతిరోజూ చికెన్ తినకూడదు.

చికెన్‌లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. చికెన్‌ని తరచుగా తీసుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. చికెన్ తినడం వల్ల శరీరంలో అధికంగా వేడి చేరుతుంది. ప్రతిరోజూ తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది అనేక అనారోగ్యాలకు కారణం అవుతుంది. చికెన్‌లో కొవ్వు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజూ తింటే బరువు పెరిగే అవకాశం ఉంది.

చికెన్లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పోషకాలతో నిండిన ఆహారం. అయితే అధికంగా తినడం మాత్రం ప్రమాదం. ప్రతిరోజూ చికెన్ తినాలనుకుంటే రోజుకు 50 గ్రాములకు మించి తినకపోవడమే మంచిది. అందుకే చికెన్ ఎక్కువగా తినకూడదు.

తదుపరి వ్యాసం