తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cannes 2023: ఊర్వశి ఈకల డ్రెస్సు.. కార్టూన్ లాగా ఉందంటూ కామెంట్లు..

Cannes 2023: ఊర్వశి ఈకల డ్రెస్సు.. కార్టూన్ లాగా ఉందంటూ కామెంట్లు..

23 May 2023, 13:35 IST

google News
  • Cannes 2023: ఊర్వశి రౌటెలా కేన్స్ లో ఆకుపచ్చ ఫెదర్ డ్రెస్ లో కనిపించారు. ఈ డ్రెస్ మీద బోలెడు కామెంట్లు వస్తున్నాయి. అవేంటో చూడండి. 

కేన్స్ లో ఊర్వశి రౌటెలా
కేన్స్ లో ఊర్వశి రౌటెలా (AFP, Reuters)

కేన్స్ లో ఊర్వశి రౌటెలా

కేన్స్ రెడ్ కార్పెట్ మీద ఊర్వశి రౌటెలా మరో విచిత్ర లుక్ లో కనిపించారు. ఇది వరకే బల్లి నెక్ లేస్ వేసుకుని వార్తల్లో నిలిచారు. ఇదివరకు ఐశ్వర్యా రాయ్ వేసుకుని ఆశ్చర్యపరిచిన పర్పుల్ లిప్ స్టిక్ అనకరించినట్లు ముదురు నీలి రంగు లిప్ స్టిక్ వేసుకుని బోల్డ్ గా కనిపించింది ఊర్వశి. ఇపుడు ఈ ఆకుపచ్చ ఈకల డ్రెస్సు ఇంటర్నెట్ టాపిక్ అయిపోయింది.

కేన్స్ లో ఊర్వశి:

Urvashi Rautela wears a feather dress for her latest Cannes appearance.

సీక్వెన్లతో ఉన్న ఫ్లూర్ లెంత్ గైను మీద మొత్తం ముదురు ఆకుపచ్చ ఈకలతో ఉందీ డ్రెస్సు. జియాద్ నికద్ 2023 కలెక్షన్ నుంచి తీసుకున్నారీ డ్రెస్సు. తలపై ఈ డ్రెస్ కి నప్పే అవే ఈకలతో చేసిన కిరీటం లాంటి అమరిక, వేళాడే చెవి పోగులు, చేతికి ఉంగరాలు, బోల్డ్ ఐ మేకప్, హెవీ కాంటౌరింగ్ తో లుక్ పూర్తి చేశారు.

Diet Sabya shares Urvashi Rautela's latest Cannes look on Instagram.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటోలపై భిన్న కామెంట్లు వస్తున్నాయి. ఒకరు పెద్ద పక్షిలాగా ఉన్నావంటే, ఇంకొకరు మప్పెట్ క్యారెక్టర్ అంటూ తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు.

ఊర్వశి, పొకిమాన్ కార్టూన్ లో ఉండే జంతువులను కొలాజ్ చేసి ఆ ఫొటోకు క్యాప్షన్ పెట్టండంటూ ఒక ఫ్యాషన్ అకౌంట్ లో పోస్ట్ కనిపించింది. ఒకరేమో “మా అమ్మ నాకు నేను ఆరో తరగతిలో ఉన్నపుడు డ్రెస్ పార్టీ కోసం ఈ చిలక డ్రెస్ తయారు చేసింది” అని కామెంట్ చేశారు. ఆ స్టైలిస్ట్ ను ఏదైనా చేసేయ్ దేవుడా అంటూ ఇంకొకరు, కేన్స్ లో ఈ డ్రెస్ ను నమ్మలేకపోతున్నా అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం