తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mirror Technique: పిల్లల్ని సక్సెస్ చేయాలనుకుంటే అద్దం టెక్నిక్ వాడండి, ఇలా చదివితే మంచి మార్పు

Mirror Technique: పిల్లల్ని సక్సెస్ చేయాలనుకుంటే అద్దం టెక్నిక్ వాడండి, ఇలా చదివితే మంచి మార్పు

08 October 2024, 12:30 IST

google News
  • Mirror Technique: పిల్లల్లో చదువు మీద ఏకాగ్రత పెరిగి ముందంజలో ఉండాలంటే అద్దం టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. అద్దం ముందు కూర్చుని చదివితే ఎలాంటి లాభాలుంటాయో తెల్సుకోండి. 

పిల్లలను మెరుగుపరిచే అద్దం టెక్నిక్
పిల్లలను మెరుగుపరిచే అద్దం టెక్నిక్ (Shutterstock)

పిల్లలను మెరుగుపరిచే అద్దం టెక్నిక్

తమ పిల్లలు బాగా చదువుకుని, మంచి స్థాయిలోకి ఎదగాలనేది ప్రతి తల్లిదండ్రుల కల. కానీ అందరు పిల్లలు చదువు మీద అంత ఏకాగ్రత, దృష్టి పెట్టలేరు. దాంతో చదువులో కాస్త వెనకబడిపోతుంటారు. లేదా చదవాలనే ఆసక్తి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల చదివిందేదీ గుర్తుండదు. 

అందుకని, జ్ఞాపకశక్తిని పెంచడానికి మీరు చాలా చిట్కాల గురించి ప్రయత్నించే ఉంటారు. కానీ పిల్లల ఏకాగ్రత పెంచడంలో నిజంగానే సాయపడే ఒక విధానం గురించి తెల్సుకోండి. అద్దం ముందు పెట్టుకుని చదవడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అసలు అద్దం ఎలా పెట్టుకోవాలి, దాని ప్రయోజనాలేంటో తెల్సుకోండి.

స్వీయ ప్రేరణ:

ఎక్కువసేపు నిద్ర పోకుండా చదువుపై ఏకాగ్రత, దృష్టి పెట్టడం కష్టం అయిన విషయమే. ఇందుకోసం నిరంతరం స్వీయ ప్రేరణ పొందడం అవసరం. ఈ పనిలో అద్దం సాయం చేస్తుంది. పిల్లలు చదువుకునేటప్పుడు తమను తాము చూసుకునేలా వాళ్ల ముందు అద్దం పెట్టండి. దీనితో చదువుకునేటప్పుడు వాళ్లను వాళ్లు  చూసినప్పుడు, లోపలి నుండి స్వీయ ప్రేరణ అనుభూతి చెందుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ చిన్న మార్పు మానసికంగా పిల్లలను ప్రేరేపించడానికి సహాయపడుతుంది.

ఆత్మ విశ్వాసం:

ఈ రోజుల్లో చదువుతో పాటూ కమ్యునికేషన్ స్కిల్స్ ముఖ్యమే. వాళ్ల అభిప్రాయాలు, వ్యక్తిత్వాలు తీర్చిదిద్దడంలో ఇవి చాలా అవసరం. అనుకున్న విషయాన్ని స్పష్టంగా, నిర్భయంగా చెప్పే నేర్పు ఉండాల్సిందే. అయితే కొందరు పిల్లల్లో ఏం మాట్లాడాలన్నా జంకు ఉంటుంది. అది పోగొట్టడంలో అద్దం సాయం చేస్తుంది. 

దాని ముందు నిలబడి మాట్లాడటం ప్రాక్టీస్ చేస్తారు. వాళ్లెలా మాట్లాడాలో వాళ్లకి అర్థం అవుతుంది. దాంతో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఈ ధైర్యంతో చదువులోనూ ముందంజలో ఉంటారు. వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం మెరుగవుతుంది. 

మతి మరుపు:

పిల్లవాడు చాలా చదువుతాడు కాని తర్వాతంతా మరచిపోతాడు. ఈ కంప్లెయింట్ పిల్లల విషయంలో చాలా మంది తల్లిదండ్రుల్లో ఉండేదే. దీనికోసం మిర్రర్ టెక్నిక్ అవలంభించవచ్చు. పిల్లలు అద్దంలో తమను తాము చూసుకుంటూ ఏదైనా మాట్లాడినప్పుడు లేదా చదివేటప్పుడు అద్దంలో చూస్తూ గుర్తుంచుకున్నప్పుడు, ఈ దృశ్య రూపక జ్ఞాపకం వారి మనస్సులో పాతుకుపోతుంది. దాంతో వారు చదివిన విషయాలను చాలా సులభంగా గుర్తుంచుకుంటారు.

టాపిక్

తదుపరి వ్యాసం