Vitamin E for Skin: విటమిన్ E నిండిన ఈ ఆహారాలను తింటే పదిరోజుల్లో చర్మం మెరుపు ఖాయం
20 December 2023, 7:43 IST
- Vitamin E for Skin: చర్మం మెరవాలంటే విటమిన్ E నిండుగా ఉన్న ఆహారాలను ప్రతిరోజూ తినాలి.
చర్మ ఆరోగ్యానికి విటమిన్ ఇ
Vitamin E for Skin: ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని ఎవరు మాత్రం కోరుకోరు? మీరు బయట నుంచి ఎన్ని ఉత్పత్తులు చర్మానికి పూసినా సహజమైన కాంతి రాదు. చర్మం సహజమైన కాంతితో మెరవాలంటే లోపల నుండి పోషణ అందాలి. ముఖ్యంగా విటమిన్ E నిండిన ఆహారాలను అందిస్తే చర్మం మెరుస్తుంది. చర్మానికి కాంతిని అందించేది విటమిన్ E. ఎప్పుడైతే ఇది లోపిస్తుందో అప్పుడు మీ చర్మం పేలవంగా మారుతుంది. కాబట్టి ప్రకాశంవంతమైన చర్మం కోసం విటమిన్ E నిండుగా ఉండే ఆహారాలను తినడం అలవాటు చేసుకోవాలి. ఇవి సహజమైన మెరుపును అందిస్తాయి.
విటమిన్ E నిండుగా ఉండే ఆహారాలు
పాలకూర, బొప్పాయి వంటివి తరచూ తింటూ ఉండాలి. ఇందులో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలతో పాటు చర్మాన్ని మెరిపించే విటమిన్ E నిండుగా ఉంటుంది. చర్మానికి అవసరమైన రోగనిరోధక వ్యవస్థకు ఇది బలాన్ని ఇస్తుంది. కాబట్టి మొటిమలు, ఇతర చర్మ సమస్యలు రాకుండా దూరంగా ఉంచుతుంది. ఒక కప్పు పాలకూరలో విటమిన్ E, విటమిన్ సి, విటమిన్ కే, ఐరన్, పొటాషియం వంటివి అధికంగా ఉంటాయి. ఇది ఈ పాలకూరను తినడం వల్ల చర్మానికి అందుతాయి. చర్మంపై గీతలు, ముడతలు త్వరగా రావు.
అవకాడో పండ్లు ప్రతి సూపర్ మార్కెట్లోను లభిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యానికి ఇది అవసరం. దీనిలో విటమిన్ సి, పొటాషియం, విటమిన్ E తగిన మోతాదులో ఉంటాయి. ఇవన్నీ కూడా యాంటీఏజింగ్ లక్షణాలను కలిగి ఉన్నవి. చర్మంపై ఉన్న ముడతలు, మచ్చలను తగ్గిస్తాయి. దీనిలో లినోలెయిక్, ఒలేయిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా మారుస్తాయి. ప్రతిరోజు ఒక అవకాడో పండును తినాలి. పది రోజుల్లోనే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
ప్రతిరోజూ బాదంపప్పును తినడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడి చర్మం రాకుండా ఉంటుంది. రాత్రి బాదంపప్పును నానబెట్టుకొని ప్రతిరోజూ ఉదయం తింటే ఎంతో మంచిది. దీనిలో ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడే శక్తిని చర్మానికి ఇస్తుంది.
సూపర్ ఫుడ్లలో బ్రకోలి కూడా ఒకటి. దీనిలో కాల్షియం, విటమిన్ సి, ఐరన్, ప్రీబయోటిక్ ఫైబర్ నిండి ఉంటాయి. రెండు రోజులకు ఒకసారి బ్రకోలీ తిన్నా చాలు. చర్మ ఆరోగ్యం బాగుంటుంది. రకరకాల ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. ఇందులో ఉండే పోషకాలు.. చర్మ ఆరోగ్యాన్ని కాపాతాయి.
పొద్దు తిరుగుడు గింజలు తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తాయి. వీటిని సలాడ్లు లేదా పెరుగుపై చల్లుకొని ప్రతిరోజూ తినడం అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన చర్మానికి రోగనిరోధక శక్తికి ఈ పొద్దు తిరుగుడు గింజలు ఎంతో మేలు చేస్తాయి. దీనిలో కాల్షియం, పొటాషియం, ప్రోటీన్, ఫైబర్, జింక్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీ చర్మానికి అవసరమైనవి. ఇవి చర్మానికి కాంతిని సహజంగానే అందిస్తాయి.
వేరుశనగ పలుకులను ప్రతిరోజూ రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే లేచి వాటిని తినడం అలవాటు చేసుకోవాలి. దీన్ని చిరుతిండిగా భావించండి. ఇవి చర్మాన్ని హైడ్రేటింగ్ చేయడంతో పాటు శరీరానికి, చర్మానికి కావాల్సిన కొవ్వు ఆమ్లాలను అందిస్తాయి. బ్యాక్టీరియాతో పోరాడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి చర్మం, శరీరం ఇన్ఫ్లమేషన్ రాకుండా తట్టుకుంటాయి.
పైన చెప్పిన ఆహారాలను ప్రతిరోజూ తింటే మీ చర్మం పది రోజుల్లోనే మెరుపును సంతరించుకుంటుంది. అలాగే ముడతలు, గీతలు వంటివి రాకుండా ఉంటాయి.