IBPS RRB క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!
09 September 2022, 14:34 IST
- IBPS RRB Clerk result 2022 Direct Link: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) RRB గ్రూప్ B ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫలితాలను తన అధికారిక వెబ్‌సైట్ ibps.inలో విడుదల చేసింది.
IBPS RRB Clerk result 2022
RRB గ్రూప్ B ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ (IBPS RRB CRP RRBs XI గ్రూప్ B ఆఫీస్ అసిస్టెంట్స్) ఫలితాలను విడుదలయ్యాయి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) అధికారిక వెబ్‌సైట్ ibps.in ద్వారా ఈ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. IBPS RRB ఆఫీస్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ ప్రిలిమ్స్ పరీక్ష 7, 13, 14 ఆగస్టు 2022లో జరిగింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈరోజు ibps.inలో తమ ఫలితాలను చూసుకోవచ్చు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన వారిని మెయిన్స్‌కు పిలుస్తారు. మెయిన్స్ పరీక్షను అక్టోబర్ 1న ప్రతిపాదించారు.
IBPS RRB Clerk Result 2022: ఫలితాన్ని ఎలా చెక్ చేసుకోవాలి.
ముందుగా www.ibps.inని సందర్శించండి.
లింక్‌పై క్లిక్ చేయండి “CRP-RRBs-XI ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) కోసం ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రిజల్ట్ పేజీ ఓపెన్ కాగానే మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్, మీ పుట్టిన తేదీని నమోదు చేయండి.
ఫలితం కనిపిస్తుంది.
ఈ రిక్రూట్‌మెంట్ పరీక్ష ద్వారా మెుత్తం 8106 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు
ఆఫీస్ అసిస్టెంట్ – 4483
ఆఫీసర్ స్కేల్ I – 2676
ఆఫీసర్ స్కేల్ II జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ – 754
ఆఫీసర్ స్కేల్ సెకండ్ ఐటి ఆఫీసర్ – 57
ఆఫీసర్ స్కేల్ సెకండ్ సిఎ – 19
ఆఫీసర్ స్కేల్ సెకండ్ లా ఆఫీసర్ – 18
ట్రెజరీ ఆఫీసర్ స్కేల్ సెకండ్ – 10
మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ సెకండ్ - 06
అగ్రికల్చర్ ఆఫీసర్ స్కేల్ II - 12
ఆఫీసర్ స్కేల్ II - 80
IBPS RRB క్లర్క్ మెయిన్స్ పరీక్షా సరళి 2022:
మెయిన్స్ పరీక్షలో 200 ప్రశ్నలను ఉంటాయి. వీటిని పరిష్కరించడానికి రెండు గంటల సమయం ఉంటుంది. రీజనింగ్‌లో 50 మార్కులకు 40 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో 50 మార్కులకు 40 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్‌లో 40 మార్కులకు 40 ప్రశ్నలు, ఇంగ్లీషు హిందీ భాష నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి.