Hyundai Venue N Line : భారత్‌లో గ్రాండ్‌గా లాంచ్.. దీని ధర రూ.12.16 లక్షలు
06 September 2022, 12:49 IST
- Hyundai Venue N Line : Hyundai Venue N Lineను ఈరోజు భారతదేశంలో లాంచ్ చేశారు. ఇప్పటికే బుకింగ్‌ను అంగీకరించడం ప్రారంభించింది. అయితే ఆకట్టుకునే ఫీచర్లతో.. అదిరిపోయే డిజైన్‌తో వాహన ప్రియులను ఆకట్టుకుంది. మరి వాటి సంగతేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Hyundai Venue N Line
Hyundai Venue N Line : హ్యుందాయ్ ఈ రోజు (సెప్టెంబర్ 6) భారతదేశంలో తన కొత్త వెన్యూ ఎన్ లైన్‌ను విడుదల చేసింది. ధర రూ. 12.16 లక్షలతో దీనిని ప్రారంభించారు. . హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్.. భారతదేశంలోని హ్యుందాయ్ ఎన్ లైన్ విభాగం నుంచి గత సంవత్సరం ప్రారంభించిన హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ తర్వాత రెండవ వాహనం. హ్యుందాయ్ ఇప్పటికే కొత్త హ్యుందాయ్ ఎన్ లైన్ స్పోర్టీ ఎస్‌యూవీ కోసం బుకింగ్‌ను అంగీకరించడం ప్రారంభించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు హ్యుందాయ్ క్లిక్ టు బై ప్లాట్‌ఫారమ్‌లో లేదా దేశవ్యాప్తంగా ఉన్న హ్యుందాయ్ సిగ్నేచర్ అవుట్‌లెట్‌లలో రూ. 21,000తో కారును ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని తెలిపింది. హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. కంపెనీ ఇప్పటికే భారతీయ మార్కెట్ కోసం SUVని ప్రకటించింది.
రోబ్లాక్స్‌లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ మొబిలిటీ అడ్వెంచర్ అనుభవంలో కంపెనీ హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్‌ను మెటావర్స్‌లో లాంచ్ చేసింది. లాంచ్ ఇండియా జోన్, టెస్ట్ డ్రైవ్ ట్రాక్, వెన్యూ N లైన్ జోన్, షోరూమ్, సర్వీస్ సెంటర్, మినీ గేమ్, ఫోటో బూత్, ట్రెజర్ హంట్, N లైన్ మర్చండైజ్‌లతో సహా వివిధ వినూత్న మీడియా అనుభవాలను ఈ ఈవెంట్ వినియోగదారులకు అందించింది.
Hyundai Venue N Line ఇంజిన్
హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ 1.0 కప్పా టర్బో జిడిఐ పెట్రోల్ ఇంజన్, 2వ జెన్ 7-స్పీడ్ డిసిటితో అందుతుంది. ఇందులో పవర్‌ట్రెయిన్ గరిష్టంగా 88.3 kw (120 PS), 172 Nm గరిష్ట టార్క్‌ను కలిగి ఉంది.
Hyundai Venue N Line డిజైన్
డార్క్ క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, స్పోర్టీ టెయిల్‌గేట్ స్పాయిలర్, ఎన్ లైన్ ఎంబ్లెమ్, సైడ్ ఫెండర్‌లు, డైమండ్ కట్ అల్లాయ్‌లు, ఎన్ బ్రాండింగ్, ఎక్స్‌టీరియర్స్‌లో అథ్లెటిక్ రెడ్ హైలైట్‌లు, ఫ్రంట్ రెడ్ బ్రేక్ కాలిపర్‌లతో సహా హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ ప్రత్యేకమైన ఎన్ లైన్ స్టైలింగ్ ఎలిమెంట్‌లను అందిస్తుంది. హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ ప్రత్యేకంగా ట్యూన్ చేయబడిన సస్పెన్షన్, స్టీరింగ్ ట్యూనింగ్‌తో వచ్చింది. SUV స్పోర్టి ఎగ్జాస్ట్‌తో, మొత్తం 4 డిస్క్ బ్రేక్‌లతో డ్రైవింగ్ థ్రిల్‌ను మరింత పెంచుతుంది.