తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Morning Hug | ఉదయం పూట 20 సెకన్ల పాటు కౌగిలించుకుంటే ఆరోగ్యానికి మంచిదట!

Morning Hug | ఉదయం పూట 20 సెకన్ల పాటు కౌగిలించుకుంటే ఆరోగ్యానికి మంచిదట!

HT Telugu Desk HT Telugu

19 June 2022, 6:32 IST

    • ఉదయం పూట ఒక 20 సెకన్ల పాటు కౌగిలించుకుంటే జంటల్లో బంధం బలపడుతుంది, అలాగే మహిళల్లో ఒత్తిడి తగ్గి వారి ఆరోగ్యం బాగుపడుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి.
Hug
Hug (Unsplash)

Hug

ఆందోళన, బాధ ఉన్నప్పుడు ఆత్మీయుల చేతి స్పర్ష కూడా ఎంతో ఊరటనిస్తుంది. భుజంపై చేయివేసి నేనున్నానని తడితే చెప్పలేని ధైర్యం వస్తుంది. అలాగే ఉదయం పూట ఒక 20 సెకన్ల పాటు ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం వలన ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని ఇటీవలి పరిశోధనలో తేలింది. కానీ ఈ ట్రిక్ మహిళలకు మాత్రమే పనిచేస్తుందట.

అమెరికాకు చెందిన మనస్తత్వవేత్త డాక్టర్ కరెన్ ప్రకారం మహిళ తన భాగస్వామిని ఉదయం పూట ఒక 20 సెనన్లు లేదా అందకంటే ఎక్కువ సేపు గట్టిగా కౌగిలించుకోవాలి. ఇలా కౌగిలించుకున్నప్పుడు వారి శరీరంలో మంచి అనుభూతిని కలిగించే హార్మోన్ ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. ఈ ఆక్సిటోసిన్ ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుందని పేర్కొంది.

స్త్రీ,పురుషులిద్దరూ ఏ వయసు వారైనా కౌగిలించుకోవచ్చు. 19 నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సు గల జంటల్లో ఇది మెరుగైన ప్రభావాన్ని చూపినట్లు నిరూపితమైంది. అంతకన్నా ఎక్కువ వయసున్న వారిలోనూ మంచి ఫలితాలే కనిపించినట్లు అధ్యయనంలో వెల్లడైనట్లు నిపుణులు పేర్కొన్నారు.

కౌగిలి ఇద్దరు వ్యక్తుల మధ్య బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. మహిళల్లో సహజంగానే ఒత్తిడి తగ్గిపోతుంది. ఇది మనలో పారాసింపథెటిక్ వ్యవస్థకు సహాయపడుతుంది అంటే ధ్యానం చేసినపుడు కలిగే ఫలితం కలుగుతుంది. ఆత్మ విశ్వాసం మెరుగవుతుంది. సానుకూల దృక్పథంతో ముందుకు సాగవచ్చు అని చెప్తున్నారు.

పురుషులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

స్త్రీలు సున్నిత స్పర్శ కలిగిన వారు. వారి ఆత్మీయుల నుంచి పొందే సున్నిత స్పర్శతోనే వారు సంతృప్తి చెందుతారు. ఇదే వారికి ఆనందన్నిస్తుంది కాబట్టి వారిలో వారి శరీరంలో కార్టిసోల్ ఉత్పత్తి తగ్గుతుంది. ఈ క్రమంలో ఒత్తిడి తగ్గుతుంది. టెడ్డీ బేర్ వంటి నిర్జీవ వస్తువును తేలికగా కౌగిలించుకున్నప్పుడు కూడా వారిలో భయాలు పోయి, మరణం పట్ల తక్కువ ఆందోళన కలిగి ఉంటారు అని వెల్లడైంది. పురుషులు కౌగిలింతలో స్త్రీ పొందే ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పొందలేకపోచ్చు. వారూ ఈ రకమైన అనుభూతికి లోయయితే వారిలోనూ తగ్గుతుంది. ప్రకృతిలో ఒక చెట్టును కౌగిలించుకున్నా ఫలితం ఉంటుంది. నిరాశ నిస్పృహలు తగ్గి జీవితంపై ఆశావాదం పెరుగుతుంది. అని నిపుణులు పేర్కొన్నారు.

అయితే ఒక కౌగిలి స్త్రీ, పురుషులిద్దరి మధ్య బంధాన్ని బలోపేతం చేయడమే కాకుండా వారి హృదయ స్పందన రేటును పెంచుతుంది. ఇది వారి జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది. కాబట్టి సామాజిక, ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఒక 20 సెకన్ల పాటు కౌగిలించుకొమ్మని చెబుతున్నారు.

టాపిక్