తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Htc A101 । బడ్జెట్ ధరలో మరో కొత్త టాబ్లెట్‌ను విడుదల చేసిన హెచ్‌టిసి!

HTC A101 । బడ్జెట్ ధరలో మరో కొత్త టాబ్లెట్‌ను విడుదల చేసిన హెచ్‌టిసి!

HT Telugu Desk HT Telugu

06 July 2022, 15:20 IST

google News
    • HTC కంపెనీ HTC A101 పేరుతో బడ్జెట్ ధరలో టాబ్లెట్‌ను విడుదల చేసింది. ఇందులోని కొన్ని ఫీచర్లు బాగున్నాయి. దీని ధర, ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
HTC A101
HTC A101

HTC A101

డిజైర్ 22 ప్రోతో గత వారం తన మొదటి మెటావర్స్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన తైవాన్ టెక్ దిగ్గజం HTC ఇప్పుడు HTC A101 పేరుతో ఒక ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. ఇది బడ్జెట్ ధరలోనే లభించనుంచి అయినప్పటికీ మంచి ఫీచర్లను, స్పెక్స్‌ను కలిగి ఉంది. ఈ సరికొత్త టాబ్లెట్ నోకియా T20 టాబ్లెట్ పీసీకి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. అయితే దానికంటే స్క్రీన్ సైజులో స్వల్పంగా తగ్గుదల ఉంది. నోకియా T20 టాబ్లెట్ 10.4-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉండగా, HTC A101 టాబ్లెట్ 10.1-అంగుళాల LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. అయినప్పటికీ నోకియా T20 లాగా, HTC A101 కూడా దాని డిస్‌ప్లే చుట్టూ మందపాటి లైనింగ్ కలిగి ఉంది.

ఈ సరికొత్త HTC A101 టాబ్లెట్‌లో డ్యూయల్-కెమెరా సెటప్, LED ఫ్లాష్ ఉన్నాయి. ఇది బోకె మోడ్, 1080p వీడియో రికార్డింగ్ వంటి ఫోటోగ్రఫీ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. ఇందులోని సెల్ఫీ కెమెరా కూడా బ్యూటీ మోడ్, 720p వీడియో రికార్డింగ్ అలాగే AI ఫేస్ అన్‌లాక్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ టాబ్లెట్‌లో పోగో పిన్‌లు ఇచ్చారు, వీటితో కీబోర్డ్‌ను కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. హెచ్‌టిసి A101లో మిగతా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత? తదితర వివరాలను ఇక్కడ పరిశీలించండి.

HTC A101 టాబ్లెట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 10.1 అంగుళాల IPS LCD LCD డిస్‌ప్లే
  • 8 GB RAM, 128 GB స్టోరేజ్ సామర్థ్యం
  • Unisoc T618 ప్రాసెసర్
  • వెనకవైపు 13MP + 2MP డ్యుఎల్ కెమెరా సెటప్; ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
  • 7000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఫాస్ట్ ఛార్జర్

ఇవే కాకుండా HTC A101 టాబ్లెట్‌లో వాల్యూమ్ బటన్లు, పవర్ కీ, USB-C పోర్ట్ , 3.5mm ఆడియో జాక్‌, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.0, LTE, GPS ఉన్నాయి. టాబ్లెట్ బరువు 530 గ్రాములు. స్పేస్ గ్రే , మూన్ సిల్వర్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. గ్లోబల్ మార్కెట్లో దీని ధర సుమారు రూ. 25,900 ప్రస్తుతం రష్యాలో అందుబాటులోకి వచ్చింది, త్వరలో మిగతా మార్కెట్లలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

టాపిక్

తదుపరి వ్యాసం