తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pumpkin Seeds For Hair : జుట్టు పెరుగుదలకు గుమ్మడి గింజలు.. ఎలా ఉపయోగించాలి?

Pumpkin Seeds For Hair : జుట్టు పెరుగుదలకు గుమ్మడి గింజలు.. ఎలా ఉపయోగించాలి?

HT Telugu Desk HT Telugu

05 September 2023, 11:00 IST

    • Pumpkin Seeds For Hair : జుట్టు సంరక్షణకు మంచి ఆహారంతోపాటు.. జీవనశైలి పద్ధతులు చాలా ముఖ్యం. కొన్ని రకాల విత్తనాలు మీ జుట్టుకు మంచివి. జుట్టు పెరుగుదలకు గుమ్మడికాయ గింజలను ప్రయత్నించవచ్చు. వీటితో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
జుట్టుకు గుమ్మడి గింజలు
జుట్టుకు గుమ్మడి గింజలు

జుట్టుకు గుమ్మడి గింజలు

జుట్టు రాలడం(Hair Loss) అనేది ఈ రోజుల్లో సాధారణ సమస్య. వీటిని పరిష్కరించడానికి వివిధ సహజ మార్గాలు ఉన్నాయి. జుట్టు పెరుగుదలను(Hair Growth) పెంచడానికి గుమ్మడికాయ గింజలను(Pumpkin Seeds) ఉపయోగించవచ్చు. ఈ చిన్న పవర్‌హౌస్ అవసరమైన పోషకాలు, విటమిన్‌లతో నిండి ఉంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు రాలడానికి వ్యతిరేకంగా పోరాడుతాయి. మొత్తం జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ట్రెండింగ్ వార్తలు

Healthy Food: ఆ మూడింటిని ఎంత తక్కువగా తింటే అంత ఆరోగ్యమని చెబుతున్న వైద్యులు, వారి మార్గదర్శకాలు ఇదిగో

Bed Time Habit : మీకు రాత్రిపూట ఈ అలవాటు ఉంటే.. అది బంధానికి విలన్

Capsicum Pachadi: స్పైసీగా క్యాప్సికం పచ్చడి ఇలా చేసుకోండి, చూడగానే నోరూరిపోతుంది

Peepal Tree Leaves Benefits : రావి చెట్టు ఆకుల ప్రయోజనాలు మీకు నిజంగా తెలియవు

గుమ్మడి గింజలలో విటమిన్ ఎ, బి, సి, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్(Iron), కాపర్ వంటి సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉన్నాయి. గుమ్మడి గింజలలో ఉండే జింక్.. జుట్టు పెరుగుదలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది హార్మోన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రోటీన్ సంశ్లేషణకు మద్దతు ఇస్తుంది. కొత్త జుట్టు మూలాల పెరుగుదలకు ఈ ప్రక్రియలు అవసరం. మీ ఆహారంలో గుమ్మడి గింజలను చేర్చుకోవడం వల్ల అందులో జింక్ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన, బలమైన జుట్టు(Strong Hair) పెరుగుదలను సులభతరం చేస్తుంది.

గుమ్మడికాయ గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు జుట్టును బలోపేతం చేయడంలో, జుట్టు నిర్మాణాన్ని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ స్కాల్ప్ ను మాయిశ్చరైజ్ చేసి, డ్రైనెస్, ఇరిటేషన్ ని నివారిస్తుంది. విరిగిన జుట్టుకు కూడా గుమ్మడి గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి.

మంచి జుట్టు పెరుగుదలకు ఆరోగ్యకరమైన తల చర్మం అవసరం. గుమ్మడి గింజల్లో విటమిన్ ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శిరోజాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది. శిరోజాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుమ్మడికాయ గింజలు(Pumpkin Seeds) తినడం వల్ల స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్‌తో పోరాడుతుంది. జుట్టు పెరుగుదలకు సరైన పరిస్థితులను ప్రోత్సహిస్తుంది. గుమ్మడికాయ గింజలను రుచికరమైన చిరుతిండిగా తినవచ్చు. మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.

అంతేకాదు.. గుమ్మడికాయ గింజల నూనెను(Pumpkin Seeds Oil) కూడా మీరు ఉపయోగించవచ్చు. షాంపూలు, కండిషనర్లు, హెయిర్ మాస్క్‌లు వంటి వివిధ జుట్టు సంరక్షణ ఉత్పత్తులతోపాటుగా గుమ్మడి గింజల నూనెను వాడొచ్చు. నేరుగా తలకు అప్లై చేయవచ్చు. గుమ్మడి గింజల హెయిర్ మాస్క్(Pumpkin Seeds Hair Mask) కూడా తయారు చేసుకోవచ్చు.

గుమ్మడికాయ గింజల హెయిర్ మాస్క్ కు కావలసినవి.. గుమ్మడి గింజలు 1/2 కప్పు, తేనె 1 టేబుల్ స్పూన్, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, 1/2 కప్పు పెరుగు గుమ్మడి గింజలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పేస్ట్‌లా చేయడానికి పెరుగుతో కలపండి. అందులో తేనె, కొబ్బరి నూనె వేసి, అన్ని పదార్థాలను బాగా కలపాలి. హెయిర్ మాస్క్ మిశ్రమాన్ని పొడి లేదా తడిగా ఉన్న జుట్టుకు అప్లై చేయండి.

హెయిర్ మాస్క్‌ని మీ స్కాల్ప్‌కు సున్నితంగా మసాజ్ చేయండి. సుమారు 30 నిమిషాల నుండి గంట వరకు అలాగే ఉంచుకోవాలి. జుట్టును షవర్ క్యాప్‌తో కప్పుకోండి. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తరువాత, జుట్టును గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. షాంపూ, కండీషనర్‌ ఉపయోగించండి. గుమ్మడి గింజలు జుట్టు రాలడం సమస్యకు సహజమైన, సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తాయి. మీ జుట్టు సంరక్షణలో గుమ్మడి గింజలను ఉపయోగించండి.

తదుపరి వ్యాసం