తెలుగు న్యూస్  /  Lifestyle  /  How To Use Banana Peels To Treat Pigmentation And Acne Marks

అరటి తొక్కతో అద్భుత ప్రయోజనాలు!

HT Telugu Desk HT Telugu

28 May 2022, 20:22 IST

    • అరటిపండు తొక్కతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సారి అరటిపండు తిన్న తర్వాత, దాని తొక్కను విసిరే ముందు, వాటి ఉపయోగాలు గురించి తెలుసుకోండి. అరటి తొక్క ఎలా ఉపయోగించో ఇప్పుడు తెలుసుకుందాం.
banana peels
banana peels

banana peels

అరటిపండు తినడం వల్ల రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది. అరటిపండులో ఫైబర్, పొటాషియం వంటి అవసరమైన పోషకాలతో పాటు విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అరటి పండే కాకుండా, వాటి తొక్కతో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సారి అరటిపండు తిన్న తర్వాత, దాని తొక్కను విసిరే ముందు, వాటి ఉపయోగాలు గురించి తెలుసుకోండి. ఇక అరటి తొక్క ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

చర్మ సౌందర్యానికి అరటి తొక్క

అరటిపండు తొక్కను ముఖానికి రుద్దితే చర్మం మెరుగుపడటంతో పాటు ముఖంపై ముడతలు కూడా తగ్గుతాయి. అంతే కాకుండా అరటిపండు తొక్కను కళ్లపై ఉంచడం వల్ల వాపు తగ్గుతుంది. అరటి తొక్క చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. అలాగే మొటిమలు నిర్మూలించడంలో సహాయపడుతుంది. అంతే కాదు, సోరియాసిస్ ఉన్న ప్రదేశంలో అరటి తొక్కను పూయడం వల్ల దురద నుండి ఉపశమనం లభిస్తుంది. మరోవైపు, ఎవరికైనా మొటిమల సమస్య ఉంటే, బాగా పండిన అరటిపండు తొక్కను మొటిమపై రుద్ది, రాత్రంతా ఉంచితే, ఉదయానికి మొటిమ తొలగిపోతుంది.

జుట్టు మెరుగుదల

సహజ ఉత్పత్తులు అరటి తొక్కను హెయిర్ మాస్క్‌గా ఆరోగ్య, సౌందర్య సాధనంగా ఉపయోగించవచ్చు. అరటిపండు తొక్కలు జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తాయి. అరటిపండు తొక్కలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి. దీని వల్ల, జుట్టును బలంగా. ఆరోగ్యంగా ఉంచవచ్చు.

దంతాలు, చిగుళ్ళకు ఉపయోగపడుతుంది

అరటిపండు తొక్కను దంతాల మీద రుద్దడం వల్ల దంతాలు, చిగుళ్లకు మేలు జరుగుతుందని నేచురల్ రెమెడీస్ నిపుణులు చెబుతున్నారు. వారం పాటు నిరంతరం ఉపయోగిస్తే, దంతాలు తెల్లగా, మెరిసేలా చేయవచ్చు.

వడదెబ్బ, దురద నుండి ఉపశమనాన్ని అందిస్తుంది

సన్‌బర్న్, పాయిజన్ ఐవీ రాష్ లేదా కీటకాల వల్ల వచ్చే దురదలో కూడా అరటి తొక్క ప్రభావవంతంగా ఉంటుంది. తలనొప్పి విషయంలో గడ్డకట్టిన అరటిపండు తొక్కలను నుదుటిపైన, మెడ వెనుక భాగంలో ఉంచితే నొప్పి తగ్గుతుంది.