తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Drinking Water: నీటిని ఎలా తాగితే మంచిదో తెలుసా?

Drinking water: నీటిని ఎలా తాగితే మంచిదో తెలుసా?

HT Telugu Desk HT Telugu

03 August 2024, 22:01 IST

google News
    • శరీరం హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి తాగునీరు చాలా ముఖ్యం. నీరు ఆరోగ్యంపై  గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అయితే తాగే నీరు అతి ముఖ్యమైన అంశం కాబట్టి.. ఏ పాత్రలో నీరు త్రాగాలి. ఏ పాత్రలో నీళ్లు తాగితే ఎలాంటి లాభాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం
Drinking water
Drinking water

Drinking water

ఆరోగ్యవంతమైన జీవనం కోసం ప్రతి రోజు తగినంత తగినంత నీరు త్రాగటం ఎంతో ముఖ్యం. ప్రతిరోజు సరైన మోతాదులో నీటిని తాగడమే కాకుండా వాటిని ఎలా తాగుతున్నామనేది కూడా అంతే ముఖ్యం. నీటిని తీసుకునే పాత్ర విషయంలో చేసే పొరపాట్ల కారణంగా హానికరమైన రసాయనాలు, కణాలు శరీరంలోకి వెళ్తాయి. కావున, సరైన పాత్రలో నీరు త్రాగటం చాలా ముఖ్యం. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, సరైన పాత్ర ద్వారా నీరు త్రాగాలి. నీరు త్రాగడానికి ఎలాంటి పాత్రను ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం

1) గాజు

నీరు త్రాగడానికి గ్లాస్ చాలా మంచి ఆప్షన్. గ్లాస్ ఒక జడ పదార్థం. నీటిని గాజు సీసాలో ఉంచినప్పుడు, అది నీటి నాణ్యతను ఏ విధంగానూ ప్రభావితం చేయదు. అయితే మీరు చేయాల్సిందల్లా ఆ గ్లాస్ కాడ్మియం లేదా లెడ్ ఫ్రీ అనేది చూసుకోవాలి.

2) రాగి

రాగి అనేది ఎప్పటి నుంచో పాత్రల తయారీకి ఉపయోగించే లోహం. రాగి పాత్రలో నీటిని ఎక్కువసేపు ఉంచినప్పుడు, రాగిలోని చిన్న రేణువులు నీటిలో కలిసి, నీరు రాగి వాసనగా మారుతాయి. ఈ రాగి నీరు వివిధ ఆనారోగ్య పరిస్థితులను నివారించడంలో సహాయపడే నివారణ లక్షణాలను కలిగి ఉంటుంది. రాగి పాత్రలో నీటిని నిల్వ ఉంచడం వల్ల శరీరానికి హాని కలగదు.

3) ప్లాస్టిక్

సాధరణంగా ప్లాస్టిక్ సీసాలలో నీరు త్రాగడం ఆరోగ్యానికి హానికరం. ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని ప్యాక్ చేసి అమ్ముతుంటారు.ప్లాస్టిక్ బాటిళ్లలో నిల్వ ఉండే నీటిని తాగడం వల్ల సీసాలలోని రసాయనాలు నీటిలో కలిసిపోతాయి, ఇది ఆరోగ్యానికి హానికరం. సాధరణంగా ప్లాస్టిక్ బాటిల్స్ నీటిని తాగిన తర్వాత వాటిని బయట పారేస్తుంటారు. ఇది పర్యావరణానికి హాని కలిగిస్తోంది.

4) స్టెయిన్లెస్ స్టీల్

స్టెయిన్‌లెస్ స్టీల్‌లో నీరు త్రాగడం చాలా మంది అనుసరించే విధానం. ఇది దీర్ఘకాలం, మన్నికైన ఆప్షన్లలలో ఒకటి. స్టీల్ గ్లాసులు, స్టీల్ వాటర్ బాటిళ్లు ద్వారా నీరు త్రాగడం వల్ల అరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉండదు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వీటి వల్ల పర్యావరణాన్ని ఎలాంటి హాని ఉండదు

5) మట్టి కుండ

క్లే వాటర్ బాటిళ్లలో ఎలాంటి ప్రమాదకరమైన రసాయనాలు ఉండవు. క్లే బాటిల్ వాటర్ తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఇందులో నీరును తాగ్రడం వల్ల అసిడిటీ, గ్యాస్ట్రిక్ నొప్పిని ఎదుర్కోవటానికి కూడా మీకు సహాయపడుతుంది. సహజంగా మట్టి కుండ లేదా మట్టి సీసా తప్ప మరే ఇతర పాత్రలు నీటిని చల్లబరచవు. ముఖ్యంగా వేసవి కాలంలో నీటికి తాగడానికి ఇది ఉత్తమమైన పాత్ర. మట్టి సీసాలోని నీటిని తాగడం ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకోవచ్చు. మట్టి సీసా పర్యావరణ అనుకూలమైనది.

ఏ పాత్రలో నీరు త్రాగాలి?

రాగి, గాజు,మట్టి, ఈ మూడు పాత్రల ద్వారా నీటిని త్రాగడానికి మంచివిగా భావిస్తారు. మీరు ఈ పాత్రల నుండి నీరు త్రాగకపోతే, ఇక నుండి మీరు వాటిలో నీటిని తాగడానికి ప్రయత్నించండి.

టాపిక్

తదుపరి వ్యాసం