Weekend: వీకెండ్స్‌లో అర్ధరాత్రి వరకు సినిమాలు చూడటం కంటే, సింపుల్ టిప్స్‌తో మెమరబుల్‌గా మార్చుకోండిలా!
12 October 2024, 17:30 IST
వీకెండ్ వచ్చిందింటే చాలు.. కొంత మంది అర్ధరాత్రి వరకూ సినిమాలు చూస్తుంటారు. మరి కొందరు అతిగా మద్యం సేవిస్తుంటారు. కానీ ఈ అలవాటు కొనసాగితే మీ ఆరోగ్యానికే ప్రమాదకరం.
వీకెండ్‌లో అర్ధరాత్రి వరకు సినిమాలు
వీకెండ్స్ వచ్చింది అంటే చాలు చాలా మంది తొందరగా నిద్రపోవడానికి ఇష్టపడరు. అర్ధరాత్రి వరకు సినిమాలు చూస్తూ లేదా ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలో మునిగితేలుతారు. కానీ.. ఇలా అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండటం వల్ల మీ ఆరోగ్యంపై ఆ ప్రభావం పడుతుంది.
ఎన్ని గంటలు నిద్రపోవాలి?
సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకి కనీసం 8 గంటలు నిద్రపోవాలి. కానీ వీకెండ్స్‌లో చాలా మంది సినిమాలు, పార్టీలంటూ ఎంజాయ్‌లో ఉండి తగినంత నిద్రపోవడం లేదు. దాంతో రోగనిరోధక శక్తి తగ్గడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా మందగించే ప్రమాదం ఉంది.
రోజుకి కనీసం 7-8 గంటలు నిద్రపోని వ్యక్తుల్లో చిరాకు, తలనొప్పి ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎక్కువ రోజుల ఆ నిద్రలేమి అలవాటుని కొనసాగిస్తే అది స్థూలకాయానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు. అలానే మీ జీవితకాలం కూడా తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిద్రపోకపోతే ఏమవుతుంది?
రాత్రిపూట శరీరానికి నిద్రతో తగినంత విశ్రాంతిని ఇవ్వగలిగితే హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. అలాకాకుండా తగినంత నిద్రపోకపోతే ఒత్తిడి, ఆందోళన పెరిగి ఆ ప్రభావం మీ రోజువారీ కార్యకాలాపాలపై కూడా పడుతుంది. ఫలితంగా సరిగా భోజనం చేయకపోవడం లేదా అతిగా తినడం చేస్తుంటారు. దాంతో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని శరీర బరువులో మార్పులు వచ్చే అవకాశం ఉంది.
వీకెండ్స్‌లో కొంత మంది ఎక్కువగా మద్యం తాగి అతిగా నిద్రపోతుంటారు. రెండు రోజులు తినడం, తాగడం, నిద్రపోవడమే పనిగా పెట్టుకుంటారు. ఇది కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. గుండె జబ్బు, ఊబకాయం, డిప్రెషన్, టైప్ 2 డయాబెటిస్, తలనొప్పి వంటివి అతి నిద్రతో వచ్చే ఇబ్బందులు.
వీకెండ్స్‌లో ఏం చేయవచ్చు?
వీకెండ్స్‌లో తగినంత సమయం కుటుంబంతో గడపండి. వీలైతే వాళ్లని సరదాగా ట్రిప్‌కి తీసుకెళ్లండి. ఇంట్లో వాళ్లతో కలిసి సరదాగా సినిమాకి వెళ్లండి లేదా ఇంట్లోనే చూడండి. ఒంటరి వారైతే ఫ్రెండ్స్‌తో కలిసి టూర్ వెళ్లొచ్చు. మీతో పాటు ఒక పుస్తకం తీసుకెళ్లండి. రాత్రి పూట మద్యం తాగి నిద్రపోవడం కంటే పుస్తకం చదివి నిద్రపోవడం బెటర్.
వీకెండ్ పార్టీలో మద్యం కంటే సరదాగా పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోండి. ఒకవేళ ఇంట్లోనే ఉంటే ఫ్యామిలీతో కలిసి ఇండోర్ గేమ్స్, భాగస్వామికి ఇంటి పనిలో సాయం చేయడం లాంటివి చేయవచ్చు. వీకెండ్స్‌ని సరదాగా గడపటానికి మద్యం, సినిమాలే కాదు.. ఇలాంటివి బోలెడు ఉన్నాయి. ఆరోగ్యకరమైన అలవాట్లతో వీకెండ్స్‌ను గడిపితే.. సోమవారం ఫ్రెష్‌గా మళ్లీ ఆఫీస్ వర్క్‌లోకి వెళ్లొచ్చు.