తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tomato Rice : బఠానీలతో చేసిన టొమాటో రైస్.. టేస్ట్ అదిరిపోతుంది

Tomato Rice : బఠానీలతో చేసిన టొమాటో రైస్.. టేస్ట్ అదిరిపోతుంది

Anand Sai HT Telugu

18 January 2024, 6:30 IST

google News
    • Tomato Rice : ఉదయం ఏం అల్పాహారం ఏం చేయాలా అని ఆలోచించేవారి కోసం మంచి ఐడియా ఉంది. బఠానీలతో టొమాటో రైస్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా అందరూ ఉదయాన్నే హడావుడిగా ఉంటారు. పని చేసే మహిళలకు ఇది చాలా కీలక సమయం. వారు కూడా పనికి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. వారి కుటుంబం, పిల్లలను రెడీ చేయాలి. అల్పాహారం, భోజనం తయారు చేసి పెట్టాలి. ఈ హడావుడిలో బ్రేక్‌ఫాస్ట్‌కి ఎక్కువ సమయం లేకపోవడంతో బ్రెడ్ జామ్‌ తినేస్తున్నారు చాలా మంది. త్వరత్వరగా తయారయ్యే ఉప్మా తిని కోపగించుకునే కుటుంబ సభ్యులు కూడా చాలామంది ఉన్నారు. అందుకే బఠానీలతో కూడిన టొమాటో రైస్ బాత్ తయారు చేయండి.

పొద్దున్నే అల్పాహారం చేసి ఆఫీసుకు వెళ్లే హడావుడిలో ఉండే ఉద్యోగస్తులకు ఇది ఉపయోగపడుతుంది. ఉదయం అల్పాహారం చేసి.. మధ్యాహ్నానికి లంచ్ బాక్సులోకి తీసుకెళ్లొచ్చు. ఈ టొమాటో రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం.. కేవలం 20 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు.

టొమాటో రైస్ చేసేందుకు కావాల్సినవి

బియ్యం - రెండు కప్పులు, ఉల్లిపాయ- ఒకటి, టొమాటో - నాలుగు (సన్నగా తరిగినవి), బఠానీలు - ఐదు టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి - ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్, ఎర్ర మిరప పొడి - ఒక టేబుల్ స్పూన్, పసుపు పొడి - అర టేబుల్ స్పూన్, టొమాటో సాస్ - ఒక టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నీరు - రెండు కప్పులు, నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు

తయారీ విధానం :

కుక్కర్‌లో నెయ్యి వేయాలి. నెయ్యి వేడి అయ్యే వరకు వేచి ఉండండి. ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు దానికి తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. టొమాటోలు వేసి బాగా కదిలించాలి. టొమాటోలు ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు పొడి, ఎర్ర మిరపకాయలను జోడించండి. వీటన్నింటినీ బాగా కలపండి. తర్వాత కుక్కర్‌లో బఠానీలు వేయండి. ఈ బఠానీలను ఇతర పదార్థాలతో కలిపి నాలుగైదు నిమిషాలు ఉడకబెట్టండి. ఇప్పుడు టొమాటో సాస్, రుచికి ఉప్పు వేయండి. ఈ పదార్థాలన్నీ బాగా ఉడకనివ్వండి

ఇప్పుడు కడిగిన బియ్యాన్ని కుక్కర్‌లో వేయండి. ఇతర పదార్ధాలతో బియ్యం బాగా వేయించాలి. తర్వాత కుక్కర్‌లో నీరు వేసి, పదార్థాలను చివరిగా బాగా కదిలించండి. కుక్కర్ మూత మూసివేయండి. నాలుగు విజిల్స్ వచ్చే వరకు వేచి ఉండండి తర్వాత మంటను ఆపివేయండి. అంతే టొమాటో రైస్ రెడీ.

ఈ రెసిపీని సిద్ధం చేస్తున్నప్పుడు, టొమాటోలను మెత్తగా కోయాలని గుర్తుంచుకోండి. టమోటాలు మాత్రమే కాకుండా ఉల్లిపాయలను కూడా నెయ్యిలో బాగా వేయించాలి.

తదుపరి వ్యాసం