Kashmiri Brinjal Recipe : ఖట్టె బెంగాన్.. కశ్మీర్ స్టైల్ వంకాయ కర్రీ.. తినాలనిపిస్తుంది మళ్లీ మళ్లీ
01 December 2023, 12:30 IST
- Kashmiri Brinjal Recipe : వంకాయ అంటే చాలా దూరం పరిగెత్తేవాళ్ళు ఉన్నారు. అలాంటి వారి కోసం ఇక్కడ ఒక రెసిపీ ఉంది. ఇది తీపి, పుల్లని మిశ్రమంతో కశ్మీరీలు తయారుచేసే శాఖాహార వంటకం. వంకాయతో చేస్తారు. ఖట్టే బెంగాన్ అని పిలుస్తారు.
కశ్మీర్ స్టైల్ వంకాయ కర్రీ
ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంటకం ప్రసిద్ధి చెందింది. ప్రాంతం పేరుతో వంటకాలను గుర్తించినప్పుడు, దాని ప్రత్యేకత మరింత పెరుగుతుంది. హైదరాబాద్ బిర్యానీ, గుజరాతీ డోక్లా, గోవా ఫిష్ కర్రీ, తమిళనాడు పొంగల్ ఇలా ఆయా పట్టణాల పేర్లతో కూడా ఫేమస్ వంటకాలు ఉన్నాయి. అలాగే కశ్మీరీ వంటకాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది కాశ్మీరీ పులావ్, కాశ్మీరీ టీ, కాశ్మీరీ మటన్ రోగన్ జోష్, గోష్టబా. కశ్మీరీ వంటకాలు మాంసాహారం మాత్రమే కాదు, రుచికరమైన శాఖాహార వంటకాలు కూడా అంతే ప్రజాదరణ పొందాయి. వారి సంప్రదాయం ప్రకారం తయారుచేసిన రుచికరమైన వంటకాలు మన నాలుకకు తృప్తినిస్తాయి.
ఇక్కడ కాశ్మీరీలు తయారుచేసే శాఖాహార వంటకం ఉంది. వంకాయ, చింతపండు రసం, కొన్ని మసాలాలు వేసి చేసిన వంటకం ఇది. దీన్ని తయారు చేసేందుకు ఉల్లి, వెల్లుల్లి వాడకపోవడం విశేషం. ఇది కశ్మీరీల సాంప్రదాయ వంటలలో ఒకటి. వంకాయ తినని వారు కూడా ఈ రెసిపీని ఇష్టంగా తింటారు. కశ్మీరీలు దీనిని ఖట్టే బెంగాన్ అని పిలుస్తారు. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ ఉంది.
ఖట్టె బెంగాన్ తయారీకి కావలసిన పదార్థాలు
పొడవైన వంకాయ - పావు కిలో
చింతపండు రసం - 1 కప్పు
ఆవాల నూనె - 2 కప్పులు
రెడ్ చిల్లీ పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు
మెంతి పొడి - 2 టేబుల్ స్పూన్లు
అల్లం పొడి - 1 tsp
ఇంగువ - 1 tsp
లవంగాలు - 1
నీరు-సరిపడా
ఉప్పు - రుచి ప్రకారం
కొత్తిమీర కొంచెం
తయారు చేసే విధానం
1. వంకాయను పొడవుగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి. కానీ పూర్తిగా కత్తిరించవద్దు. తర్వాత దానిని కడగాలి.
2. పాన్ లో నూనె వేసి వేడి చేయండి.
3. జోడించిన వంకాయలను వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత పక్కన పెట్టండి.
4. మరొక పాత్రను తీసుకోండి. దానికి 2 చెంచాల ఆవాల నూనె వేసి వేడి చేయాలి.
5. ఉప్పు, ఎర్ర మిరపకాయ, ఇంగువ, లవంగాలలో కొంచెం నీరు వేసి మిశ్రమాన్ని తయారు చేయండి. వేడిచేసిన నూనె పాత్రలో ఉంచండి
6. మిగిలిన మసాలా పొడి, చింతపండు రసంలో రెండు కప్పుల నీరు కలపండి.
7. మూత మూసివేసి, ఉడకనివ్వండి.
8. ఉడుకుతున్న మసాలాలో వేయించిన వంకాయను జోడించండి. 5 నుండి 7 నిమిషాలు ఉడికించాలి.
9. పైన కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.
10. ఇప్పుడు రుచికరమైన కశ్మీరీ ఖట్టే బెంగన్ రెడీ అయినట్టే.. రుచికి సిద్ధంగా ఉంది. వేడి వేడి అన్నం, రోటీ, చపాతీకి ఇది బెస్ట్ కాంబినేషన్.