తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Carrot Roti: క్యారట్, కొత్తిమీర చపాతీ.. సులువుగా చేయండిలా..

carrot roti: క్యారట్, కొత్తిమీర చపాతీ.. సులువుగా చేయండిలా..

HT Telugu Desk HT Telugu

10 May 2023, 6:30 IST

google News
  • carrot roti: క్యారట్, కొత్తిమీరతో చపాతీ ఎలా చేసుకోవచ్చో చూద్దాం. 

carrot coriander roti
carrot coriander roti (pexels)

carrot coriander roti

ఉదయాన్నే చపాతీలు తినే అలవాటుండి, కాస్త భిన్నంగా ప్రయత్నిద్దాం అనుకుంటే ఈ కొత్తిమీర, క్యారట్ చపాతీలు చేసుకుని చూడండి. చపాతీ చేసే సమయంలోనే మంచి అల్పాహారం సిద్ధమవుతుంది.

కావాల్సిన పదార్థాలు:

క్యారట్ తురుము - సగం కప్పు

కొత్తిమీర తరుగు - సగం కప్పు

బియ్యం పిండి - సగం కప్పు

గోదుమ పిండి - సగం కప్పు

పచ్చిమిర్చి ముద్ద -1 టేబుల్ స్పూన్

పసుపు - సగం టీస్పూన్

ఉప్పు - తగినంత

నూనె - 4 చెంచాలు

తయారీ విధానం:

step 1: నూనె తప్ప మిగతా పదార్థాలన్నీ ఒక పెద్ద గిన్నెలో తీసుకోవాలి.

step 2: కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి.

step 3: పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి

step 4: చపాతీలు చేసుకుని పెనం మీద వేసుకుని కాల్చుకుంటే చాలు. క్యారట్, కొత్తిమీర చపాతీ సిద్ధం.

తదుపరి వ్యాసం