తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Baby Corn Biryani: ప్రెజర్ కుక్కర్లో బేబీకార్న్ బిర్యానీ.. ఎంజాయ్ చేస్తూ తింటారు..

Baby corn biryani: ప్రెజర్ కుక్కర్లో బేబీకార్న్ బిర్యానీ.. ఎంజాయ్ చేస్తూ తింటారు..

26 June 2024, 17:30 IST

google News
  • Baby corn biryani: పది నిమిషాల్లో ప్రెజర్ కుక్కర్లో బేబీకార్న్ బిర్యానీ చేసుకోవచ్చు.  పక్కా కొలతలతో దాన్నెలా చేయాలో చూడండి.

undefined
undefined

undefined

బేబీకార్న్‌తో చేసిన ఏ వంటకమైనా రుచిగా ఉంటుంది. దాని ఫ్లేవర్ ఇంకా బాగా ఆస్వాదించాలంటే ఒకసారి బిర్యానీ చేసి చూడండి. కేవలం ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఈ బిర్యానీ చేసేయొచ్చు. బ్యాచిలర్లు కూడా సులువుగా వండేయొచ్చు. చ

బేబీ కార్న్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు:

1 కప్పు బాస్మతీ బియ్యం

200 గ్రాముల బేబీ కార్న్

2 చెంచాల వంటనూనె లేదా నెయ్యి

1 బిర్యానీ ఆకు

అంగుళం దాల్చిన చెక్క ముక్క

2 యాలకులు

2 లవంగాలు

2 పెద్ద ఉల్లిపాయలు, సన్నం ముక్కలు

1 చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద

సగం చెంచా కారం

1 చెంచా ధనియాల పొడి

సగం చెంచా గరం మసాలా

1 టమాటా, సన్నటి ముక్కలు

గుప్పెడు కొత్తిమీర తరుగు

గుప్పెడు పుదీనా ఆకులు

2 పచ్చిమిర్చి

తగినంత ఉప్పు

బేబీకార్న్ బిర్యానీ తయారీ విధానం:

  1. ముందుగా బాస్మతీ బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి కనీసం అరగంట పాటూ నానబెట్టుకోవాలి. ఈలోపు కూరగాయలన్నీ ముక్కలుగా చేసి పెట్టుకోవాలి.
  2. బేబీకార్న్ నిలువుగా కట్ చేసి రెండు ముక్కలు చేసుకుంటే చాలు. మీకు ఇష్టం లేదనుకుంటే చిన్న ముక్కలు చేసుకోండి.
  3. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని వేడెక్కాక నూనె లేదా నెయ్యి వేసుకోవాలి. వేడెక్కాక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. వాసన వచ్చేదాకా ఆగాలి.
  4. వెంటనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బంగారు వర్ణం లోకి వచ్చేదాకా వేయించాలి.
  5. ఉల్లిపాయ ముక్కలు వేగాక కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. అన్నీ ఒకసారి కలిపి నిమిషం పాటు వేగనివ్వాలి.
  6. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి మూత పెట్టుకోవాలి. ముక్కలు మెత్త బడ్డాక ముందుగా తరిగి పెట్టుకున్న బేబీకార్న్ ముక్కలు వేసుకోవాలి.
  7. బిర్యానీకి ఒక గ్రీన్ మసాలా వేసుకుంటే రుచి పెరుగుతుంది. దానికోసం మిక్సీ జార్ తీసుకుని కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. గ్రీన్ మసాలా రెడీ.
  8. ఈ గ్రీన్ మసాలాను ఉడుకుతున్న బేబీకార్న్ ముక్కల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి.
  9. పచ్చివాసన పోయేదాకా కనీసం రెండు నిమిషాల పాటూ ఈ మసాలాను వేగనివ్వాలి. తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి.
  10. నీళ్లు మరిగి బుడగలు వస్తుంటే ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకుని కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి.
  11. పెద్ద మంట మీద ఉడికిస్తే మూడు విజిల్స్ వచ్చేదాకా ఆగాలి. మీడియం మంట మీద పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది.
  12. ఒక అయిదు నిమిషాలు అలాగే వదిలేసి మూత తీస్తే ఫ్లేవర్ బాగా పడుతుంది. చివరగా రైతాతో సర్వ్ చేసుకుంటే సరి. బేబీకార్న్ బిర్యానీ రెడీ.

ఈ బిర్యానీలో క్యారట్, బీన్స్, బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవచ్చు. కానీ బేబీకార్న్ ఫ్లేవర్ రావాలంటే కేవలం బేబీకార్న్ ముక్కలు ఎక్కువ వేసుకుంటే చాలు.

 

తదుపరి వ్యాసం