తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Morning Headache : ఉదయం లేవగానే తలనొప్పిగా ఉందా? అయితే ఇలా చేయండి

Morning Headache : ఉదయం లేవగానే తలనొప్పిగా ఉందా? అయితే ఇలా చేయండి

Anand Sai HT Telugu

10 October 2023, 5:00 IST

google News
    • Morning Headache Reasons : తలనొప్పి అనేది చాలా మంది అనుభవించే సాధారణ సమస్య. కానీ కొందరికి మాత్రం ఉదయంపూట వస్తుంది. అది కూడా వికారంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఉంటే లోలోపల కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతం కావొచ్చు.
ఉదయం తలనొప్పి
ఉదయం తలనొప్పి (unsplash)

ఉదయం తలనొప్పి

తలనొప్పి సాధారణమే అయినా.. ప్రతిరోజూ వస్తే మాత్రం వైద్యుడిని సంప్రదించాలి. కొందరికి మార్నింగ్ లేవగానే తలనొప్పి ఉంటుంది. ఉదయాన్నే తలనొప్పితో నిద్రలేవడం వల్ల మనకు అసౌకర్యంగా అనిపించడంతోపాటు మానసిక స్థితిపై ప్రభావం పడుతుంది. ఇలాంటి తలనొప్పికి సాధారణ కారణాలు ఏంటో చూద్దాం.

స్లీప్ అప్నియా, గురక, బ్రక్సిజం (నిద్రలో పళ్ళు గ్రైండింగ్) వంటి నిద్ర సంబంధిత సమస్యలు చాలామందికి ఉన్నాయి. ఇవి కూడా తలనొప్పికి కారణం.

డీహైడ్రేషన్ తలనొప్పికి చాలా ముఖ్యమైన కారణం కావచ్చు. రోజంతా తగినంత నీరు తాగకపోతే, పరిస్థితి మరింత దిగజారిపోతుంది.

నిద్ర నాణ్యత లేకపోవడం, ఒత్తిడి, ఉదయం ఆందోళనతో నిద్రలేవడం తలనొప్పికి కారణమవుతాయి. దీనిని తరచుగా టెన్షన్ తలనొప్పిగా సూచిస్తారు.

సైనసిటిస్, కొన్ని అలర్జీలు కూడా ప్రధాన కారణం కావొచ్చు. ఉదయం సైనస్ తలనొప్పికి దారితీయవచ్చు.

ఉదయం తలనొప్పిని ఎలా ఎదుర్కోవాలి?

సాధారణ నిద్ర షెడ్యూల్‌ను నిర్వహించడం, సౌకర్యవంతమైన నిద్ర వాతావరణాన్ని సృష్టించడం, పడుకునే ముందు ఎలక్ట్రానిక్ పరికరాలను నివారించడం ద్వారా నాణ్యమైన నిద్రను పొందొచ్చు. రోజంతా తగినంత నీరు తాగడం వల్ల ఈ ఉదయం తలనొప్పిని నయం చేయవచ్చు. తలనొప్పి రాకుండా నిరోధించవచ్చు.

స్లీప్ అప్నియా, గురక, నిద్రలో పళ్లు కొరకడం సమస్య ఉందని మీకు అనిపిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఉదయం పూట టీ, కాఫీలకు దూరంగా ఉండండి. తలనొప్పిని నివారించడానికి కెఫిన్ తీసుకోవడం క్రమంగా తగ్గించాలి. ఒత్తిడి కచ్చితంగా ఉదయం తలనొప్పిని ప్రేరేపిస్తుంది. ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు, యోగా వంటివి చేయాలి.

వికారం, వాంతులు, తల తిరగడం, దృష్టిలోపం వంటి ఇతర ఇబ్బందికరమైన లక్షణాలతో ఉదయం తలనొప్పితో బాధపడుతుంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ఉదయాన్నే తలనొప్పికి సంబంధించిన ఆరోగ్య సమస్యలను సకాలంలో గుర్తించడం, చికిత్స చేయడం మీ మెుత్తం ఆరోగ్యానికి మంచిది.

తదుపరి వ్యాసం