తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Horoscope Today | ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశి వారు విలువైనవి కోల్పోవచ్చు, జాగ్రత్త

Horoscope Today | ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశి వారు విలువైనవి కోల్పోవచ్చు, జాగ్రత్త

HT Telugu Desk HT Telugu

25 July 2022, 7:33 IST

google News
    • ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ప్రేమ్ కుమార్ శర్మ చంద్రమానం ప్రకారం తేదీ జూలై 25, 2022కు సంబంధించిన రాశి ఫలాలను చంద్రమానం ప్రకారం అందజేశారు.
Horoscope Today
Horoscope Today (Unsplash)

Horoscope Today

చంద్రమానం అనుసరించి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ప్రేమ్ కుమార్ శర్మ తేదీ జూలై 25, 2022కు సంబంధించిన రాశి ఫలాలను ఈ విధంగా అందజేశారు.

మేష రాశి

ఈ రోజు మీ రోజు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి లాభాలను పొందుతారు. విద్యార్థులు కొత్త ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఉత్సాహం చూపుతారు. వైవాహిక జీవితంలో కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ఈరోజు స్త్రీలకు సంతోషకరమైన రోజు. ఈరోజు ఏదైనా వేడుకలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొన్ని సమస్యలు రావచ్చు. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ఆఫీసులో ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కొన్ని కుట్రలు పన్నవచ్చు, మీరు జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి

ఈ రోజు మీకు మంచి రోజు కానుంది. ఏదైనా కొత్త పని చేయాలనే ఉత్సాహంతో ఉంటారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో మీ భాగస్వామికి మీకు మధ్య పరస్పర సామరస్యం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆఫీసు సంబంధిత వ్యవహారాలలో మీ పరిణితిని ఉపయోగించండి. ప్రతీసారి ఇతరుల సలహాలను కోరడం ద్వారా మీపై చులకన భావం ఏర్పడవచ్చు. ఇంటి పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉండవచ్చు, సంయమనం పాటించాలి. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. మీ కుటుంబంలోని ఏ సభ్యుని చెడు ప్రవర్తన వల్ల ఇబ్బందులు తలెత్తవచ్చు. భవిష్యత్తు కోసం మీరు మంచి ఒక నిర్ణయం తీసుకోవచ్చు. వైవాహిక జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి, ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కర్కాటక రాశి

ఈ రోజు మీకు ఖచ్చితంగా ఫలవంతంగా ఉంటుంది. మధురంగా మాట్లాడుతూ మీ పనులు చక్కబెట్టుకుంటారు. మీ వైవాహిక జీవితంలో సామరస్యం పెరుగుతుంది. వృత్తివ్యాపారాలలో ఏవైనా ప్రతికూల వార్తలను వినవలసి రావచ్చు, అయినా ధైర్యంగా ఎదుర్కోండి. సామాజిక రంగాలలో పని చేసే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. ఉదర సంబంధిత సమస్యలు ఉండవచ్చు, ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి.

సింహ రాశి

ఆదాయ పరంగా చాలా సానుకూల వాతావరణం ఉంది. కొత్త ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. పిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. ప్రేమ వ్యవహారాలు ఫలవంతం కావచ్చు. వృత్తిరంగంలో ఉన్నవారు సంయమనం పాటించాలి. మీ వైవాహిక జీవితంలో పరస్పర సామరస్యం ఉంటుంది. ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

కన్య రాశి

ఈరోజు ప్రతి రోజు కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు కోరుకున్న కోరికలు ఏవైనా నెరవేరుతాయి. ఏదైనా భూమి, వాహనం, ఇల్లు వంటివి కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే ఆ కోరిక కూడా తీరినట్లే. వృత్తిరంగంలో ఉన్న వారు మీ ఐడియాలను ఇతరులతో పంచుకోకండి. మీరు మీ పనుల్లో బిజీగా ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామికి సమయం ఇవ్వలేరు. ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి చాలా వరకు ఉపశమనం పొందుతారు.

తులా రాశి

ఈరోజు మీకు మిశ్రమ రోజుగా ఉంటుంది. ఉద్యోగస్తులు పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కెరీర్‌లో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో మీకు మీ భాగస్వామికి మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు. మీ మాటలను అదుపులో ఉంచుకోవడం మంచిది. మీలో కొందరు ఇళ్లలోని కుటుంబ సభ్యులు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో జరుగుతున్న చిన్న చిన్న గొడవలు ఈరోజుతో ముగుస్తాయి, జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

వృశ్చిక రాశి

ఈ రోజు మీకు చాలా ఫలవంతంగా ఉంటుంది. మీరు మీ స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కార్యాలయంలో సెలవు తీసుకోవడంలో కొంత సమస్య ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఏ పనిలోనైనా తొందరపడకూడదు. రాజకీయాల దిశగా ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు శుభవార్తలను వినగలరు. మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసి విక్రయించాల్సి వస్తే స్థిరమైన అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేయండి.

ధనుస్సు రాశి

ఈ రోజు మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంతోషకరమైన రోజు. మీ వైవాహిక జీవితంలో ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. ప్రేమికుల మధ్య అపార్థాలు చెరిగిపోయి బంధం మరింత బలపడుతుంది. వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. కుటుంబంలో ఏదైనా వివాదం తలెత్తితే ఇరువర్గాల మాట వినడం మీకు శ్రేయస్కరం. ఉద్యోగులు ఏ సీనియర్ అధికారితోనూ వాదించకూడదు, లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకర రాశి

ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు. నూతన ఉద్యోగావకాశాలను పొందుతారు. విద్యార్థులు పోటీలకు సిద్ధమైతే, వారు విజయం సాధించే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. ఆఫీసు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. స్వల్ప అస్వస్థత ఉండవచ్చు. తలనొప్పి, జ్వరం మొదలైన సమస్యలు ఉండవచ్చు. ఆదాయ పరంగా చాలా సానుకూల వాతావరణం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి. మీ వైవాహిక జీవితంలో పరస్పర సామరస్యం ఉంటుంది.

కుంభ రాశి

ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్డు జాగ్రత్తగా ఉండండి, మీ విలువైన వస్తువులు తస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఆఫీసులో కొత్త సహోద్యోగులు మీ సహాకారాన్ని కోరవచ్చు. వృత్తిరంగంలో ఉన్నవారు. మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. పాత స్నేహితుడిని కలిసే అవకాశం. అనవసర ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. వైవాహిక బంధంలో మాధుర్యం పెరుగుతుంది.

మీన రాశి

ఈరోజు మీకు చాలా ఫలవంతంగా ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు పెట్టుబడుల ఒత్తిడి నుండి బయటపడతారు. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే మీరు తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వైవాహిక జీవితంలో కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ఈరోజు మీరు కొంతమంది ప్రత్యేక వ్యక్తులను కలిసే అవకాశం ఉంటుంది. పనిచేసే చోట సహోద్యోగుల నుంచి పరస్పర సహాకారం ఉంటుంది. వృధా ఖర్చులను తగ్గించండి. ఈరోజు మీ డబ్బును భవిష్యత్తు కోసం ఆదా చేస్తే, గొప్ప ప్రయోజనం పొందుతారు.

టాపిక్

తదుపరి వ్యాసం