తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Menstrual Cramps : పీరియడ్స్‌ సమయంలో భరించలేని కాళ్ల నొప్పులా? సింపుల్‌గా ఇలా చేయండి

Menstrual Cramps : పీరియడ్స్‌ సమయంలో భరించలేని కాళ్ల నొప్పులా? సింపుల్‌గా ఇలా చేయండి

HT Telugu Desk HT Telugu

03 November 2023, 17:00 IST

    • Period Cramps Remedies Fast : చాలా మంది మహిళలు పీరియడ్స్‌ సమయంలో ఇబ్బంది పడుతుంటారు. కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే సమస్య నుంచి బయటపడొచ్చు.
పీరియడ్స్ చిట్కాలు
పీరియడ్స్ చిట్కాలు (pixabay)

పీరియడ్స్ చిట్కాలు

మహిళలకు పీరియడ్స్‌ పెయిన్స్‌ బతికి ఉండగానే నరకం చూపిస్తాయి. పురిటినొప్పులు జీవితంలో ఒకటి రెండు సార్లే భరించాలి కానీ.. ఈ పీరియడ్స్‌ పాట్లు నెల నెలా ఉంటాయి. కొంతమంది స్త్రీలకు పీరియడ్స్‌ వస్తున్నాయంటే.. వెన్నులో వణుకు మొదలవుతుంది. అడుగు తీసి అడుగు వేయలేరు. బాడీ మొత్తం గ్రైండర్‌లో వేసి తిప్పినట్లే ఉంటుంది. కడుపు నొప్పి, కాళ్లు నొప్పి అందరికీ ఉంటాయి. కానీ కొందరికి విపరీతమైన కాళ్ల నొప్పి వస్తుంది. నిజానికి, ఈ నొప్పి హార్మోన్ల మార్పుల వల్ల వస్తుంది. ఈరోజు మనం ఈ నొప్పులను ఎలా సులువుగా తగ్గించుకోవాలో చూద్దాం. ఈ హోమ్‌ రెమెడీస్‌ మీకు పక్కా పనిచేస్తాయి.

హీట్ ప్యాడ్ ఉపయోగించడం

బహిష్టు సమయంలో పాదాలలో నొప్పి లేదా తిమ్మిరి ఉంటే, హీట్ ప్యాడ్‌తో పాదాలను మసాజ్ చేసుకోండి. ఇది నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. హీట్ ప్యాడ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నొప్పిని తగ్గిస్తుంది.

మసాజ్

రుతుక్రమం సమయంలో పాదాల నొప్పికి మసాజ్ ఉత్తమ చికిత్సలలో ఒకటి. మీరు లావెండర్ లేదా ఆవాల నూనెతో మసాజ్ చేయవచ్చు. ఇది రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. పాదాలకు మసాజ్ చేయడం వల్ల అలసట తగ్గుతుంది. రిలాక్స్ అవుతుంది.

యోగా లేదా వ్యాయామం

శారీరక వ్యాయామం ఋతుస్రావం సమయంలో కాళ్ళ నొప్పిని తగ్గిస్తుంది. మీరు శారీరక శ్రమ చేసినప్పుడు, మెదడు నొప్పి గ్రాహకాన్ని నిరోధించే ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. వ్యాయామం రక్త నాళాలలో సరైన రక్త ప్రసరణకు సహాయపడుతుంది. ఇది నొప్పి తగ్గిస్తుంది. బహిష్టు సమయంలో యోగా స్ట్రెచింగ్, తేలికపాటి వ్యాయామాలు చేయండి. అసలే నొప్పిగా ఉంటే.. ఇంకా వ్యాయామం ఏంటి అనుకుంటారేమో.. తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల మీరు బాడీ అంతా యాక్టివ్‌గా ఉంటుంది.

సమతుల్య ఆహారం

బహిష్టు సమయంలో పోషకాలు లేకపోవడం వల్ల కాళ్లలో నొప్పి, తిమ్మిరి వస్తుంది. సరైన పోషకాహారం తీసుకోండి. మీ డైట్‌లో విటమిన్ డి, జింక్, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. కేవలం పిరియడ్స్ వచ్చినప్పుడే కాదు.. తరచూ వీటిని మీ డైట్‌లో ఫాలో అయితే.. అసలు పిరియడ్స్‌లో పెయిన్స్‌ ఉండవు.

హైడ్రేటెడ్‌గా ఉండండి

బహిష్టు సమయంలో హైడ్రేటెడ్‌గా ఉండటం కూడా ముఖ్యం. పుష్కలంగా నీరు తాగడం వల్ల మంట, నిర్జలీకరణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది, శరీరంలో నీటి కొరత ఋతు తిమ్మిరికి దారితీస్తుంది. కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగాలని లక్ష్యంగా పెట్టుకోండి. మీ ఆహారంలో దోసకాయ, పుచ్చకాయ వంటి హైడ్రేటింగ్ ఆహారాలను చేర్చుకోండి.

తదుపరి వ్యాసం