తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Holi Colours Side Effects : హోలీ రంగులతో క్యాన్సర్.. కంటి సమస్యలు గ్యారంటీ

Holi Colours Side Effects : హోలీ రంగులతో క్యాన్సర్.. కంటి సమస్యలు గ్యారంటీ

Anand Sai HT Telugu

24 March 2024, 13:00 IST

    • Holi Colours Problems : హోలీ పండుగ తర్వాత చాలా మంది చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, కంటి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతారు. దీనంతటికీ కారణం ఆ రంగుల్లో ఉండే రసాయనాలే.
హోలీ రంగులతో ఆరోగ్య సమస్యలు
హోలీ రంగులతో ఆరోగ్య సమస్యలు (Unsplash)

హోలీ రంగులతో ఆరోగ్య సమస్యలు

హోలీ పండుగ అందమైన పండుగ. కానీ ఈ వేడుకల్లో ఉపయోగించే రంగులతో అనేక సమస్యలు వస్తాయి. ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఎన్‌సిబిఐ నివేదిక ప్రకారం, ఈ రోజుల్లో లెడ్ ఆక్సైడ్, క్రోమియం అయోడైడ్, కాపర్ సల్ఫేట్, మెర్క్యూరీ సల్ఫైట్, అల్యూమినియం బ్రోమైడ్ వంటి హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఈ రసాయనాలు చర్మ సమస్యలు, కంటి లోపాలు, శ్వాసకోశ సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.

ట్రెండింగ్ వార్తలు

Friday Motivation: మీ మనసును అదుపులో పెట్టుకుంటేనే విజయం దక్కేది, అందుకోసం ధ్యానం చేయక తప్పదు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

హోలీ రంగులతో సమస్యలు

హోలీ రంగులలో ఉపయోగించే సీసం, క్రోమియం వంటి కొన్ని రసాయనాలు క్యాన్సర్ కారకాలు. ఈ రంగులకు ఎక్కువసేపు గురికావడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ రసాయన రంగులు చర్మం చికాకు, ఎరుపు, దురద కలిగించవచ్చు. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ.

హోలీ వేడుకల సమయంలో రసాయన రంగుల సూక్ష్మ కణాలు గాలిలో కలిసిపోతాయి. ఇది దగ్గు, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. ఆస్తమా వంటి వ్యాధులు పెరుగుతాయి.

రసాయన రంగులు కళ్లలోకి రాగానే కంటి చికాకు, ఎరుపు, నీరు కారడం, తాత్కాలిక అంధత్వాన్ని కలిగిస్తాయి. కళ్లలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

అనేక రసాయన పెయింట్లలో సీసం, పాదరసం, క్రోమియం, అమ్మోనియా వంటి విష పదార్థాలు ఉంటాయి. ఇవి చర్మం ద్వారా గ్రహించబడతాయి. తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి.

హార్మోన్ల మార్పుల కారణంగా గర్భిణీ స్త్రీలలో కంటి చికాకు సమస్యలు పెరుగుతాయి. ఎందుకంటే గర్భం వారి కళ్ళను మరింత సున్నితంగా చేస్తుంది. రంగులతో సమస్య ఎక్కువ అవుతుంది.

జుట్టును ఇలా కాపాడుకోండి

ఈ రంగులు జుట్టుకు కూడా హానీ కలిగిస్తాయి. అందుకే ముందుగా కొబ్బరి లేదా ఆలివ్ నూనె రాయండి. ఈ నూనె జుట్టుకు రక్షణ పొరలా పనిచేస్తుంది.

హోలీ ఆడిన వెంటనే మీ తలపై షాంపూ పెట్టుకోవడం మానుకోండి. బదులుగా గుడ్డు పచ్చసొన లేదా పెరుగును జుట్టుకు అప్లై చేయాలి. షాంపూ చేయడానికి ముందు కనీసం 45 నిమిషాలు అలాగే ఉంచండి. ఇలా చేయడం వల్ల జుట్టులోని హోలీ రంగు తొలగిపోయి నష్టం తగ్గుతుంది.

రంగుల పొడులతో హోలీ ఆడే ముందు ఆవాల నూనెను తలకు పట్టించి కాసేపు మసాజ్ చేయాలి. హోలీ ఆడిన తర్వాత తలకు షాంపూ రాసుకోవాలి. ఆ తర్వాత తలను బాగా ఆరబెట్టి మళ్లీ ఆవాల నూనె రాసుకుని గంటసేపు నానబెట్టాలి. ఇది తల నుండి మిగిలిన హోలీ రంగులను తొలగించి, నష్టాన్ని నివారిస్తుంది.

కొబ్బరి పాలు జుట్టుకు హానిని తగ్గించడంలో సహాయపడే అద్భుతమైన పదార్థం. కొబ్బరి పాలు జుట్టు నుండి హోలీ రంగును తొలగించడంలో సహాయపడతాయి. కొబ్బరి పాలను మీ తలకు పట్టించి, గంటసేపు నాననివ్వండి. తర్వాత షాంపూతో కడగాలి.

పెరుగులో మెంతిపొడి కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత జుట్టుకు పట్టించి బాగా నానబెట్టాలి. తర్వాత జుట్టును బాగా కడగాలి. ఇది హోలీ రంగుల వల్ల జుట్టు పాడవకుండా చేస్తుంది. జుట్టుకు మంచి పోషణ కూడా లభిస్తుంది.

తదుపరి వ్యాసం