Holi 2024: హోలీ రంగుల వల్ల జుట్టు దెబ్బతినకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి
Holi 2024: హోలీ రంగుల్లో రసాయనాలు కలిసి ఉంటాయి. ఈ రంగులు వల్ల చర్మానికి, జుట్టుకు చాలా డామేజ్ అవుతుంది. కాబట్టి కొన్ని రకాల చిట్కాలు పాటించడం ద్వారా జుట్టును కాపాడుకోవచ్చు.
(1 / 6)
హోలీ… అందమైన రంగుల పండుగ, ఆ రంగుల వల్ల మీ జుట్టుకు హాని కలుగుతుంది. రంగుల్లో రసాయనాలు కలుపుతారు. ఇవి నీటిలో కలిపి చల్లుకునేవారు ఎక్కువ. దీనివల్ల మీ జుట్టు పొడిగా,పెళుసుగా మారుతుంది. జుట్టును సంరక్షించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి.(Photo by Aris MESSINIS / AFP)
(2 / 6)
రంగులతో ఆడుకునే ముందు మీ జుట్టుకు నూనె రాయండి. రంగులతో ఆడుకునే ముందు మీ జుట్టుకు కొబ్బరి నూనెను పట్టించడం వల్ల మీ జుట్టుకు రంగులలో ఉండే కఠినమైన రసాయనాలు జుట్టును బలహీనంగా మారేలా చేస్తాయి. రంగులు చల్లుకున్న వెంటనే తలకు స్నానం చేయాలి.(utpal sarkar/ANI Photo)
(3 / 6)
రంగులు చల్లకోవడానికి ముందు జుట్టును గట్టిగా ముడి వేసుకోండి. లూజ్ గా జుట్టును వదిలేయడం వల్ల రంగులు మాడు వరకు అంటుకునే అవకాశం ఉంది. అందుకే జుట్టును గట్టిగా ముడి వేయడం వల్ల రంగు జుట్టు ఉపరితలంపైనే ఉండిపోతుంది. దాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.(Photo by Raj K Raj/ Hindustan Times)
(4 / 6)
జుట్టు మీద రంగులు పడకుండా ఉండాలంటే తలకు టోపీ పెట్టుకోండి. లేదా స్కార్ఫ్ వంటివి పెట్టుకుంటే మంచిది. జుట్టును రసాయనాల రంగు నుంచి రక్షించుకోవచ్చు.(Photo by Raj K Raj/ Hindustan Times)
(5 / 6)
హోలీ ఆడిన తర్వాత, రంగులను శుభ్రంగా తొలగించాలి. అయితే వేడి నీటిని మాత్రం ఉపయోగించకూడదు. ఇది మీ జుట్టును మరింత దెబ్బతీస్తుంది. బదులుగా, మీ జుట్టును చల్లటి నీటితో శుభ్రపరచుకోవాలి.(utpal sarkar/ANI Photo)
ఇతర గ్యాలరీలు