తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Online Gaming | ఆన్‌లైన్‌ గేమింగ్‌ కెరీర్‌ మంచిదేనా? అందుబాటులోని కోర్సులేంటి

Online Gaming | ఆన్‌లైన్‌ గేమింగ్‌ కెరీర్‌ మంచిదేనా? అందుబాటులోని కోర్సులేంటి

Hari Prasad S HT Telugu

15 February 2022, 11:53 IST

    • Online Gaming.. ఆన్‌లైన్‌.. ఆన్‌లైన్‌.. ఆన్‌లైన్‌.. ఇప్పుడన్నీ ఆన్‌లైనే కదా. అలాగే ఆన్‌లైన్‌ గేమింగ్‌కు కూడా ఫుల్‌ డిమాండ్‌ ఉంది. రోజురోజుకూ ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అదే సమయంలో ఇటు ఆన్‌లైన్‌ గేమింగ్‌ను కెరీర్‌గా తీసుకోవాలనుకుంటున్న వారు కూడా పెరిగిపోతున్నారు. 
ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఇప్పుడో కొత్త కెరీర్ ఛాయిస్
ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఇప్పుడో కొత్త కెరీర్ ఛాయిస్ (Pexels)

ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఇప్పుడో కొత్త కెరీర్ ఛాయిస్

అందరిలాగా రొటీన్‌గా కాకుండా కాస్త డిఫరెంట్‌ కెరీర్‌ ఎంచుకోవాలని అనుకుంటున్న వాళ్లు ఈ ఆన్‌లైన్‌ గేమింగ్‌ వైపు చూస్తున్నారు. డిజిటలైజేషన్‌ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ కెరీర్‌ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం ఇండియాతోపాటు విదేశాల్లోనూ దీనికోసం ప్రత్యేకంగా కోర్సులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌లో అందుబాటులో ఉన్న కెరీర్‌ అవకాశాలు, కోర్సులు గురించి సమగ్రంగా ఈ ఆర్టికల్‌లో చదవండి.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Tips In Telugu : ఈ 6 గుణాలపై మీకు నియంత్రణ లేకుంటే జీవితంలో ఓడిపోతారు

Jeera Rice : ఉదయం అల్పాహారంగా జీలకర్ర రైస్ ఇలా చేసుకోండి.. 10 నిమిషాల్లో రెడీ..

Tuesday Motivation : అందాన్ని చూసి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయకు.. అంతమించిన విషయాలు చాలా ఉంటాయి

Talking In Sleep : నిద్రలో మాట్లాడే సమస్య ఉంటే బయటపడేందుకు సింపుల్ చిట్కాలు

గేమింగ్‌ ఇండస్ట్రీలో ఉన్న అవకాశాలు

గేమింగ్‌ ఇండస్ట్రీలో డిజైన్‌, డెవలప్‌మెంట్‌వంటి వాటితోపాటు బిజినెస్‌ వైపు కూడా ఎన్నో కెరీర్‌ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో గేమ్‌ డిజైనర్‌, గేమ్‌ డెవలపర్‌, సౌండ్‌ డిజైనర్‌, ఆడియో ఇంజినీర్‌, గేమింగ్ క్రిటిక్‌, గేమ్‌ యాక్టర్‌ లేదా హోస్ట్‌, గేమింగ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌, గేమ్‌ ప్రోగ్రామర్‌, యానిమేటర్స్‌, గ్రాఫిక్‌ ఆర్టిస్ట్‌, గేమ్‌ టెస్టర్స్‌, కస్టమర్‌ కేర్‌ స్పెషలిస్ట్స్‌, టెక్నికల్‌ సపోర్ట్‌ అసిస్టెన్స్‌, మార్కెటింగ్‌ మేనేజర్స్‌ అండ్‌ అనలిస్ట్స్‌, స్క్రిప్ట్‌రైటర్‌, యూట్యూబర్‌/వ్లోగర్‌/బ్లాగర్‌, ప్రొఫెషన్‌ గేమర్‌/ట్రైనర్‌ వంటి ఎన్నో అవకాశాలు ఈ గేమింగ్‌ రంగంలో ఉన్నాయి. మీ అభిరుచి, లక్ష్యాలను బట్టి ఇందులో మీకు ఇష్టమైన దానిని ఎంచుకోవచ్చు.

ఇండియాలో అందుబాటులో ఉన్న కోర్సులు

ఈ ఆన్‌లైగ్‌ గేమింగ్‌ ఇండస్ట్రీలో సెటిలవ్వాలనుకుంటే.. ఇండియాలోనే చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీడియో గేమింగ్‌ డెవలప్‌మెంట్‌, యానిమేషన్స్‌కు సంబంధించి చాలా కోర్సులు ఉన్నాయి. ఏడాది నుంచి 4 ఏళ్ల వ్యవధి కోర్సుల్లో నుంచి నచ్చినది ఎంచుకోవచ్చు. గేమ్‌ డిజైనింగ్ కోర్సు చేయాలనుకుంటే హైదరాబాద్‌లోనే ఎన్నో ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. 

ఇక ప్రత్యేకంగా పన్నెండో తరగతి తరవాత ఆన్‌లైన్‌ గేమింగ్‌ డిగ్రీ పొందాలనుకుంటే.. దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీలు, కాలేజీలు కొన్ని కోర్సులు అందిస్తున్నాయి. ఇందులో హైదరాబాద్‌లో ఉన్న ఇంటర్నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ కూడా ఒకటి. ఇందులో మల్టీమీడియాలో ఎంఏ కోర్సు రెండేళ్లు, యానిమేషన్‌లో డిప్లొమా ఏడాది కోర్సులు ఉన్నాయి. 

డెహ్రాడూన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్‌లో నాలుగేళ్లకుగాను గ్రాఫిక్స్‌ అండ్‌ గేమింగ్‌లో నాలుగేళ్ల కోర్సు ఉండగా, డెహ్రాడూన్‌లోనే గ్రాఫిక్‌ ఎరా అనే సంస్థ యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌లో మూడేళ్ల బీఎస్సీ కోర్సు అందిస్తోంది. 

హైదరాబాద్‌, బెంగళూరులలోని ఐసీఏటీ డిజైన్‌ అండ్‌ మీడియా కాలేజ్‌లో గేమ్‌ ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌లో బాచిలర్స్‌ డిగ్రీ, గేమ్‌ టెక్నాలజీలో ఎంఎస్సీ కోర్సులు ఉన్నాయి. ఇక లక్నోలోని ఎరా యూనివర్సిటీ గేమ్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌లో మూడేళ్ల బీఎస్సీ కోర్సు, ఏడాది పీజీడీ కోర్సులు అందిస్తోంది. ఇండియాలోనే కాదు యూకే, యూఎస్‌ఏ, జర్మనీ, ఐర్లాండ్‌, ఫిన్‌లాండ్‌ దేశాల్లోనూ గేమ్‌ డిజైన్‌, టెక్నాలజీ, యానిమేషన్‌ వంటి కోర్సులు ఉన్నాయి.

ఆన్‌లైన్‌ గేమింగ్‌లో కెరీర్‌

ఒకప్పుడు వీడియో గేమ్‌ అంటే సింపుల్‌గా ఓ నలుగురైదుగురు ప్రొఫెషనల్స్‌తో చేయించేసి బయటకు వదిలేవారు. కానీ ఈ కాలంలో ఆన్‌లైన్‌ గేమ్స్‌ అత్యాధునిక టెక్నాలజీతో గేమర్స్‌కు ఓ కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. సహజంగానే ఇలాంటి గేమ్స్‌ను తయారు చేయాలంటే చాలామంది నిపుణుల అవసరం ఉంటుంది. ఒక్క గేమ్‌ డెవలప్‌ చేసి మార్కెట్‌లోకి వదలడానికి ఇప్పుడు 100 మందికిపైగా ప్రొఫెనల్స్‌ అవసరమవుతున్నారు. 

దీంతో ఈ రంగంలో కెరీర్‌ అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. గేమర్స్‌ డిమాండ్స్‌కు తగినట్లు ఈ రంగంలోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలు, ఇన్నోవేషన్లు వస్తూనే ఉన్నాయి. ఈ గేమ్స్‌ను అభివృద్ధి చేసే సంస్థలే కాదు.. వాటిని ఆడటంలో బాగా నైపుణ్యం సంపాదించిన వాళ్లు యూట్యూబ్‌, గూగుల్‌, ట్విచ్‌, ఫేస్‌బుక్‌ గేమింగ్‌ వంటి వాటిలో తమ టాలెంట్‌ను చూపించి డబ్బులు సంపాదించేస్తున్నారు. 

దీనికోసం ప్రత్యేకంగా వీడియో గేమింగ్, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై పట్టు సాధించడానికి డిప్లొమా కోర్సులు కూడా చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఆన్‌లైన్‌ గేమింగ్‌ను కెరీర్‌గా తీసుకోవాలనుకుంటే.. గేమ్స్‌ ఆడటంతోపాటు వాటి డిజైన్‌, డెవలప్‌మెంట్‌, టెస్టింగ్, ప్రోగ్రామింగ్‌ వంటివాటిపై పట్టు సాధించండి.

తదుపరి వ్యాసం