Baby Names: న అక్షరంతో మొదలయ్యే అర్థవంతమైన, చక్కటి పేర్లు ఇవిగోండి, మీ పిల్లల కోసం నచ్చిన పేరును ఎంచుకోండి
16 September 2024, 9:30 IST
'ఎన్' అక్షరంతో బేబీ నేమ్: ఇంట్లో ఒక కుమార్తె లేదా కొడుకు పుట్టి ఆమెకు 'ఎన్' అక్షరంతో పేరు పెట్టాలనుకుంటే, ఈ పేర్ల జాబితాను ఖచ్చితంగా చూడండి.
న అక్షరంతో బేబీ నేమ్స్
ఇంట్లో బిడ్డ పుట్టగానే కుటుంబ సభ్యలంతా మొదట ఆలోచించేది ‘ఏం పేరు పెట్టాలా’ అని. ఆ పిల్లాడి జాతకం ప్రకారం ఏ అక్షరంతో పేరు పెట్టాలో కూడా ఆలోచిస్తారు. కొంతమంది పిల్లలకు న అక్షరంతో లేదా, న గుణింతంలోని ఇతర అక్షరాలతో పేరు పెట్టమని సూచిస్తారు కొంతమంది పండితులు. పిల్లలకు పెట్టే పేర్లు ఆధునికంగానూ, అలాగే అర్థవంతంగానూ ఉండాలని ఎంతో మంది కోరుకుంటారు. న అక్షరంతో మీ బాబుకు లేదా పాపలకు పేరు పెట్టాల్సి వస్తే మేము ఇక్కడ కొన్ని పేర్లను ఇచ్చాము. వాటిలోంచి మీకు నచ్చిన పేరును ఎంచుకోండి.
అబ్బాయిల పేర్లు
నతీమ్
ఈ పేరుకు అర్థం ప్రతిదీ సక్రమంగా ఉంచేవాడు అని. ఎటువంటి పరిస్థితుల్లో అయిన సర్దుకుపోయేవాడు అని కూడా అర్థం.
నవ్లాన్
ఈ పేరుకు అర్థం సృష్టికర్త అని.
నవ్ దీప్
ఈ పేరుకు జీవితంలో కొత్త వెలుగును తెచ్చే వాడు అని అర్థం.
నభాన్
ఈ పేరుకు అర్థం కరుణామయుడు అని.
నభిజ్
ఈ పేరుకు అర్థం బ్రహ్మ.
నీలాంష్
ఈ పేరుకు అర్థం మహా శివుడు అని.
నయన్ష్
ఈ పేరుకర్ధం దేవుడి కుమారుడు అని అర్థం
నీతిక్
ఈ పేరుకు అర్థం న్యాయం అందించేవాడు అని అర్థం.
నోలన్
ఈ పేరుకు అర్థం శక్తివంతమైన అని.
నియత్
ఈ పేరుకు అర్థం చక్కటి ప్రవర్తన కల వ్యక్తి అని.
నివిన్
ఈ పేరుకు అర్థం దేవుడి ప్రసాదం అని.
నివేష్
మంచులాంటి చల్లని వ్యక్తి అని అర్థం.
నివాన్
ఈ పేరుకు అర్థం పవిత్రమైన వ్యక్తి అని అర్థం.
నిథిలేష్
ఈ పేరుకు అర్థం దేవుళ్లందిరికీ అధిదేవత అని.
నిశిన్
ఈ పేరుకు అర్థం మహా శివుడు అని.
అమ్మాయిల పేర్లు
నాంది
ఈ పేరుకు అర్థం మొదలు అని. అలాగే సంతోషం అనే అర్థం కూడా వస్తుంది.
నైలా
ఈ పేరుకు అర్థం ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని.
నవనీత
ఈ పేరుకు అర్థం వెన్నలాంటి మనసున్న వ్యక్తి అని.
నభా
ఈ పేరుకు అర్థం ఆకాశం, గొప్ప వ్యక్తి అని.
నాద్య
ఈ పేరుకు అర్థం ప్రారంభం అని.
నైమిషా
ఈ పేరుకు అర్థం క్షణికమైన అని.
నయన
అందమైన కళ్లున్న అమ్మాయి అని అర్థం.
నైషా
ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి, అందమైన పువ్వు అని ఈ పేరుకు అర్థాలు.
నమీరా
ఈ పేరుకు అర్థం పవిత్రమైన స్త్రీ అని.
నమిషా
ఈ పేరుకు అర్థం ఆనందాన్ని ఇచ్చే వ్యక్తి అని.
నందిక
ఈ పేరుకు అర్థం లక్ష్మీదేవి అని.
నవణ్య
ఈ పేరుకు అర్థం అందమైన స్త్రీ అని.