Turmeric Lemon Water : రోజూ నిమ్మరసంలో పసుపు కలిపి తాగితే అద్భుతాలు
12 October 2023, 18:30 IST
- Turmeric Lemon Water Benefits : చాలామంది తరచుగా కడుపు సమస్యలతో బాధపడుతుంటారు. దీని నుంచి బయటపడేందుకు ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అందులో భాగంగా నిమ్మరసంలో పసుపు కలిపి తాగండి. దీని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
ప్రతీకాత్మక చిత్రం
ఒక్కో సీజన్లో ఒక్కో విధంగా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వాటి నుంచి బయటపడాలి అంటే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించాలి. జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా సాధారణంగా వస్తాయి. ఇలాంటి సమయంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో నిమ్మకాయ, పసుపు నీరు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ పానీయం సహజమైన డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. టాక్సిన్స్‌ని తొలగించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇందులో యాంటీమైక్రోబయల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది బ్యాక్టీరియా, ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మరసం, అర టీస్పూన్ పసుపు పొడిని కలపండి. ఈ పానీయం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం..
నిమ్మ, పసుపు కలిపి నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి, పసుపులో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. ఈ రెండు పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
నిమ్మ, పసుపు రెండూ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేయడంలో, పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. పసుపు అపానవాయువు, అజీర్ణం, గ్యాస్, అసిడిటీని తొలగిస్తుంది.
నిమ్మకాయ, పసుపు పానీయం మన శరీరంలో సహజమైన డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలోని టాక్సిన్‌లను బయటకు పంపుతుంది. పసుపు శరీరం నుండి విషాన్ని కూడా తొలగిస్తుంది.
మీరు ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ-పసుపు పానీయం తాగవచ్చు. ఈ ఆరోగ్యకరమైన పానీయాన్ని భోజనానికి 30 నిమిషాల ముందు తాగండి. పడుకునే ముందు ఈ డ్రింక్ తీసుకోకపోవడమే మంచిది. ఇది నిద్ర భంగం కలిగించవచ్చు. నిమ్మ, పసుపుతో కూడిన ఈ పానీయం ఆరోగ్యకరమైనది అయినప్పటికీ, దానిని ఎక్కువగా తీసుకోవద్దు. మితంగా తాగాలి. అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణకోశ సమస్యలు లేదా శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడవచ్చు.