Happy Kanuma 2024 : కనుమ శుభాకాంక్షలు.. ఇలా చెప్పేందుకు ప్లాన్ చేయండి
15 January 2024, 15:30 IST
- Kanuma Wishes Telugu : సంక్రాంతి పండుగలో మూడో రోజు కనుమ. దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. వ్యవసాయంలో సాయం చేసే పశువులను పూజించే రోజు ఇది. ఈ పండుగ శుభాకాంక్షలు చెప్పేందుకు కోట్స్ ఉన్నాయి.
కనుమ శుభాకాంక్షలు
సంక్రాంతి సంబరాల్లో ముఖ్యమైన రోజు కనుమ. ఇది రైతులకు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే పశువులను దేవుడిలా పూజిస్తారు. తాను కడుపు నింపుకోకున్నా పశువులకు పొట్ట నింపే ఆలోచనతో ఉంటాడు రైతు. అందుకే వాటిపై మమకారం ఎక్కువగా ఉంటుంది. పంట చేతికి అందండంలో సాయపడే పశు పక్ష్యాదులకు కనుమ రోజున పూజ చేస్తారు. వాటిని చెరువుల వద్దకు తీసుకెళ్లి స్నానం చేయిస్తారు. పశువుల కొమ్ములకు నూనె రాస్తారు. వాటిని అలంకరిస్తారు. ఇంటి దగ్గర పూజ చేస్తారు.
పశువులు అంటే రైతులకు చెప్పలేని ప్రేమ ఉంటుంది. అలాగే పక్షులను కూడా ఎంతగానో ప్రమిస్తాడు అన్నదాత. వాటి కోస కనుమ నాడు ధాన్యపు కంకులు వేలాడదీస్తారు. మూడు రోజుల పండుగలో కనుమ రోజునే రైతులకు తృప్తి. వ్యవసాయంలో సాయం చేసిన వాటిని పూజించుకుంటే అదో ఆనందం. అలాంటి కనుమ రోజు శుభాకాంక్షలును మీ బంధుమిత్రులకు తెలియజేయండి.
ఏడాది పొడవునా తమ కష్టంలో పాలు పంచుకునే పశువులను రైతులు పూజించే పండుగ కనుమ.. అందరికీ కనుమ శుభాకాంక్షలు
వ్యవసాయంలో సాయం చేసే పశువులను పూజించే పండుగ కనుమ.. Happy Kanuma
కష్టానికి తగని ప్రతిఫలం కనుమ.. శ్రమకోర్చిన పశువులకు ఇచ్చే గౌరవం కనుమ.. మనలో మంచితనం వెలిగించే దినం కనుమ.. కుటుంబ సభ్యులు ఆనందంగా గడిపే రోజు కనుమ.. Happy Kanuma 2024
కలంతో వర్ణించ తరమా పల్లె అందాలు..
కన్నులతో బంధించ గలమా కనుమ చిత్రాలు..
ఇంటికి చేరే ధాన్యపు సిరులు..
ఒంటికి బలాన్నిచ్చే పిండి వంటలు..
పాడి పశువులను పూజించే గొప్ప హృదయాలు..
పక్షులకు స్వాగతం పలికే ధాన్యపు కంకులు..
వినోదాలను పంచే కోళ్ల పందేలు..
ఆనందాలను పంచే కనుమ..
బందాలను కలిపే కనుమ..
ఆరోగ్యాన్ని ఇచ్చే కనుమ..
సిరులను చేకూర్చే కనుమ..
Happy Kanuma 2024
మూడు రోజుల సంబరం.. ఏడాదంతా జ్ఞాపకం.. ఈ దినం ఊరించే వింధులతో వేడుక చేసుకుందాం.. మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ శుభాకాంక్షలు
రోకల్లు దంచే ధాన్యాలు.. మనసులను నింపే మాన్యాలు.. రెక్కల కష్టంలో సాయం చేసే పాడి పశువులు.. మళ్లీ మళ్లీ చేసుకోవాలి ఇలాంటి వేడుకలు.. అందరికీ కనుమ శుభాకాంక్షలు
ముంగిళ్లలో అందమైన రంగవల్లులు.. బసవన్నల ఆటపాటలు.. ఈ కనుమ మీకు కమ్మని అనుభూతులను ఇవ్వాలని కోరుకుంటూ కనుమ శుభాకాంక్షలు
రైతే రాజుగా రాతలు మార్చే పండుగ.. పంట చేలు కోతలతో ఇచ్చే కానుక.. ప్రతి ఇంట్లో జరగాలి ఇలాంటి వేడుక.. Happy Kanuma