తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Happy Diwali 2022 | దీపావళి శుభాకాంక్షలు.. మీ ప్రియమైన వారికి పండగ Wishes, Diwali Greetings తెలియజేయండి!

Happy Diwali 2022 | దీపావళి శుభాకాంక్షలు.. మీ ప్రియమైన వారికి పండగ Wishes, Diwali Greetings తెలియజేయండి!

HT Telugu Desk HT Telugu

04 August 2024, 1:24 IST

google News
    • Happy Diwali 2022: దీపావళి శుభాకాంక్షలు.. మీరు మీ ప్రియమైన వారికి పండగ శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే ఇక్కడ Happy Deepavali 2022 Wishes, Diwali Greetings తెలిపే సందేశాలు, చిత్రాలు అందజేస్తున్నాం. మీరు ఈ సందేశాలను Facebook, WhatsApp ద్వారా పంచుకోవచ్చు.
Happy Deepavali 2022
Happy Deepavali 2022

Happy Deepavali 2022

వెలుగుల పండుగ దీపావళి వచ్చేసింది, దేశమంతటా దీపాల వెలుగులు, టపాసుల మోతతో దీపావళి వేడుకలు ఇప్పటికే పెద్దఎత్తున ప్రారంభమైనాయి. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 25న సూచిస్తుండగా, అదే రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో దీపావళి పండగ ఒకరోజు ముందుగా అక్టోబర్ 24న అంటే ఈరోజున జరుపుకుంటున్నారు. మరోవైపు, మంగళవారం సాయంత్రం గ్రహణం ముగిసిన తర్వాత దీపావళి యధావిధిగా జరుపుకోవచ్చని పండితులు సూచించారు. దీంతో ఈ రెండు రోజులు దీపావళి పండగను జరుపుకోనున్నారు.

చీకటిని పారద్రోలి వెలుగులు నింపే పండుగగా, చెడుపై మంచి విజయానికి ప్రతీకగా మనం దీపావళి పండగను జరుపుకుంటాం. హిందూ పురాణాల ప్రకారం 14 ఏళ్ల వనవాసం, లంకపై విజయం తర్వాత శ్రీరాముడు ఈరోజే అయోధ్యకు తిరిగి వచ్చారని ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, అయోధ్య ప్రజలు వేలాది దీపాలను వెలిగించారు, ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.

అలాగే దీపావళి సందర్భంగా సంపద, ఐశ్యర్య వృద్ధి, ఆరోగ్య వృద్ధిని కోరుతూ లక్ష్మీదేవి, వినాయకుడు, కుబేరులను పూజించటం అనవాయితీ. లక్ష్మీపూజలతోనే దీపావళి వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా ఇళ్లను రంగవల్లులు, దీపాల వరుసలతో అలంకరిస్తారు. పాయసం వండుకొని నోరు తీపిచేసుకుంటారు. ఒకరికొకరు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటారు. సాయంత్రం ఆనందంగా టపాకాయలు కాల్చుతారు.

మీరూ, మీ ప్రియమైనవారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే Happy Deepavali 2022 Wishes, Diwali Greetings తెలిపే సందేశాలు, చిత్రాలు అందజేస్తున్నాం. మీరు ఈ సందేశాలను Facebook, WhatsApp సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ద్వారా మీ ప్రియమైన వారితో పంచుకోండి, పండగ ఆనందాలను మరింత మందికి పంచండి.

మహాలక్ష్మీ ఆశీర్వాదంతో మీ ఇంట్లో సిరులు పండాలి, మీరు ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.

Happy Deepavali- దీపావళి శుభాకాంక్షలు

Happy Diwali

ప్రేమ దీపాన్ని వెలిగించండి, బాధలను టపాసులా పేల్చేయండి, శ్రేయస్సును రాకెట్‌లా ఎత్తుకు ఎగరనీయండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.

Happy Deepavali- దీపావళి శుభాకాంక్షలు

Happy Diwali

దీపాల మెరుపులతో, లక్ష్మీపూజల ఆరాధనలతో పరమ పవిత్రమైన ఈ రోజున ఈ దీపాల పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.

Happy Deepavali- దీపావళి శుభాకాంక్షలు

Happy Diwali

కోటి దీపాల దీపావళి మీ జీవితాలలో కొంగొత్త వెలుగులు తేవాలని, అంతులేని ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం, సంపదలతో వర్ధిల్లాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.

Happy Deepavali- దీపావళి శుభాకాంక్షలు

Happy Diwali

ఈ పండగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.

తదుపరి వ్యాసం