Happy April Fool’s Day 2023 : ఏప్రిల్ ఫూల్స్ డే ఎందుకు వచ్చింది? వందల ఏళ్ల క్రితమే ఫూల్స్ అయ్యారా?
01 April 2023, 7:20 IST
- Happy April Fool’s Day 2023 : ఏప్రిల్ 1 వచ్చేసింది. ఈ రోజున ఫ్రెండ్స్, కొలీగ్స్, ఇంట్లో వాళ్లను ఫూల్స్ చేసేందుకు ట్రై చేస్తారు చాలామంది. అయితే ఏప్రిల్ 1ని ఫూల్స్ డే అని ఎందుకు అంటారో తెలుసా?
ఏప్రిల్ ఫూల్స్ డే
Happy April Fool’s Day : ఏప్రిల్ ఒకటో తేదీన తెలిసిన వారిని ఫూల్స్ చేసేందుకు ట్రై చేస్తారు. దీనికోసం రకరకాలు ఆలోచిస్తారు. అందుకోసం ప్లాన్స్ వేస్తుంటారు. అయితే నిజానికి ఏప్రిల్ 1వ(April 1st) తేదీన పూల్స్ డే(Fools Day) ఎందుకు జరుపుతారు? దీనికి సంబంధించి కొన్ని కథలు ఉన్నాయి.
ఇప్పుడంటే.. జనవరి 1వ తేదీన న్యూ ఇయర్ జరుపుతాం. కానీ ఒకప్పుడు ఏప్రిల్ 1వ తేదీని రోమన్లు, యురొపియన్లు కొత్త ఏడాది ప్రారంభ రోజుగా జరుపుకొనేవారట. 1582 సంవత్సరంలో పోప్ గ్రెగరీ అనే చక్రవర్తి కొత్త క్యాలెండర్‌ను తయారు చేయించారు. దీనిప్రకారమే.. కొత్త సంవత్సరాన్ని జనవరి 1న జరుపుకోవాలని ఆదేశాలు ఇచ్చారట రాజుగారు. ఈ విషయం కొంతమందికి నచ్చింది. మరికొంతమందికి నచ్చలేదు.
రాజుగారి నిబంధన నచ్చనివారు.. మాత్రం ఏప్రిల్ 1వ తేదీనే నూతన సంవత్సరాన్ని యథావిధిగా జరిపేవారని కథ ఉంది. జనవరి 1వ తేదీన గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం జరుపుకొనేవారి సంఖ్య పెరిగింది. ఏప్రిల్ 1వ తేదీన జరిపే వారి సంఖ్య తగ్గింది. దీంతో ఏప్రిల్ 1వ తేదీన కొత్త సంవత్సరం జరిపేవారిని ముర్ఖులుగా చూడటం మెుదలుపెట్టారట. ఇలానే క్రమక్రమంగా వారిని పూల్స్ అనడం స్టార్ట్ చేశారు. రాను రాను అది ఫూల్స్ డే(Fools Day)గా మారిందని ఓ కథ ప్రచారంలో ఉంది.
ఈ ఫూల్స్ డే(Fools Day)కు మరో కథ కూడా బాగా ప్రచారంలో ఉంది. మొదటి సారి 1686లో యూనెటెడ్ కింగ్డమ్ లోని జాన్ ఆబెరీ ప్రారంభించాడని చెబుతారు. 1686, ఏప్రిల్ 1న లండన్ క్లాక్ టవర్ దగ్గర సింహం చనిపోయి ఉంది అని కొన్ని పుకార్లు లేపాడు. ఇది నమ్మిన జనం.. సింహాన్ని చూసేందుకు క్లాక్ టవర్ దగ్గరకు భారీగా వచ్చారు. అక్కడు వెళ్లి చూసి అవాక్కయ్యారు.
సింహం లేదని నిజం తెలుసుకుని.. ఇంటికి వెళ్లిపోయారు. తర్వాత రోజు అసలు కథ బయటకు వచ్చిందట. జాన్ ఆబేరినే.. పుకారు లేపాడని తెలుసుకుంటారు. అందరినీ నమ్మించి ఫూల్ చేశాడని మరుసటి రోజు వార్తలు వచ్చాయి. నిజం అని నమ్మిన వాళ్లంతా ఫూల్ అయ్యారు. అలా ఏప్రిల్ 1వ తేదీకి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి.
ఏప్రిల్ 1 ఫూల్స్ డే(April 1 Fools Day)కు ప్రపంచంలో ఎక్కడ సెలవు పాటించరు. ఉక్రెయిన్‌లోని ఒడెసాలో మాత్రం ఈరోజును ప్రభుత్వ సెలవు దినంగా పాటిస్తారు. ఎన్ని కథలు ప్రచారంలో ఉన్నా.. నవ్వేందుకు, వినోదం కోసం.. ఓ రోజు ఉంది. హాయిగా నవ్వుకోండి. అందరినీ నవ్వించండి.. మీకు HT Telugu తరఫున ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు.
Happy April Fool’s Day
టాపిక్