తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Henna On The Hair : హెన్నా అప్లై చేసిన తర్వాత ఎంత సేపటికి జుట్టు కడగడం మంచిది?

Henna On The Hair : హెన్నా అప్లై చేసిన తర్వాత ఎంత సేపటికి జుట్టు కడగడం మంచిది?

Anand Sai HT Telugu

22 April 2023, 14:45 IST

    • Henna On The Hair : చాలా మంది హెన్నాను హెయిర్ కలరింగ్ కోసం ఉపయోగిస్తారు. తలపై తెల్ల వెంట్రుకలు కనిపిస్తే, గోరింట ఉపయోగించవచ్చు. ఆకును మెత్తగా నూరి వాడితే హెయిర్ కలరింగ్ అవసరం లేకుండా జుట్టు ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ దీనికి బదులుగా మార్కెట్‌లో దొరికే హెన్నాను చాలా మంది వాడుతున్నారు.
హెన్నా
హెన్నా

హెన్నా

వెంట్రుకలకు చాలా మంది హెన్నాను వాడుతుంటారు. అయితే ఇది ఎంతసేపు ఉంచుకోవాలనేది మాత్రం.. సరిగా తెలియదు. కాసేపు పెట్టేసి.. ఇలా స్నానం చేస్తారు కొంతమంది. మీరు హెయిర్ కలరింగ్(Hair Colouring) కోసం హెన్నాను కూడా ఉపయోగిస్తున్నట్లయితే, కొన్ని చిట్కాలను మీరు తెలుసుకుంటే హెన్నా.. ప్రయోజనాలను చాలా ఎఫెక్టివ్‌గా పొందవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

మీరు హెన్నా(Henna)ను ఉపయోగించినప్పుడు మీరు వీలైనంత వరకు సహజమైనదే ఉపయోగించాలి. రసాయనాలతో కూడిన హెన్నాను ఉపయోగించడం వల్ల జుట్టు(Hair) దెబ్బతింటుంది. కాబట్టి రసాయనాలతో కూడిన హెన్నాకు దూరంగా ఉండండి.

ఓన్లీ గోరింటాకు మిక్సీ చేసి వాడే బదులు, గోరింట పొడిలో ఒక చెంచా పసుపు, ఆవాల నూనె, 1 చెంచా మెంతి పొడి, కొంచెం నీరు వేసి కలిపి జుట్టు(Hair)కు పట్టించాలి.

మీ జుట్టు త్వరగా జిడ్డుగా మారినట్లయితే, హెన్నాను నీటిలో కలిపి తలకు పట్టించి, అరగంట తర్వాత తల స్నానం చేయండి.

కండిషనింగ్ కోసం హెన్నాను ఎలా ఉపయోగించాలో కూడా మీరు తెలుసుకోండి. గోరింటాకు, ముల్తానీ మట్టి, నీరు కలిపి తలకు పట్టించి 10 నిమిషాల తర్వాత తలస్నానం(head bath) చేయాలి. ఇలా చేస్తే హెయిర్ కండీషనర్(Hair Conditioner) వాడినట్లు అవుతుంది.

హెన్నా సహజమైనదో కాదో ఎలా తెలుసుకోవాలి?

కాస్త హెన్నా(Henna) తీసుకుని టేబుల్ మీద పెట్టి, గ్లాసు పెట్టి రుద్దేటప్పుడు స్మూత్ గా ఉండాలి.. లేదంటే అది కల్తీది. సహజమైన హెన్నా వాసన గోరింట ఆకుల వాసనను పోలి ఉంటుంది. నేచురల్ హెన్నా(Natural Henna) వాడితే జుట్టు నల్లగా కాకుండా ఎర్రగా మారుతుంది. ఒక గ్లాసు వేడి నీళ్లలో ఒక చెంచా గోరింటాకు వేసి అందులో 20 చుక్కల పెరాక్సైడ్, 10 చుక్కల అమ్మోనియా వేసి అందులో రాలిన వెంట్రుకలను వేస్తే ఆ వెంట్రుకల్లో మార్పు రాకపోతే అది సహజమైన హెన్నా.

ఎక్కువ కాలం ఒత్తిడి అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు వస్తాయి. ఈ కారణంగా మీ జుట్టు(Hair)పై ప్రభావం ఉంటుంది. ఫలితంగా జుట్టు రాలడం(Hair Loss) వంటి సమస్యలను చూస్తారు. క్రమక్రమంగా వెంట్రుకలు(Hairs) తెల్లబడటం మెుదలవుతుంది. ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి.

రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఉపయోగించడం వలన కూడా జుట్టు సమస్యలు(Hair Problems) వస్తాయి. హెయిర్ ప్రొడక్ట్స్‌(Hair Products)లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.

తదుపరి వ్యాసం