Heart Stroke Death Video: పెళ్లింట విషాదం.. పాదాలకు పసుపు రాస్తూ కుప్పకూలిపోయాడు-hyderabad man dies of cardiac arrest during groom haldi ceremony video viral on social media ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hyderabad Man Dies Of Cardiac Arrest During Groom Haldi Ceremony Video Viral On Social Media

Heart Stroke Death Video: పెళ్లింట విషాదం.. పాదాలకు పసుపు రాస్తూ కుప్పకూలిపోయాడు

HT Telugu Desk HT Telugu
Feb 24, 2023 12:16 PM IST

Hyderabad Viral News: హార్ట్ స్ట్రోక్ తో ఈ మధ్య వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓపెళ్లి వేడుకలో కూడా ఈ తరహా ఘటన జరిగింది. వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్న ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

పెళ్లిలో విషాదం
పెళ్లిలో విషాదం

Hyderabad Man Dies of Cardiac Arrest: గుండెపోటు కేసులు.... ఈ మధ్యకాలంలో అత్యధికంగా నమోదవుతున్నాయి. మన మధ్యలోనే ఉంటూ సంతోషంగా గడుపుతూ ఒక్కసారిగా పడిపోతున్నారు. కొందరు స్టేజీలపై డ్యాన్స్ లు, ప్రసంగాలు చేస్తూ కిందపడిపోయి చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇక జిమ్స్ లో వర్కౌట్స్ చేస్తూ చనిపోతున్న ఘటనలు నిత్యం వెలుగు చూస్తున్నాయి. అయితే తాజాగా హైదరాబాద్ లోని ఓ పెళ్లి వేడుకలోనూ ఇదే తరహా ఘటన జరిగింది.

ట్రెండింగ్ వార్తలు

పాతబస్తీలోని కాలాపత్తార్‌లో ఓ వివాహ వేడుక జరిగింది. ఇందుకు మహమ్మద్ రబ్బాని అనే హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో బంధువులంతా ఉత్సాహంగా పాల్గొని పెళ్లి కుమారుడిని ముస్తాబు చేస్తన్నారు. ఇంతలో మహమ్మద్ రబ్బాని పెళ్లి కొడుకు వద్దకు వచ్చి అతడి కాళ్లకు పసుపు రాస్తుండగా నవ్వుతూ కిందకు కూర్చున్నాడు. ఒక్క క్షణంలోనే కూర్చున్న చోటే కుప్పకూలాడు. వెంటనే గమనించిన బంధువులు అతన్ని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు... రబ్బాని గుండెపోటుతో మరణించినట్లు తేల్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

మరో ఘటన.. కానిస్టేబుల్ మృతి..

Police constable dies due to cardiac arrest: ఇదిలా ఉండగానే... ఇవాళ హైదరాబాద్ లో మరో ఘటన జరిగింది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న...యువకుడు కుప్పకూలిపోయాడు. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న టైంలో 24 ఏళ్ల పోలీస్‌ కానిస్టేబుల్ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలాడు.ఆస్పత్రికి తరలించగా అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మృతుడిని బోయిన్‌పల్లికి చెందిన విశాల్ గా గుర్తించారు. ప్రస్తుతం ఆసిఫ్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. 24 ఏళ్లకే విశాల్ కోల్పోవడంతో కుటుంబసభ్యులను కన్నీరుమున్నీరు అవుతున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం