తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Green Coffee : ఇప్పుడు గ్రీన్ టీ కాదు.. గ్రీన్​ కాఫీదే ట్రెండ్ అంతా..

Green Coffee : ఇప్పుడు గ్రీన్ టీ కాదు.. గ్రీన్​ కాఫీదే ట్రెండ్ అంతా..

04 August 2022, 10:15 IST

google News
    • Green Coffee Benefits : చాలా మంది బరువు తగ్గడానికి, శరీరాన్ని డిటాక్స్ చేయడానికి గ్రీన్ టీ తాగుతారు. అయితే గ్రీన్ కాఫీ కూడా గ్రీన్ టీ కంటే తక్కువ కాదని మీకు తెలుసా? గ్రీన్ టీ మరింత ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు నిపుణులు. అందుకే వారు గ్రీన్ కాఫీ తాగమని సిఫార్సు చేస్తున్నారు.
గ్రీన్ కాఫీ
గ్రీన్ కాఫీ

గ్రీన్ కాఫీ

Green Coffee Benefits : సాధారణంగా కాఫీ గింజలను కాల్చడం ద్వారా అత్యంత ప్రజాదరణ పొందిన కాఫీని తయారు చేస్తారు. బీన్స్ గ్రైండ్ చేయడం ద్వారా బ్లాక్ కాఫీ పౌడర్ వస్తుంది. అదేవిధంగా కాఫీ గింజలను వేయించడానికి ముందు.. పచ్చి గింజలను పొడి చేస్తే.. గ్రీన్​ కాఫీ పొడి లభిస్తుంది. దానితో గ్రీన్ కాఫీ తయారు చేస్తారు. అయితే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు నిపుణులు. మరి దాని గుణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

* బరువు తగ్గడానికి ఈ కాఫీ అంత మంచిది కాదు. కానీ సాధారణ కప్పులతో ఈ కాఫీ తాగితే బరువు అదుపులో ఉంటుంది.

* గ్రీన్ కాఫీలోని అనేక పదార్థాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. రెగ్యులర్​గా గ్రీన్ కాఫీ తాగేవారిలో మొటిమలు, ఇతర చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. కాబట్టి ఈ కాఫీ తాగడం వల్ల చర్మానికి కూడా మేలు జరుగుతుంది.

* ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీవక్రియ రేటును పెంచడంలో సహాయపడుతుంది. దీనితో పాటు మెదడు శక్తిని పెంచడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

* శరీరాన్ని టాక్సిన్ రహితంగా లేదా కాలుష్య రహితంగా మార్చేందుకు ఈ కాఫీ గ్రేట్​గా సహాయపడుతుంది. ఫలితంగా వివిధ వ్యాధులబారిన పడే ప్రమాదం తగ్గుతుంది.

* ఉదయాన్నే ఈ కాఫీ తాగడం వల్ల చాలా సేపు కడుపు నిండిన ఫీల్ వస్తుంది. ఫలితంగా త్వరగా ఆకలి తీరదు. అతిగా తినకపోవడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది.

* గ్రీన్ కాఫీలో మిమ్మల్ని రిఫ్రెష్ చేసే కొన్ని పదార్థాలు ఉన్నాయి. దీంతో మీరు రోజంతా పని చేసే సామర్థ్యం పెరుగుతుంది. అలసట కూడా తగ్గుతుంది.

* ముఖం ముడుతలను తగ్గించుకోవడానికి కూడా ఈ కాఫీ ఉపయోగపడుతుంది. రెగ్యులర్​గా గ్రీన్ కాఫీ తాగే వారి ముఖాల్లో వయసు ముద్ర తక్కువగా ఉంటుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.

* ఈ కాఫీ మధుమేహం సమస్యను కూడా తగ్గిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్​లో ఉంచుతాయి. మీకు డయాబెటిస్ సమస్యలు ఉంటే.. మీరు ఈ కాఫీ నుంచి ప్రయోజనం పొందుతారు.

తదుపరి వ్యాసం