Night Yoga | నిద్రించే ముందు ఈ యోగాసనాలు వేస్తే ప్రశాంతంగా నిద్రపోవచ్చు!
12 April 2022, 21:47 IST
- రాత్రి త్వరగా నిద్రపట్టడానికి, ప్రశాంతంగా నిద్రపోవడానికి యోగా గురువులు సూచించిన మూడు ఆసనాలు, రెండు ధ్యాన ముద్రల గురించి తెలుసుకోండి..
Yoga tricks to fall asleep
ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేస్తే విశేష ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనకు తెలుసు. అయితే రాత్రి సమయంలో చేస్తే మంచి నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని యోగాసనాలు, ధ్యాన ముద్రలు ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మనస్సును శాంతపరుస్తాయి. శరీరంను తేలికపరిచి, అంతర్గతంగా ప్రశాంతతను చేకూర్చి మీరు బాగా నిద్రపోవడానికి సహకరిస్తాయి.
HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగా మాస్టర్, ఆధ్యాత్మిక గురువు అక్షర్ రాత్రివేళలో అభ్యసించే ప్రాణాయామం, ధ్యానం సంబంధిత వివరాలను పంచుకున్నారు.
ఈ అభ్యాసాలు చేయడానికి ప్రతి రాత్రి 5, 10 లేదా 15 నిమిషాలు కేటాయించాలని తెలిపారు. తొలిదశలో నిద్రపోయే ముందు 2 - 3 నిమిషాలు చేయవచ్చు, ఆ తర్వాత క్రమంగా పెంచతూపోవచ్చని సూచించారు. ప్రతి యోగా భంగిమను దాదాపు 30 సెకన్ల పాటు చేయాలి, ఇలా దీనినే మూడు సార్లు పునరావృతం చేయాలని సూచించారు.
వేగంగా నిద్రపోవడానికి రాత్రివేళలో బాలాసనం, సుఖాసనం, వజ్రాసనం వేయమని యోగా గురువు సూచించారు.
బాలాసనం
సుఖాసనం
వజ్రాసనం
ఇక వీటితో పాటు రెండు ధ్యాన ముద్రలు సూచించారు. అవేంటంటే..
ప్రార్థనా ధ్యానం
సౌకర్యవంతమైన భంగిమలో కూర్చోండి. ప్రాణం ముద్రను రూపొందించడానికి మీ రెండు అరచేతులను మీ ఛాతీ మీద ఉంచండి. మీ వీపును నిఠారుగా ఉంచండి. కళ్ళు మూసుకోండి. ఎలాంటి ఆలోచనలు లేకుండా ఇలా కొద్దిసేపు అభ్యసించండి.
ఉద్గీత ప్రాణాయామం
సౌకర్యవంతమైన భంగిమలో కూర్చోండి. మీ వీపును నిఠారుగా ఉంచండి, కళ్ళు మూసుకోండి. మీ అరచేతులను మీ మోకాళ్లపై ఉంచండి. లోతుగా శ్వాస పీల్చుకోండి, కొద్దిసేపు ఊపిరి బిగపట్టి వదలండి. ఇప్పుడు మీకు వీలైనంత సేపు "Oooooooommm" అంటూ ఓంకార శబ్దాన్ని పఠించండి. ఈ ఓంకార నాద ధ్వని ప్రకంపనలు మీ శరీరం అంతటా వ్యాపించినట్లు అనుభూతి చెందండి.
టాపిక్