తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Facial Exercises । అందమైన ముఖాకృతిని పొందాలా? అయితే ఈ ముఖ వ్యాయామాలు చేయండి!

Facial Exercises । అందమైన ముఖాకృతిని పొందాలా? అయితే ఈ ముఖ వ్యాయామాలు చేయండి!

HT Telugu Desk HT Telugu

24 August 2022, 16:47 IST

    • ఎప్పుడూ కండల కాంతారావులా కండలు పెంచటమేనా? మంచి శరీరాకృతి కోసం వ్యాయామం చేస్తారు, సరే. మరి మంచి ముఖాకృతి పొందాలంటే? అందుకు కూడా వ్యాయామాలు ఉన్నాయి. అవేంటో చూడండి.
Facial Exercises
Facial Exercises (iStock)

Facial Exercises

చాలామంది వ్యాయామం అనగానే శారీరక ఫిట్‌నెస్ సాధించటానికి, కండలు పెంచటానికి, పొట్ట తగ్గించటానికి, మంచి శరీరాకృతిని పొందటానికి అనుకుంటారు. అందుకు తగినట్లుగా వ్యాయామాలను ఎంచుకుంటారు. ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఇది మంచి అలవాటే. అయితే శరీర భాగాలు అన్నింటికి సంబంధించిన వ్యాయామాలు చేస్తారు, కానీ ముఖం కూడా వారి శరీరంలో భాగమే అని గుర్తించరు. ముఖానికి సంబంధించిన వ్యాయామాలపై ఎలాంటి దృష్టి పెట్టరు.

ట్రెండింగ్ వార్తలు

Night Time Ice Cream : రాత్రిపూట ఐస్‌క్రీమ్ తినడం రొమాంటిక్ అనుకోకండి.. మెుత్తం ఆరోగ్యం మటాష్!

Walking Without Footwear : కొంతమంది చెప్పులు లేకుండా నడుస్తారు.. ఎందుకని ఆలోచించారా?

Cucumber Lassi Benefits : దోసకాయ లస్సీ.. 5 నిమిషాల్లో రెడీ.. శరీరాన్ని చల్లబరుస్తుంది

International Tea Day : ఇంటర్నేషనల్ టీ డే.. టీ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకోండి

నిజానికి ఎవరైనా సరే ఒక వ్యక్తికి సంబంధించి ముందుగా చూసేది వారి ముఖాన్నే. అందమైన ముఖం ఉండాలి, చక్కని చెక్కిళ్లు ఉండాలి, మంచి ఆకృతిలో దవడ ఉండాలి అని కోరుకుంటారు. మరి అది కావాలంటే ఎలా? అందుకు సంబంధించి ఎలాంటి ఉత్పత్తులు మార్కెట్లో లభించవు. కాస్మెటిక్ సర్జరీ ద్వారా ముఖాకృతిని మార్చుకోవటం అందరికీ సాధ్యం కాదు. కానీ వ్యాయామం చేయటం ద్వారా ముఖానికి సంబంధించి ఒక ఆకృతిని తీసుకురావచ్చు. ముడతలను నివారించవచ్చు.

మీ శరీరంలోని మిగిలిన భాగాల మాదిరిగానే, మీ ముఖం, మెడ భాగాలలో ఉండే కండరాలను టోన్‌గా, ఫిట్‌గా మార్చటానికి వ్యాయామం అవసరం. సొగసైన ముఖం పొందడానికి, వృద్ధాప్య ఛాయలను ఎదుర్కోవడానికి ఈ వ్యాయామాలు మీకు సహాయపడతాయి. మరి ముఖానికి సంబంధించి వ్యాయామాలు ఏమిటి? ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

చీక్‌బోన్ లిఫ్ట్

మైసూర్ బజ్జీలలాంటి బుగ్గలు కలిగినవారు వారి చెంపల పరిమాణాన్ని తగ్గించుకోవటానికి ఈ వ్యాయామం ఉపయోగపడుతుంది. ఇది ఎలా చేయాలంటే.. మీ రెండు చేతులను రెండు బుగ్గలపై ఉంచండి. చెంప ఎముక ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీ వేళ్లను ఉంచండి. ఆ భాగంలో కండరాలను పైకి అంటే కింది నుంచి కంటివైపు లేపి, అలాగే అదిమిపట్టుకోండి. ఇదే సమయంలో 'O' ఆకారంలో నోరు తెరిచి ఉంచండి. ఇలా 5 సెకన్లపాటు ఉండాలి. ఈ వ్యాయామాన్ని 10-15 సెట్లుగా రిపీట్ చేయండి.

పఫర్ ఫిష్ ప్రెస్

మీరు ఫవర్ ఫిష్ చూశారా? దాని చెంపలు గాలితో ఉబ్బినట్లుగా ఉంటాయి. సేమ్ అలాగే ఈ వ్యాయామం చేయాలి. మీ నోటిని గాలితో నింపండి. ఆ గాలి బయటకు పోకుండా నోటిలోనే బంధించండి. ఇప్పుడు ఆ గాలిని 10 సెకన్ల పాటు ఎడమ చెంపవైపు నెట్టండి, మరోసారి కుడి చెంపవైపు నెట్టండి. ఈ ప్రక్రియను కొన్నిసెట్ల వరకు పునరావృతం చేస్తూ ఉండండి. ఈ వ్యాయామం మీ ముఖ కండరాలలో రక్త ప్రసరణను పెంచుతుంది. దీంతో చెంపలు బిగుతుగా అవుతాయి, ముఖం స్లిమ్ గా మారుతుంది.

జా-ఫ్లెక్స్

దవడలు ఎక్కువగా ఉంటే మీరు పెద్దవారిలా కనిపిస్తారు. మీ ముఖం పెద్దగా కనిపిస్తుంది. అయితే ఈ ఫేస్ వర్కౌట్‌తో ముఖం కొవ్వును తగ్గించవచ్చు, మరింత నిర్దిష్ట రూపాన్ని పొందవచ్చు. దీనిని ఎలా చేయాలంటే.. మీరు మీ ఇంటి పైకప్పును చూసేలా మీ తలను పైకెత్తి వీలైనంత వెనుకకు వంచండి. ఇప్పుడు మీకింది పెదవితో మీ పైదవిని కప్పేసేలా వీలైనంతవరకు మీ కిందపెదవైని పైకి ముక్కు వరకు జరుపుతూ ఉండండి. ఈ సందర్భంలో మీ చెవుల దగ్గర దవడ కండరాలలో ఒత్తిడి కలుగుతుంది. ఇలా 10 సెకన్లపాటు పట్టుకోండి. 10-15 సెట్లను పూర్తి చేయండి.

ఐబ్రో మసాజ్

ఈ వ్యాయామం చేయడం వల్ల మీ కనుబొమ్మలు రాలిపోకుండా నివారించవచ్చు. నుదురు ముడతలు పోవడానికి సహాయపడుతుంది. ఎలా చేయాలంటే.. మీ చూపుడు, మధ్య వేలును మీ కనుబొమ్మలపైన నుదురు భాగంలో ఉంచండి ఉంచండి. ఇప్పుడు మీ కనుబొమ్మలను పైకి ఎత్తుతూ ఉండండి. మీ వేళ్లతో సున్నితంగా నురురు చర్మాన్ని పైకి అంటూ ఉండండి. ఈ ప్రక్రియ అంతటా మీ కళ్ళు తెరిచి ఉండేలా చూసుకోండి. ఇలా 30 సెకన్లపాటు సార్లు రిపీట్ చేయండి, 6 సెట్లను పూర్తి చేయండి.

తదుపరి వ్యాసం