తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Classic Whiskey Cocktails | ఒక గ్లాసు విస్కీలో మీ ప్రేమను నిండుగా కలిపి సేవించండి, ఇవిగో కాక్‌టెయిల్ రెసిపీలు!

Classic Whiskey Cocktails | ఒక గ్లాసు విస్కీలో మీ ప్రేమను నిండుగా కలిపి సేవించండి, ఇవిగో కాక్‌టెయిల్ రెసిపీలు!

HT Telugu Desk HT Telugu

12 February 2023, 18:30 IST

    • Classic Whiskey Cocktails: వేర్ ఈజ్ ద పార్టీ బాసూ.. ఈ వారాంతంలో హౌస్ పార్టీని ప్లాన్ చేసుకుంటుంటే, మీకోసం అదిరిపోయే కొన్ని విస్కీ రెసిపీలు ఇక్కడ ఉన్నాయి.
Classic Whiskey Cocktails
Classic Whiskey Cocktails (Unsplash)

Classic Whiskey Cocktails

Classic Whiskey Cocktails: రోజూవారీ ఒత్తిళ్లు, చికాకుల నుండి కోలుకోవడానికి వీకెండ్‌లో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటే ఎంతో రిలీఫ్ అనిపిస్తుంది. ఎప్పుడూ తినే ఇంటి భోజనానికి దూరంగా ఒక పూట మన మనసుకు నచ్చిన ఆహారాన్ని తినడం, మంచి మ్యూజిక్ వినిడం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో మీలో అసలైన జోష్ నింపేది మాత్ర మీరు సేవించే పానీయమే. ఏది తినాలో ఎంచుకోవడం సులభంగానే ఉంటుంది, కానీ ఏది తాగాలనే విషయంలోనే తికమక మొదలవుతుంది. చివరకు ఏదో ఒక పానీయంతో సర్దుకుపోతాం.

ట్రెండింగ్ వార్తలు

Male Infertility : మీ స్మార్ట్ ఫోన్ ఈ ప్రదేశంలో పెడితే సంతానోత్పత్తి సమస్యలు

How To Die Properly : చచ్చాక ఎలా ఉంటుందో చూపించే పండుగ.. పిచ్చి పీక్స్ అనుకోకండి

New Broom Tips : కొత్త చీపురుతో ఇంట్లోకి దుమ్ము రావొచ్చు.. అందుకోసం సింపుల్ టిప్స్

Parenting Tips : కుమార్తెలు భయపడకుండా జీవించేందుకు తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు

కానీ, ఎప్పుడూ ఒకేలా ఎందుకు? వారంలో ఒక్కరోజైనా కాస్త ప్రత్యేకంగా ఎందుకు ఆలోచించకూడదు. అందులోనూ ఇది ప్రేమికుల వారం, మీ మనసుకు నచ్చిన వ్యక్తితో మధురమైన సంభాషణలు కొనసాగించేందుకు మీకు కొన్ని బూజీ క్లాసిక్‌ల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. ఒక గ్లాసు 90 ఎంఎల్ విస్కీలో మీ ప్రేమతో నిండుగా నింపి చేసుకోగల మనోహరమైన కాక్‌టెయిల్ రెసిపీలు ఇక్కడ చూడండి.

Whiskey Old Fashioned Cocktail Recipe

కావలసినవి:

  • 90 ml స్కాచ్ విస్కీ
  • 1 చక్కెర క్యూబ్
  • 2 డాష్‌ల అంగోస్తురా బిట్టర్స్
  • 2-3 ఐస్ క్యూబ్స్
  • కొద్దిగా నీరు

విస్కీ ఓల్డ్ ఫ్యాషన్డ్ కాక్‌టెయిల్ తయారీ విధానం

- ముందుగా ఒక గాజు గ్లాసులో షుగర్ క్యూబ్‌ను వేయండి, ఆపై బిట్టర్స్ (చేదు రుచికలిగిన మొక్కల సారాలు) వేసి కొన్ని నీళ్లు కలపండి.

- ఆపై బాగా కలిపి ఐస్ క్యూబ్స్ వేయండి. అనంతరం విస్కీ పోయండి.

- ఆరెంజ్ స్లైస్, కాక్టెయిల్ చెర్రీతో అలంకరించండి.

- మీ డ్రింక్ రెడీ, ఆనందంగా సిప్ చేయండి.

Hot Toddy Cocktail Recipe

కొంచెం మసాలా ప్లేవర్ కలిగిన విస్కీ ట్రై చేయాలనుకుంటే ఈజీగా హాట్ టాడీ చేసుకొని తాగొచ్చు.

కావలసినవి:

  • 90 ml స్కాచ్ విస్కీ
  • 3 స్పూన్ తేనె
  • 1 దాల్చిన చెక్క
  • సగం నిమ్మరసం
  • 2 లవంగాలు

హాట్ టాడీ కాక్‌టెయిల్ తయారీ విధానం

- విస్కీ, తేనెను కలిపి 2 గాజు గ్లాసులలో పోయండి.

- రెండింటిలో సగం సగం దాల్చిన చెక్క వేసి, ఆపై 200ml వేడినీటిని కలపండి.

- రెండింటిలో కొద్దిగా నిమ్మరసం పిండండి.

- చివరగా రెండింటిలో నిమ్మకాయ తొక్కను లవంగంతో గుచ్చి వేయండి.

- ఆ వెంటనే గుటుక్కుమని తాగండి.

Classic Whiskey High Ball Recipe

కావలసినవి:

  • 90 ml స్కాచ్ విస్కీ
  • 100-150ml స్పార్ల్కింగ్ వాటర్ లేదా సోడా
  • 2-3 ఐస్ క్యూబ్స్
  • 1-2 పుదీనా ఆకులు
  • లైమ్ జెస్ట్ స్ట్రిప్

క్లాసిక్ విస్కీ హైబాల్ తయారీ విధానం

- ఒక పొడవైన గాజులో ముందుగా ఐస్ క్యూబ్స్ వేయండి, ఆపై విస్కీ పోయండి.

- ఆ తర్వాత స్పార్ల్కింగ్ వాటర్ లేదా సోడా కలపండి.

- గార్నిష్ చేయడానికి నిమ్మతొక్క తురుము, పుదీనా ఆకులను వేయండి

- అన్నింటిని సున్నితంగా కలపండి.

- మీ డ్రింక్ రెడీ, ఒక్కొక్క సిప్ తాగుతూ ఎంజాయ్ చేయండి.

ఈ వీకెండ్‌కి మీ ఇంట్లో హౌజ్ పార్టీ అయినా, టెర్రస్ పార్టీ అయినా ఈ విస్కీ రెసిపీలను తప్పక ట్రై చేయండి. చివరగా ఒక మంచిమాట.. మద్యపానం ఆరోగ్యానికి హానికరం.

తదుపరి వ్యాసం