World Whisky Day | బాధైనా.. సంతోషమైనా.. విస్కీ ఇచ్చే కిక్కే వేరప్పా..-world whisky day 2022 special story on oldest whisky and some interesting facts ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  World Whisky Day 2022 Special Story On Oldest Whisky And Some Interesting Facts

World Whisky Day | బాధైనా.. సంతోషమైనా.. విస్కీ ఇచ్చే కిక్కే వేరప్పా..

HT Telugu Desk HT Telugu
May 21, 2022 02:59 PM IST

బాధ కలిగినా.. సంతోషం వచ్చినా.. ప్రేమికురాలు ఓకే చెప్పినా.. బ్రేకప్​ అయినా.. ఇంట్లో గొడవ అయినా.. ఫ్రెండ్ బర్త్​డే వచ్చినా.. పార్టీ పేరుతో ఎక్కువమంది యువకులు మొగ్గు చూపేది ఆల్కహాల్​ వైపే. పైగా ఆల్కహాల్ ప్రేమికులకు విస్కీ అనేది నిజమైన ఐకానిక్ పానీయం. ప్రపంచ విస్కీ దినోత్సవం సందర్భంగా.. విస్కీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

విస్కీ డే
విస్కీ డే

World Whisky Day 2022 | మందు బాబులం మేము మందు బాబులం అన్నా.. మందేస్తూ చిందెయ్యరా.. చిందేస్తూ మందు వెయ్యరా అన్నా.. ఆల్కాహాల్​కే చెందింది. ఆల్కాహల్​లో చాలా రకాలు ఉంటాయి. పైగా ఈ రకాలకు ఓ ప్రత్యేకమైన డేలు కూడా ఉన్నాయి. ఈ రోజు ప్రపంచ విస్కీ దినోత్సం.

చరిత్ర

విస్కీ అత్యంత సాధారణ రూపాలలో ఒకటి ఐరిష్ విస్కీ. విస్కీ అనే పదం గేలిక్ భాషనుంచి వచ్చింది. Uisce Beatha అనేది క్లాసికల్ గేలిక్‌లో విస్కీ అసలు పేరు. తరువాత కేవలం Uisce/Uisge గా కుదించారు. అనంతరం దీనిని విస్కీగా ఆంగ్లీకరించారు.

ఇంత విస్కీ అంటే ఏమిటో తెలుసా? విస్కీ అంటే సువాసనగల ధాన్యాలను తీసుకొని వాటిని పులియబెట్టి.. ఆ గుజ్జును తీసుకొని స్వచ్ఛమైన, రుచికరమైన స్పిరిట్‌గా మారుస్తారు. పులియబెట్టిన మాష్ నుంచి ఆల్కహాల్ తయారు చేసే సమయంలో దీనిని రాగి పాత్రలో నిల్వచేస్తారు. ఎందుకంటే రాగి.. ఆల్కహాల్​ నుంచి సల్ఫర్‌ను తొలగిస్తుంది.

విస్కీ గురించి ఆశ్చర్యపరిచే వాస్తవాలివే..

- ఆందోళన కలిగించే వాస్తవంతో ప్రారంభిద్దాం. వైద్యపరమైన లొసుగుల వల్ల విస్కీని నిషేధించవచ్చు కానీ.. వైద్యులు కూడా విస్కీని ఔషధంగా సూచించే చట్టం ఉన్నందున.. ఇది ఇంకా మనుగడలో ఉంది. దాని అర్థం లిమిటెడ్​గా తీసుకుంటే ప్రాబ్లం ఉండదు కానీ.. ఎక్కువగా తీసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని వైద్యులు తెలిపారు.

- ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఖరీదైన విస్కీ సీసాలు ఉన్నాయి. అత్యంత ఖరీదైన మకాలన్ ‘ఎం’ విస్కీని హాంకాంగ్‌లో వేలం వేశారు. లగ్జరీ డికాంటర్‌లో ఆరు లీటర్ల విస్కీ ఉంటుంది. ఇది స్పానిష్ ఓక్ షెర్రీతో తయారు చేసిన క్యాస్‌ల నుంచి తయారు చేశారు.

- పురాతన విస్కీ 150 సంవత్సరాల కంటే పాతది. ప్రపంచంలోని పురాతన విస్కీకి సంబంధించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రస్తుతం 400ml గ్లెనావాన్ స్పెషల్ లిక్కర్ విస్కీ బాటిల్‌కి దక్కింది. ఇది ఐర్లాండ్‌కు చెందిన ఒక కుటుంబానికి చెందినది. అయితే అది లండన్‌లోని బోన్‌హామ్స్‌కు విక్రయించినప్పుడు.. నమ్మశక్యం కాని వెలకు అమ్ముడైంది. దీనిని 1851-1858 మధ్యకాలంలో తయారు చేసినట్లు నమ్ముతారు.

- విస్కీ బీర్‌గా తన జీవితాన్ని ప్రారంభిస్తుంది.ఎందుకంటే ఇది వోర్ట్‌తో తయారు చేస్తారు కాబట్టి. ఇది స్వేదనం చెందిన విస్కీకి మరో రూపం. నిజానికి వోర్ట్ ఒక పింట్. రుచికరమైన బీర్ అంటే మాల్ట్‌లు, ఈస్ట్, నీరు, మరికొన్ని పదార్థాలతో తయారు చేస్తారు.

WhatsApp channel