తెలుగు న్యూస్ / ఫోటో /
Cocktails | ఇంట్లో పార్టీనా? హార్డ్ డ్రింక్స్ వద్దు, ఈ కాక్‌టెయిల్స్ ట్రై చేయండి
- ఇంట్లోనే పార్టీ ప్లాన్ చేస్తున్నారా? అయితే హ్యాంగోవర్ కలిగించే ఆ హార్డ్ ఆల్కహాలిక్ డ్రింక్స్ ను పక్కనబెట్టండి. జిన్‌తో చేసే ఈ రిఫ్రెషింగ్ కాక్‌టెయిల్‌లను ట్రై చేయండి. ఫుల్ కిక్కు..!
- ఇంట్లోనే పార్టీ ప్లాన్ చేస్తున్నారా? అయితే హ్యాంగోవర్ కలిగించే ఆ హార్డ్ ఆల్కహాలిక్ డ్రింక్స్ ను పక్కనబెట్టండి. జిన్‌తో చేసే ఈ రిఫ్రెషింగ్ కాక్‌టెయిల్‌లను ట్రై చేయండి. ఫుల్ కిక్కు..!
(1 / 7)
ఏదైనా పార్టీలో జోష్ ఉండాలంటే అక్కడ కాక్టెయిల్స్ ఉండాలి. అవుట్‌డోర్ పూల్ పార్టీ అయినా లేదా ఇండోర్ ఈవెంట్ అయినా, డ్రింక్స్ లేకుండా అది వేడుక అనిపించుకోదు. అయితే హార్డ్ అల్కాహాల్ డ్రింక్స్ కాకుండా మంచి ఫ్లేవర్స్ కలిగిన జిన్ కాక్‌టెయిల్‌లను మీకు మీరుగా తయారు చేసుకోండి. ఇది చాలా సింపుల్ కూడా.(Unsplash)
(2 / 7)
Peppermint Gin And Tonic: ఈ కాక్‌టెయిల్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇంట్లో ఈ పానీయం చేయడానికి మీకు కావలసిందల్లా కొంచెం ఐస్, జిన్, పుదీనా టీ, టానిక్ వాటర్. అన్నీ మిక్స్ చేస్తే ఫుల్ కిక్కు(Unsplash)
(3 / 7)
Gin-Gin Mule: ఈ కాక్‌టెయిల్ జిన్ ఇంకా జింజర్ బీర్ మిక్స్, అందుకే జిన్-జిన్ మ్యూల్. ఇది కొంచెం తీపి, కొంచెం మసాలా ఫ్లేవర్ కలిగి ఉంటుంది. మీకు కావలసిందల్లా పుదీనా, సిరప్, నిమ్మరసం, డ్రై జిన్ అలాగే అల్లం బీర్. ఫుల్ కిక్కు!(Unsplash)
(4 / 7)
Orange Negroni: ఇది డిన్నర్ కు ముందు తాగే కాక్‌టెయిల్. ఈ ప్రీ-డిన్నర్ డ్రింక్ సిద్ధం చేయడానికి, మీకు జిన్, వెర్మౌత్, లిక్కర్, సింపుల్ సిరప్, నిమ్మరసం, బిట్టర్స్ అవసరం. అన్ని మిక్స్ చేయండి ఒక రౌండ్ గ్లాస్‌లో పోసి దానిపై కాల్చిన నారింజను చల్లండి. ఫుల్ కిక్కు!(Unsplash)
(5 / 7)
Cranberry Gin And Tonic: ఇది కూడా ఒక పాపులర్ కాక్‌టెయిల్. జిన్, క్రాన్బెర్రీ జ్యూస్, టానిక్ వాటర్, నిమ్మకాయ అన్నీ మిక్స్ చేయాలి. మంచి కలర్ వస్తుంది. అలాగే ఫుల్ కిక్కు!(Unsplash)
(6 / 7)
Tom Collins: ఈ క్లాసిక్ కాక్టెయిల్ ను జిన్, నిమ్మరసం, కొంచెం చక్కెర, సోడా మిక్స్ చేసి ఫిక్స్ చేస్తారు. ఇది మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అలాగే ఫుల్ కిక్కు!(Unsplash)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు