Gin Benefits | జిన్​ తాగితే ఎన్ని ప్రయోజనాలున్నాయో మీకు తెలుసా?-drinking gin is good for health in some cases ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Drinking Gin Is Good For Health In Some Cases

Gin Benefits | జిన్​ తాగితే ఎన్ని ప్రయోజనాలున్నాయో మీకు తెలుసా?

Geddam Vijaya Madhuri HT Telugu
Mar 10, 2022 05:29 PM IST

మితంగా తీసుకుంటే ఏదైనా మంచిదే. దానిలో జిన్​ కూడా ఒకటి. మితంగా తీసుకుంటే జిన్​ మంచిదే కాదండోయ్.. దానిని తీసుకోవడం వల్ల కొన్ని నమ్మలేని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జిన్ ప్రయోజనాలు
జిన్ ప్రయోజనాలు

Gin Benefits |జిన్. మందు ప్రియులకు ఇది బాగా తెలిసిన పేరు. అయితే జిన్ మంచిది కాదు చాలా మంది భావిస్తారు. కానీ జిన్​ తాగడం అంత చెడ్డది ఏమి కాదు. వాస్తవానికి మీరు దానిని తగిన మోతాదులో తీసుకుంటే.. ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది చూశాకా మీరు ఆశ్చర్యానికి గురవుతారాని తెలుస్తుంది. కానీ జిన్​ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే మీరు నిజంగానే షాక్​ అవుతారు.

కేలరీలు తక్కువ

జిన్ వోడ్కా, టకీలాలో తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. జిన్ షాట్ 97 కేలరీలు మాత్రమే కలిగి ఉంటుంది. అదనపు చక్కెర లేదా రుచి కూడా ఉండదు. కాబట్టి మీరు కేలరీల విషయంలో రాజీ పడకుండా దీనిని తీసుకోవచ్చు. ఒకటి లేదా రెండు జిన్ పెగ్గులు మీకు అస్సలు హాని చేయవు. జిన్​కి టేస్ట్ ఉండదు కాబట్టి దీనిలో నిమ్మరసం లేదా కొబ్బరి నీళ్లు కలపి తీసుకుంటే బాగుంటుంది. జిమ్​ తీసుకోమని చెప్పడం మా ఉద్దేశం కాదు కానీ.. దాని గురించిన వాస్తవాలు మీకు చెప్పే ప్రయత్నమే ఇది.

ఇది మీ చర్మానికి మంచిది కావచ్చు

జిన్ ప్రాథమికంగా జునిపెర్ బెర్రీలతో తయారు చేయబడింది. ఒక అధ్యయనం ప్రకారం, ఈ బెర్రీలు యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం. సాధారణంగా, వయస్సు పెరిగే కొద్దీ మన కొన్ని కణాలు దెబ్బతింటాయి. దీని కారణంగా వయస్సు పెరిగేకొద్దీ.. ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. ఇది చర్మం వదులుగా మారేలా చేస్తుంది. ఈ కణాలను సరిచేయడానికి, కొత్త వాటిని ఉత్పత్తి చేయడానికి, మన శరీరంలో యాంటీఆక్సిడెంట్లు అవసరం. మితంగా జిన్ తాగడం వల్ల మీ శరీరంలో యాంటీఆక్సిడెంట్ కౌంట్‌ను పెంచి.. మీ చర్మానికి సహాయం చేస్తుంది.

ఇది మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ కావచ్చు

జిన్​లో అథెరోస్క్లెరోసిస్, జిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. కీళ్లనొప్పులు వంటి సమస్యలతో బాధపడే వారికి ఇది చాలా మంచిది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మీరు దీనిని తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిది.

జిన్ ఉబ్బరంతో సహాయపడవచ్చు

కడుపు ఉబ్బరంతో బాధపడే వ్యక్తులు మీకు జిన్ మంచిగా పని చేస్తుంది. జిన్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతే కాదు మీరు కొన్ని కారణాల వల్ల మీ ఆకలిని కోల్పోతుంటే.. జిన్ మీకు సహాయం చేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, భోజనానికి ముందు పానీయంగా జిన్ తీసుకుంటే ఆకలిని ప్రేరేపిస్తుంది.

బాటమ్ లైన్ ఏమిటంటే

మంచి ఆహారంతో పాటు జిన్​ను తక్కువ మోతాదులో తీసుకుంటే.. మంచిది. సరైన ఆహారంతో తీసుకోకుండా ఓన్లీ జిన్​ తాగితే.. ఇది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. కానీ ప్రయత్నిస్తే.. జిన్​తో కూడా మంచి ప్రయోజనాలు పొందే అవకాశముంది. అది కూడా మితంగా తీసుకుంటేనే.

WhatsApp channel