తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Juices । బ్రేక్‌ఫాస్ట్ సమయంలో ఈ జ్యూస్‌లు తాగండి, రోజంతా అదరగొడతారు!

Breakfast Juices । బ్రేక్‌ఫాస్ట్ సమయంలో ఈ జ్యూస్‌లు తాగండి, రోజంతా అదరగొడతారు!

HT Telugu Desk HT Telugu

10 May 2023, 8:00 IST

    • Breakfast Juices: బ్రేక్‌ఫాస్ట్ సమయంలో తాగటానికి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఏం ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
Breakfast Juices
Breakfast Juices (Unsplash)

Breakfast Juices

Breakfast Juices: బ్రేక్‌ఫాస్ట్ జ్యూస్‌లు అంటే బ్రేక్‌ఫాస్ట్ సమయంలో తాగేటువంటి పానీయాలు అని చెప్పవచ్చు. చాలా మంది ఉదయం అల్పాహారం చేసిన తర్వాత ఒక కప్పు కాఫీ లేదా టీ తాగి, తమ దినచర్యను ప్రారంభిస్తారు. అయితే వీటికంటే పండ్లు, కూరగాయల రసాలు తాగటం మరింత ఆరోగ్యకరం అని నిపుణులు అంటున్నారు. కొంతమంది అల్పాహారం చేసే సమయంలో లేదా చేసిన తర్వాత జ్యూస్ తీసుకుంటారు. ఇది మంచి అలవాటే అయినప్పటికీ, ఎలాంటి జ్యూస్ తాగుతున్నారు అనేది కూడా ఇక్కడ ముఖ్యం.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

అన్ని జ్యూస్‌లు అల్పాహారానికి అనువైనవి కావు. ఆహారం తీసుకున్న తర్వాత అందులోని కొన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు ఆమ్లత్వానికి దారితీస్తాయి, దీని వలన కడుపు అదనపు ఆమ్ల పిత్త రసాన్ని ఉత్పత్తి చేస్తుంది, దీని ఫలితంగా రోజంతా అజీర్ణం, గ్యాస్ ఏర్పడుతుంది. ఉదయం వేళ సిట్రస్ జ్యూస్‌లు తాగితే అది కడుపు లైనింగ్‌ను ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి అల్పాహారంతో పాటు ఏ జ్యూస్‌లు ప్రయోజనకరమో గుర్తించడం చాలా ముఖ్యం.

బ్రేక్‌ఫాస్ట్ సమయంలో తాగటానికి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఏం ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

బీట్‌రూట్ జ్యూస్

బీట్‌రూట్ రసం తాగడం వల్ల మీ శరీరంలోని ఎర్ర రక్తకణాలు వృద్ధి చెందుతాయి. ఇది మీ శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది, మీ మెదడు కణాలను ఆరోగ్యంగా చేస్తుంది. ఉదయాన్నే ఈ జ్యూస్ తాగడం వల్ల మీ మెటబాలిజం ఫాస్ట్ గా ఉంటుంది, మీ శరీరంలో ఎనర్జీ ఉంటుంది , మీ ముఖం కూడా తాజాగా మెరుస్తుంది.

ఆకుకూర జ్యూస్

ఆకుపచ్చని ఆకు కూరలు, కూరగాయలతో తయారు చేసిన జ్యూస్ తాగటం మీ జీర్ణవ్యవస్థను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. ఇది కడుపు, ప్రేగుల కదలికను పెంచుతుంది, పొట్టను శుభ్రంగా ఉంచుతుంది. కాలేయం మెరుగ్గా పని చేస్తుంది జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను కూడా నివారించగలదు. గ్రీన్ జ్యూస్‌లోని ప్రోటీన్లు , ప్రత్యేక యాంటీఆక్సిడెంట్లు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి, కండరాల పనితీరును ప్రోత్సహిస్తాయి. పాలకూర జ్యూస్ తాగితే అనేక ప్రయోజనాలు ఉంటాయి.

క్యారెట్ జ్యూస్

క్యారెట్ జ్యూస్ అల్పాహారం సమయంలో తీసుకునే ఉత్తమ జ్యూస్ అని చెప్పవచ్చు. ఇది ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్స్‌ సమృద్ధిగా కలిగిన జ్యూస్. ఉదయాన్నే ఇలాంటి జ్యూస్ ఒక గ్లాస్ తాగితే శరీరానికి చురుకుతనం లభిస్తుంది. క్యారెట్ జ్యూస్ పొట్టలోని pHని బ్యాలెన్స్ చేస్తుంది, ఎసిడిటీ మరియు అజీర్ణం వంటి సమస్యలను నివారిస్తుంది.

కాబట్టి, ఈ పానీయాలను అల్పాహారంలో చేర్చుకోండి. ఇవి మీకు ఎసిడిటీని కలిగించవు లేదా మీ బరువును పెంచవు. ఇలా తాగటం అలవాటు చేసుకోడం వలన మీరు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

తదుపరి వ్యాసం