తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monsoon Tips : వర్షంలో రెస్టారెంట్స్​కి వెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

Monsoon Tips : వర్షంలో రెస్టారెంట్స్​కి వెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

12 July 2022, 17:33 IST

google News
    • Monsoon Tips : వర్షాకాలంలో వేడి, స్పైసీ ఫుడ్ తినాలనే కోరిక బాగానే ఉంటుంది. వండుకునే ఇంట్రెస్ట్ అస్సలు రాదు. కానీ బయటకు వెళ్లి తినాలనే కోరిక కచ్చితంగా ఉంటుంది. అయితే మీరు కూడా రెస్టారెంట్స్ కి వెళ్లాలని కోరిక మీలో ఉంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
వర్షంలో బయటకు వెళ్లి తినాలనుకుంటున్నారా?
వర్షంలో బయటకు వెళ్లి తినాలనుకుంటున్నారా?

వర్షంలో బయటకు వెళ్లి తినాలనుకుంటున్నారా?

Monsoon Tips : వర్షాకాలంలో ఏమైనా స్పైసీ, హాట్ ఫుడ్ తినాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. కానీ వండుకోవడానికి బద్ధకంగా ఉంటుంది. ఈక్రమంలో అందరూ బయటకు వెళ్లి తినడానికి ఇష్టపడతారు. పైగా కుటుంబంతో కుటుంబంతో, స్నేహితులతో బయటకు వెళ్లేందుకు ఇదే సరైన వాతావరణం. అయితే వర్షాకాలంలో ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువగా జరుగుతుంది. అయితే బయటకు వెళ్లినప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పరిశుభ్రమైన రెస్టారెంట్‌ను ఎంచుకోండి..

డైనింగ్ ఏరియా, డైనింగ్ టేబుల్, ఫుడ్ కౌంటర్, హ్యాండ్ వాషింగ్ ఏరియా, కిచెన్ మొదలైనవి పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. మీకు సర్వ్ చేసే ఉద్యోగులు చేతి తొడుగులు, ముసుగులు మొదలైనవి ధరిస్తున్నారా లేదా అని చూసుకోండి. రెస్టారెంట్లో సౌకర్యాలు మంచిగా ఉండేవాటిని ఎంచుకోండి.

మాంసం తినే ముందుఆలోచించండి..

వర్షాకాలంలో మాంసం ఉత్పత్తుల వల్ల కలిగే ఫుడ్ పాయిజనింగ్‌ ఎక్కువ జరుగుతుంది. సగం వండిన మాంసాన్ని తీసుకుంటే ఈజీగా ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు సగం ఉడికించిన మాంసం, సీ ఫుడ్ తీసుకోవడం మానేయాలి. ఇది శిశువు పెరగడానికి, అభివృద్ధి చెందడానికి అంత సురక్షితం కాదని గుర్తంచాలి.

పాక్షికంగా వండిన ఆహారం

వర్షాకాలంలో తినడానికి ముందు ఆహారం సరిగ్గా ఉడికిందో లేదో చూసుకోవాలి. బయట భోజనం చేసేటప్పుడు కూడా ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి. సెమీ-బాయిల్డ్, సరికాని వంటలు ఎంచుకోవడం మానేస్తేనే మంచింది. బదులుగా ఆవిరి, ప్రెజర్ కుక్కర్ పద్ధతిలో పూర్తిగా వండిన భోజనాన్ని ఎంచుకోవడం మంచిది.

ఆహార ఉష్ణోగ్రత

వ్యాధికారక కారకాల పెరుగుదలను నివారించడానికి ఆహార ఉష్ణోగ్రత కచ్చితంగా అవసరం. చల్లని ఆహారాలు చల్లగా, వేడి ఆహారాలు వేడిగా తినేలా చూసుకోండి.

స్ట్రీట్ ఫుడ్ తినడం మానుకోండి..

వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆహారం కలుషితం కావడం వల్ల వ్యాధికారక క్రిములు వేగంగా వృద్ధి చెందుతాయి. సరైన నిల్వ సౌకర్యాలు లేకపోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదముంది. కలరా, టైఫాయిడ్, విరేచనాలు, కామెర్లు వంటి అంటు వ్యాధులు పెరుగుతాయి. కాబట్టి వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ తినడం మానుకోండి.

టాపిక్

తదుపరి వ్యాసం