తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Budget Friendly Destinations : బడ్జెట్ ధరలో ఈ ఐదు దేశాలకు వెళ్లి రావొచ్చు

Budget Friendly Destinations : బడ్జెట్ ధరలో ఈ ఐదు దేశాలకు వెళ్లి రావొచ్చు

Anand Sai HT Telugu

03 February 2023, 14:16 IST

google News
    • Budget Friendly Foreign Destinations : విదేశాలకు వెళ్లాలని చాలామందికి ఉంటుంది. కానీ మెుదట గుర్తొచ్చేది.. బడ్జెట్. ఆస్తులు మెుత్తం కరిగించుకోవాల్సి వస్తుందేమో అని భయపడుతుంటారు. అయితే కొన్ని దేశాలకు బడ్జెట్ ధరలో వెళ్లి రావొచ్చు. అవేంటో మీ కోసం..
బడ్జెట్ ధరలో టూర్
బడ్జెట్ ధరలో టూర్

బడ్జెట్ ధరలో టూర్

ప్రతి ఒక్కరూ విదేశాలకు వెళ్లాలని కలలు కంటారు. కానీ చాలా మందికి బడ్జెట్ పెద్ద సమస్య. బడ్జెట్(Budget) ఎక్కువగా ఉండడంతో విదేశీ పర్యటనల కలలు కనడం మానేశారు. అయితే మీరు పాస్‌పోర్ట్ కలిగి ఉంటే.. ప్రపంచంలోని కొన్ని దేశాలకు బడ్జెట్ ధరలో వెళ్లిరావొచ్చు. ఇక్కడ చెప్పబోయే.. ఐదు దేశాలకు వెళ్లి ఎంజయ్ చేయోచ్చు. ఇవి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులకు ఇష్టమైన గమ్యస్థానాలుగా ఉన్నాయి. ఈ ప్రదేశాలకు వెళ్లేందుకు ఎక్కువ ఖర్చు చేయనవసరం లేదు.

భూటాన్

మీకు సాహసం చేయాలనిపిస్తే.. ప్రకృతి ప్రేమికులైతే, తూర్పు హిమాలయ ప్రాంతంలో ఉన్న చిన్న దేశమైన భూటాన్‌(Bhutan)కు ఒక యాత్రను ప్లాన్ చేయండి. ప్రకృతి ఒడిలో ఉన్న ఈ దేశం స్వచ్ఛమైన వాతావరణానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మీరు చాలా సరసమైన ధరలో ఇక్కడకు వెళ్లొచ్చు. తక్కువ ఖర్చుతోనే.. తినడం, ప్రయాణ ఖర్చులు ఉంటాయి. ఇక్కడికి వెళితే, కరణ్ కీచు లఖాంగ్, పారో, టైగర్ నెస్ట్, బౌద్ధ విహారాన్ని సందర్శించండి. ఇక్కడ అక్టోబర్ నుండి డిసెంబరు వరకు ప్రయాణం ఉత్తమమైనదిగా చెబుతుంటారు.

నేపాల్

నేపాల్(Nepal) బడ్జెట్ కు అనుకూలమైన దేశం. ఇక్కడ భారతీయులు సందర్శించడానికి వీసా అవసరం లేదు. మంచుతో కప్పబడిన ఈ హిమాలయ దేశం అందమైన దేవాలయాలు, శిఖరాలు, హిల్ స్టేషన్లు, బర్డియా నేషనల్ పార్క్, పటాన్ బోగ్నాథ్ స్థూపం, గార్డెన్ ఆఫ్ డ్రీమ్స్, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పశుపతినాథ్ ఆలయం ఉంది. ఇక్కడ కూడా అక్టోబర్ నుండి డిసెంబర్ నెలల్లో ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.

శ్రీలంక

శ్రీలంక(Sri Lanka) దేశం సుసంపన్నమైన సంస్కృతికి, సముద్ర తీరానికి, సముద్రపు ఆహారానికి ప్రసిద్ధి చెందింది. ఈ దేశం బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఇక్కడ మీరు వాటర్ గేమ్స్ ఆస్వాదించవచ్చు. ఇక్కడ సందర్శించడానికి డిసెంబర్ నుండి మార్చి వరకు బెటర్. ఇక్కడ రోజూ 1000 రూపాయలు ఖర్చుపెట్టి కూడా జీవించవచ్చు. కొలంబో, క్యాండీ, యపుహ్వా రాక్ ఫోర్ట్, జాఫ్నా ఫోర్ట్, శ్రీ మహాబోధి స్థల్, సిగిరియా రాక్ ఫోర్ట్ మొదలైనవాటిని సందర్శించవచ్చు.

థాయిలాండ్

థాయిలాండ్(Thailand) కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ ఉంటుంది. ఇక్కడ మీరు సముద్ర తీరం, మార్కెట్‌లు, చారిత్రక ప్రదేశాలు మొదలైనవాటిని ఆస్వాదించవచ్చు. పెద్ద దేవాలయం అంకోర్వత్ దేవాలయాన్ని సందర్శించొచ్చు. టీ వీలర్ అద్దెకు తీసుకొని ఈ ప్రాంతానికి వెళ్లొచ్చు.

ఒమన్

మీరు గల్ఫ్‌కు వెళ్లాలనుకుంటే.., బడ్జెట్‌లో ఒమన్‌(Oman)కు ప్రయాణించవచ్చు. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ మరియు సౌదీ అరేబియా మధ్య ఉంది. ఇక్కడ మీరు సూర్యాస్తమయం, అందమైన బీచ్, వన్యప్రాణులను చూడొచ్చు. ఇక్కడ రోజువారీ జీవన వ్యయం రూ.2000 నుండి మొదలవుతుంది. అక్టోబరు, ఏప్రిల్ మధ్య ఇక్కడకు వెళ్తే ఎంజాయ్ చేయోచ్చు.

తదుపరి వ్యాసం