తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Low Blood Pressure: రక్తపోటు తగ్గినట్టు అనిపిస్తోందా? ఈ ఇంటి చిట్కాలను పాటించండి

Low Blood Pressure: రక్తపోటు తగ్గినట్టు అనిపిస్తోందా? ఈ ఇంటి చిట్కాలను పాటించండి

Haritha Chappa HT Telugu

09 December 2023, 13:15 IST

google News
    • Low Blood Pressure: అధిక రక్తపోటే కాదు, రక్తపోటు తగ్గడం కూడా సమస్యే. దీన్ని హైపోటెన్షన్ అంటారు.
రక్తపోటు
రక్తపోటు (Pixabay)

రక్తపోటు

Low Blood Pressure: తక్కువ రక్తపోటుతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. దీన్ని హైపోటెన్షన్ అంటారు. రక్తపోటు తక్కువగా ఉండడం వల్ల తీవ్రంగా అలసిపోతారు. త్వరగా నీరసపడతారు. మైకం కమ్మినట్టు అవుతుంది. హఠాత్తుగా కళ్ళు తిరిగి పడడం కూడా జరుగుతుంది.

రక్త పోటు తగ్గిన లక్షణాలు కనిపించగానే ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటించాలి. చిన్న పనికి త్వరగా అలసిపోతున్నట్టు అనిపిస్తే రక్తపోటు తగ్గినట్టు అర్.థం అలాగే హఠాత్తుగా మైకం కమ్మినట్టు, కళ్ళు తిరిగినట్టు అనిపించినా కూడా రక్తపోటు తగ్గిందని అర్థం చేసుకోవాలి. వెంటనే గ్లాసుడు నీళ్లు తాగాలి. డిహైడ్రేషన్ వల్ల కూడా రక్తపోటు పడిపోయే అవకాశం ఉంది.

రక్తపోటు తగ్గినట్టు అనిపిస్తే హెర్బల్ టీలు తాగడం లేదా ఎలక్ట్రోలైట్ పౌడర్లో కలుపుకొని తాగడం చేయాలి. కొబ్బరినీరు తాగినా వెంటనే ఉపశమనం లభిస్తుంది.

కింద పడుకొని కాళ్ళను పైకి ఎత్తడం వల్ల మెదడుకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల మైకం, అలసట తగ్గుతుంది.

ఒక కప్పు కాఫీ లేదా టీ తాగినా కూడా రక్తపోటు పెరుగుతుంది. అలాగని అదే పనిగా కాఫీ, టీలు తాగకూడదు. ఎందుకంటే అధిక కెఫిన్ ఉన్న ఇలాంటి ఆహారాలు డిహైడ్రేషన్ కు కారణం అవుతాయి.

యోగా చేయడం, వ్యాయామాలు చేయడం ద్వారా రక్తపోటు పడిపోకుండా నియంత్రించుకోవచ్చు. రక్తపోటుకు సహాయపడే యోగాసనాలను నేర్చుకోవడం చాలా అవసరం.

బీట్రూట్‌లో నైట్రేట్లు అధికంగా ఉంటాయి. బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తపోటు పెరగకుండా, తగ్గకుండా నియంత్రణలో ఉంటుంది. ఇది రక్తనాళాలను విస్తరించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అయితే బీట్రూట్లో ఆక్సలేట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు బీట్రూట్ జ్యూస్‌కు దూరంగా ఉంటే మంచిది.

ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. దీని ఆకుల్లో అడాప్టోజనిక్ లక్షణాలు ఎక్కువ. ఇది రక్తపోటుకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. రక్తపోటు తగ్గినట్టు అనిపిస్తే ఎండినా లేదా తాజా తులసి ఆకులను తీసుకుని వేడి నీటిలో వేసి మరిగించాలి. అలా తులసి టీని రెడీ చేసుకుని తాగితే ఎంతో మంచిది. అల్ప రక్తపోటు లక్షణాలు తగ్గుతాయి.

రోజ్ మేరీ ఆయిల్ కొని ఇంట్లో పెట్టుకుంటే మంచిది. ఇది రక్తపోటుపైనా, హృదయనాళ వ్యవస్థ పైనా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని చుక్కల రోజు మీరు నూనెను, వాసన చూడడం వల్ల ఉపశమనాన్ని ఇస్తుంది.

రోజులో ఒకేసారి ఎక్కువగా తినే కన్నా, చిన్న చిన్న భోజనాలుగా విభజించుకుని తింటే రక్తపోటు ఆకస్మికంగా పడిపోవడం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇలా తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. భారీ భోజనాలు ఒకేసారి చేయడం వల్ల రక్తపోటులో తేడాలు వస్తాయి.

రక్త పోటు నియంత్రణలో ఉండడానికి నిద్ర చాలా ముఖ్యం. విశ్రాంతి తక్కువగా ఉన్నా, నిద్ర తగ్గినా కూడా రక్తపోటు పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి రోజుకు తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి.

తదుపరి వ్యాసం