తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Omelette । పసందైన చికెన్ ఆమ్లెట్.. అదిరిపోతుంది దీని టేస్ట్!

Chicken Omelette । పసందైన చికెన్ ఆమ్లెట్.. అదిరిపోతుంది దీని టేస్ట్!

HT Telugu Desk HT Telugu

22 September 2022, 23:22 IST

    • మీలో చాలా మందికి ఆమ్లెట్ అంటే ఇష్టమై ఉండచ్చు. లంచ్ లో అయినా, డిన్నర్లో అయినా ఆమ్లెట్ ఆహారానికి మంచి రుచిని ఇస్తుంది. మరి చికెన్ ఆమ్లెట్ (Chicken Omelette) ఎప్పుడైనా తిన్నారా? రెసిపీ ఇక్కడ ఉంది.
Chicken Omelette
Chicken Omelette

Chicken Omelette

చాలా సందర్భాల్లో మనకు ఉదయం సమయాల్లో సమయం ఎక్కువగా ఉండదు. బ్రేక్ ఫాస్ట్ కోసం చాలా త్వరగా ఏదైనా చేసుకోవటానికి మనకు గుడ్లను గిలకొట్టి చేసే ఆమ్లెట్ వెరైటీలు చాలా ఉన్నాయి. బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవచ్చు, శాండ్ విచ్ చేసుకోవచ్చు లేదా గుడ్లను ఉడికించి కూడా నేరుగా తినవచ్చు. ఇది మంచి ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారం కాబట్టి మంచి శక్తి లభిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Pepper Fish Fry: పెప్పర్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే చిన్న ముక్క కూడా మిగలదు, చూస్తేనే నోరూరిపోతుంది

Mangoes Test: కృత్రిమంగా పండించిన మామిడి పండ్లతో జాగ్రత్త, వాటిని ఇలా గుర్తించండి

Glowing Skin : మెరిసే చర్మం కావాలంటే రోజుకు రెండుసార్లు కొబ్బరి నీటిని అప్లై చేయండి

Chanakya Niti Telugu : భార్య దగ్గర చేసే ఈ 6 తప్పులు బంధాన్ని పాడు చేస్తాయి

అయితే మీరెప్పుడైనా చికెన్ ఆమ్లెట్ తిన్నారా? ఇది కూడా చాలా వేగంగా, చేసుకోవచ్చు. రుచికరంగానూ ఉంటుంది. ఉదయం వేళ అల్పాహారంగా అయినా , లంచ్ సమయంలో అన్నంతో కలిపి తినడానికైనా లేదా సాయంత్రం వేళ టిఫిన్ లాగా కూడా చేసుకోవచ్చు. అతిథులు వచ్చినపుడు, ఇంట్లోనే విందులు చేసుకునేటపుడు కూడా ఈ చికెన్ ఆమ్లెట్ చాలా మంచి ఆప్షన్ గా ఉంటుది. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలి, కావలసిన పదార్థాలేమిటో చూడండి. ఇక్కడ చాలా తేలికైన రెసిపీని అందిస్తున్నాం.

Chicken Omelette Recipe కోసం కావలసినవి

  • గుడ్లు - 3
  • వండిన చికెన్ - 1 కప్పు
  • ఉల్లిపాయ - 1 సన్నగా తరిగినవి
  • అల్లంవెల్లుల్లి పేస్ట్- 1/2 టీస్పూన్
  • కారం 1/2 టీస్పూన్
  • కరివేపాకు ఒక రెమ్మ
  • కొత్తిమీర
  • రుచికి సరిపడా ఉప్పు
  • నూనె 2 టీస్పూన్లు

చికెన్ ఆమ్లెట్ తయారీ విధానం

  • ముందుగా గిన్నెలో గుడ్లను గిలకొట్టండి. పచ్చసొన, తెల్లసొన కలిసిపోయేలా కలపండి.
  • ఆపై అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి బాగా కలపండి.
  • ఇప్పుడు ఉడికించిన చికెన్ లేదా అప్పటికప్పుడు నూనెలో వేయించిన బోన్ లెస్ చికెన్ తీసుకొని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయండి.
  • ఈ ముక్కలను గుడ్డు మిశ్రమంలో వేసి బాగా కలపండి.
  • మరోవైపు స్కిల్లెట్లో నూనె వేడిచేయండి. నూనె వేడెక్కిన తర్వాత ఆమ్లెట్ వేయండి.
  • మూతపెట్టి చిన్నమంట మీద ఆమ్లెట్ ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మూతతీసి మరోవైపు కాల్చండి.

అంతే, చికెన్ ఆమ్లెట్ రెడీ అయినట్లే. వేడివేడిగా తింటూ ఆస్వాదించండి.

టాపిక్

తదుపరి వ్యాసం