తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Solar Eclipse 2024: సూర్యగ్రహణం మన దేశంలో కనిపించకపోయినా… ఆన్ లైన్లో ఇలా చూసేయండి

Solar eclipse 2024: సూర్యగ్రహణం మన దేశంలో కనిపించకపోయినా… ఆన్ లైన్లో ఇలా చూసేయండి

Haritha Chappa HT Telugu

03 April 2024, 18:00 IST

google News
    • Solar eclipse 2024: ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. భారత్ తో పాటు మరికొన్ని చోట్ల ఆ గ్రహణం కనిపించదు. కాబట్టి ఈ గ్రహణాన్ని ఆన్ లైన్లో ప్రత్యక్షంగా చూడవచ్చు.
సంపూర్ణ సూర్యగ్రహణం
సంపూర్ణ సూర్యగ్రహణం (REUTERS)

సంపూర్ణ సూర్యగ్రహణం

solar eclipse 2024: 2024లో తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 8న ఏర్పడనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. ఇదొక అరుదైన ఖగోళ సంఘటన. దీన్ని చూడాలని చాలామంది కోరుకుంటారు. అయితే మనదేశంతో పాటూ కొన్ని దేశాల్లో ఈ సూర్య గ్రహణం కనిపించదు. అయినా కూడా ఈ గ్రహణాన్ని చూడాలనుకుంటే ఆన్ లైన్లో ప్రయత్నించవచ్చు. సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ఎక్కడి నుంచైనా ఆన్ లైన్ లో ఎలా వీక్షించాలో తెలుసుకోవాలంటే చదవండి.

ఏప్రిల్ 8న ఏర్పడే సూర్యగ్రహణం 2024 ఏడాదిలో వచ్చే తొలి సూర్యగ్రహణం. దీన్ని వీక్షించే అవకాశం లేని వారికోసం నాసా కొన్ని ఏర్పాట్లు చేసింది. నాసా ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ఆన్ లైన్లో ప్రసారం చేసే ఏర్పాటు చేసింది. అలాగే ఇది నాసా టీవీలో కూడా ప్రసారం అవుతుంది. నాసా వెబ్ సైట్లో భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఇది ప్రారంభమవుతుంది. స్పేస్ ఏజెన్సీ సూర్యుని టెలిస్కోప్ దృశ్యాలను, అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు చిత్రాలను పంపిస్తుంది. టెలిస్కోప్ ఫీడ్ లో అంతరిక్షంలోని అనేక ప్రదేశాల దృశ్యాలను కలిగి ఉంటుంది.

అలాగే యూట్యూబ్ లో కూడా దీన్ని వీక్షించవచ్చు. ఇందుకోసం Space.com లో లేదా వీడియో ఫ్రమ్ స్పేస్ యూట్యూబ్ ఛానెల్ లో కూడా చూడవచ్చు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచే లైవ్ స్ట్రీమ్ కవరేజీ ప్రారంభమవుతుంది.

సంపూర్ణ సూర్యగ్రహణం అంటే ఏమిటి?

సూర్యుడు, చంద్రుడు, భూమి పూర్తిగా లేదా పాక్షికంగా ఒకే వరుసలోకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు - భూమి మధ్యకు చంద్రుడు వెళ్ళినప్పుడు, సూర్యుడి కాంతిని భూమిపై పడదు. ఫలితంగా చంద్రుని నీడ భూమిపై పడుతుంది. నాసా ప్రకారం, చంద్రుడు, సూర్యుడు, భూమి కలిసి ఒకే వరుసలోకి వచ్చిన కాలాన్ని గ్రహణ కాలం అంటారు, ఇది సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది.

సూర్యుడు - భూమి మధ్యకు చంద్రుడు వచ్చినప్పుడు సంపూర్ణ సూర్య గ్రహణం సంభవిస్తుందని చెప్పుకున్నాం. అలాంటి సమయంలో చంద్రుడు … సూర్యుడు భూమిపై కొంతభాగానికి కనిపించడు. అప్పుడే సూర్యగ్రహణం ఏర్పడిందని చెప్పుకుంటారు.

సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?

మెక్సికో పసిఫిక్ తీరం నుంచి తూర్పు కెనడా వరకు ఇరుకైన మార్గంలో నివసిస్తున్న లక్షలాది మంది ఏప్రిల్ 8న సూర్యగ్రహణాన్ని చూడవచ్చు. సంపూర్ణ సూర్యగ్రహణం మెక్సికో, అమెరికా, కెనడా మీదుగా ఉత్తర అమెరికాను దాటుతుంది. 2044 వరకు పొరుగున ఉన్న అమెరికా నుంచి కనిపించే చివరి సంపూర్ణ సూర్యగ్రహణం ఇదేనని నాసా తెలిపింది. ఇది దక్షిణ పసిఫిక్ మహాసముద్రం మీదుగా ప్రారంభమవుతుంది.

హిందూ మతంలో సూర్య గ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో సూర్యుడు భూమి శక్తిని ప్రభావితం చేస్తాడని చెప్పుకుంటారు. రాహు, కేతువులు సూర్యచంద్రులను మింగినప్పుడు ఇలా గ్రహణాలు ఏర్పడతాయని అంటారు.గ్రహణ కాలంలో సూర్యకాంతి అశుభకరంగా మారుతాయనే నమ్మకం కూడా ఉంది. సూర్య గ్రహణాన్ని నేరుగా కంటితో చూడకూడదు. ఇది కంటి చూపును దెబ్బతీస్తుంది. సూర్య గ్రహణాన్నే కాదు... సాధారణంగా సూర్యుడిని నేరుగా కంటితో చూసినా ఆ వెలుగును తట్టుకోలేక కళ్లు దెబ్బతినే అవకాశం ఉంది.

టాపిక్

తదుపరి వ్యాసం