తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hormone Imbalance: బ్రేక్ ఫాస్ట్‌లో వీటిని తింటే హార్మోన్ల అసమతుల్యత వచ్చే అవకాశం పెరిగిపోతుంది

Hormone Imbalance: బ్రేక్ ఫాస్ట్‌లో వీటిని తింటే హార్మోన్ల అసమతుల్యత వచ్చే అవకాశం పెరిగిపోతుంది

Haritha Chappa HT Telugu

17 October 2024, 16:30 IST

google News
  • Hormone Imbalance: శరీరంలో హార్మోన్ల పరిమాణం ఎక్కువగా ఉన్నా లేదా తక్కువగా ఉన్నా… హార్మోన్ల అసమతుల్యత సమస్య తలెత్తుతుంది. హార్మోన్ల అసమతుల్యత సమస్యను పెంచే కొన్ని రకాల ఆహారపదార్థాలు ఉన్నాయి. వాటిని మీరు తినడం తగ్గిస్తే మంచిది.

హార్మోన్ల అసమతుల్యతకు కారణమయ్యే ఆహారాలు ఏమిటి?
హార్మోన్ల అసమతుల్యతకు కారణమయ్యే ఆహారాలు ఏమిటి? (shutterstock)

హార్మోన్ల అసమతుల్యతకు కారణమయ్యే ఆహారాలు ఏమిటి?

హార్మోన్లు ఒక వ్యక్తి శరీరంలో అతిముఖ్యమైన రసాయనాలు. ఇవి శరీరంలోని ప్రతి అవయవానికి ఎప్పుడు, ఎలా పనిచేయాలో సందేశాన్ని తెలియజేయడానికి పనిచేస్తాయి. ఆ హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడితే శరీరం సరిగా పనిచేయలేదు. హార్మోన్ల అసమతుల్యతకు కారణమయ్యే ఆహారాలు కూడా ఎన్నో ఉన్నాయి.

హార్మోన్ల అసమతుల్యత అంటే ఏమిటి?

మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు ఉండాల్సిన వాటికన్నా ఎక్కువ ఉత్పత్తి అయినా లేదా తక్కువగా ఉత్పత్తి అయినా… హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. హార్మోన్ల అసమతుల్యత అంటే మీ శరీరం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హార్మోన్లను చాలా తక్కువ లేదా ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల సంతానలేమి, మొటిమలు రావడం, మధుమేహం, థైరాయిడ్, నెలసరి సక్రమంగా రాకపోవడం, పీసీఓడీ వంటి సమస్యలు తలెత్తుతాయి. హార్మోన్ల అసమతుల్యత సమస్యను పెంచే కొన్ని రకాల ఆహారాలు కూడా ఉన్నాయి.

వైట్ బ్రెడ్ తింటే…

అల్పాహారంలో వైట్ బ్రెడ్ తినేవారికి హార్మోన్ల అసమతుల్యత సమస్య వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి, వైట్ బ్రెడ్ తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరగుతుంది. అలాగే కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మీ బరువును పెంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని కూడా ప్రభావితం చేస్తుంది.

సోయా ఉత్పత్తులు

సోయా, పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. సోయా ఆహారాలు ఈస్ట్రోజన్ వలె పనిచేస్తాయి. అధిక స్థాయిలో ఈస్ట్రోజెన్ హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. పాల ఉత్పత్తులు ప్రేగులలో మంటను కలిగిస్తాయి. హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి.

తృణధాన్యాలతో వండిన ఆహారాలు

బ్రేక్ ఫాస్ట్ లో తృణధాన్యాలతో వండిన ఆహారాలను తినే ట్రెండ్ బాగా పెరిగింది. తృణధాన్యాలు అంటే బియ్యం, గోధుమలు, రై, వోట్స్, బార్లీ, మిల్లెట్, క్వినోవా వంటటివి. అటువంటి ఆహారాలలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఇవి మీ ఇన్సులిన్ స్థాయి ప్రభావితమవుతుంది. ఇవి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుంది.

టీ తాగితే

ఉదయాన్నే పరగడుపున టీ తాగే వ్యక్తులకు హార్మోన్ల అసమతులత్య సమస్య త్వరగా రావచ్చు. మీకు ఇష్టమైన ఉదయం పానీయం టీ… శరీరంలో కార్టిసాల్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. కార్టిసాల్ అనేది ఒత్తిడి హార్మోను. ఇది ఒక వ్యక్తిని తీవ్ర అలసటకు గురిచేస్తుంది. అలాగే హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది.

బిస్కెట్లు

అల్పాహారంలో తినే బిస్కెట్లలో పిండి పదార్థాలు, చక్కెర అధికంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్, ఈస్ట్రోజెన్ స్థాయిలను ప్రభావితం చేయడం ద్వారా హార్మోన్లను ప్రభావితం చేస్తాయి.

హార్మోన్ల అసమతుల్యత లక్షణాలు

హార్మోన్ల అసమతుల్యత బారిన పడిన వారిలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. వారు బరువుపెరుగుతారు. మూడ్ స్వింగ్స్ త్వరగా వస్తాయి. చిన్నచిన్న విషయాలకే డిప్రెషన్ బారిన పడతారు. చిన్న పని చేసినా తీవ్రంగా అలిసిపోతారు. మొటిమలు వస్తాయి. పీరియడ్స్ ప్రతి నెలా సక్రమంగా రావు .

హార్మోన్లను సమతుల్యంగా ఉంచే చిట్కాలు

  1. మీ ఆహారంలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. హార్మోన్ల ఉత్పత్తికి ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ నిండిన ఆహారాలు మీ ప్లేట్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.

2. పెరుగును ప్రతి రోజూ ఒక కప్పు తినడం వల్ల శరీరానికి ప్రొబయోటిక్స్ అందుతాయి.

3. శరీరంలోని అన్ని అవయవాలు బాగా పనిచేయడానికి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం. అంటే ఎక్కువగా నీరు, ద్రవాహారం తీసుకోవడం చాలా అవసరం.

4. మీరు హార్మోన్లను సమతుల్యంగా ఉంచాలనుకుంటే, కెఫిన్ ఉండే పానీయాలకు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి.

టాపిక్

తదుపరి వ్యాసం