తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Care Foods : పొడవాటి జుట్టు కోసం ఈ 7 ఆహారాలు తీసుకోండి

Hair Care Foods : పొడవాటి జుట్టు కోసం ఈ 7 ఆహారాలు తీసుకోండి

Anand Sai HT Telugu

25 December 2023, 17:30 IST

google News
    • Hair Care Foods In Telugu : జుట్టు సమస్యలతో చాలా మంది బాధపడుతారు. అయితే కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే సమస్యల నుంచి బయటపడొచ్చు. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం..
జుట్టు సమస్యలు
జుట్టు సమస్యలు (unsplash)

జుట్టు సమస్యలు

స్త్రీ పురుషులు తేడా లేకుండా జుట్టు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఆధునిక జీవనశైలి, ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల జుట్టు పాడవుతుంది. ప్రతిరోజూ జుట్టు రాలడం, చుండ్రు, నెరిసిన జుట్టు వంటి అనేక రకాల జుట్టు సమస్యలను ఎదుర్కొంటారు. అయితే అందమైన మెరిసే సిల్కీ జుట్టును పొందాలనుకుంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ఇదంతా ఆరోగ్యకరమైన ఆహారంతో ప్రారంభం కావాలి. తీసుకునే ఆహారంతో జుట్టు సమస్యల నుంచి బయటపడొచ్చు. అవేంటో చూద్దాం..

అవొకాడో మీ జుట్టుకు ఎన్నో అద్భుతాలు చేస్తుంది. అల్పాహారం కోసం అవోకాడో తీసుకోండి. ఈ పండు ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు E, C వంటి పోషకాల పవర్‌హౌస్. ఇది స్కాల్ప్ హెల్త్, హైడ్రేషన్‌ని మెరుగుపరుస్తుంది. అవకాడోతో మీ జుట్టు అందంగా, దట్టంగా తయారవుతుంది.

సాల్మన్ లేదా ఇతర చేపలతో మీ జుట్టు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. చేప ఆహారాలు ఆరోగ్యకరమైన తల చర్మానికి మద్దతునిస్తాయి. మెరిసే, బలమైన జుట్టును ప్రోత్సహిస్తాయి. మీరు వివిధ రకాల చేపలను మీ ఆహారంలో చేర్చవచ్చు.

ఐరన్, ఫోలేట్, విటమిన్లు ఎ, సి వంటి పోషకాలతో నిండిన బచ్చలికూర ఆరోగ్యకరమైన స్కాల్ప్‌ను ప్రోత్సహించడంలో, జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఆకుకూరలు సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. స్మూతీకి జోడించవచ్చు. పొడవాటి మెరిసే జుట్టును పొందడానికి మీ ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం మర్చిపోవద్దు.

గుడ్డుతో జుట్టుకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్రోటీన్, బయోటిన్, అవసరమైన పోషకాలతో నిండిన గుడ్లు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉడకబెట్టిన గుడ్లు లేదా ఆమ్లెట్ ఏదైనా సరే.. గుడ్లు జుట్టు మెరిసే జుట్టుకు ఉపయోగపడుతుంది.

చిలగడదుంపలతో మీ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంచుకోండి. ఇది యాంటీఆక్సిడెంట్ బీటా-కెరోటిన్‌తో నిండి ఉంటుంది. ఈ రూట్ వెజిటేబుల్ హెల్తీ స్కాల్ప్‌ను ప్రోత్సహిస్తుంది. మీ జుట్టు సహజ కండీషనర్ అయిన సెబమ్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది.

బెర్రీస్ మీ శారీరక ఆరోగ్యానికే కాకుండా మీ జుట్టు ఆరోగ్యానికి కూడా మంచివి. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్ విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లలో పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను రక్షిస్తాయి. జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి.

డ్రై ఫ్రూట్స్ స్నాక్స్ గా తీసుకోండి. బాదం, వాల్‌నట్‌లు, చియా గింజలు, అవిసె గింజలతో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, జింక్, విటమిన్ ఇ లభిస్తాయి. మీ ఆకలిని తీర్చడమే కాకుండా మీ జుట్టును లోపలి నుండి పోషించేందుకు ఉపయోగపడతాయి.

తదుపరి వ్యాసం