తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Summer Fruits For Weight Loss : వేసవిలో ఈ పండ్లు తినండి.. సులభంగా బరువు తగ్గడం ఖాయం..

Summer Fruits For Weight Loss : వేసవిలో ఈ పండ్లు తినండి.. సులభంగా బరువు తగ్గడం ఖాయం..

Anand Sai HT Telugu

21 April 2024, 9:30 IST

    • Summer Fruits For Weight Loss In Telugu : బరువు తగ్గడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తాం. అయితే వేసవిలో ఈ విషయం కాస్త సులభం. ఎందుకంటే ఈ సీజన్‌లో దొరికే పండ్లు కొన్ని ఈజీగా బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.
వేసవిలో బరువు తగ్గించే పండ్లు
వేసవిలో బరువు తగ్గించే పండ్లు (Unsplash)

వేసవిలో బరువు తగ్గించే పండ్లు

మీకు తెలుసా వేసవిలో సులభంగా బరువు తగ్గవచ్చు? కారణం ఈ సీజన్‌లో లభించే చాలా పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఇందులోని షుగర్ కంటెంట్ కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అందుకే వేసవిలో బరువు తగ్గే ప్రణాళికను పెట్టుకోండి. కాస్త ఈజీగా బరువు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. మిగతా సీజన్లతో పోలిస్తే.. ఎండాకాలం ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. అందుకే ఈ సీజన్‌లో ప్లాన్ చేసుకోండి. బరువు తగ్గేందుకుు కొన్ని రకాల పండ్లు కూడా మీకు సాయం చేస్తాయి.

ట్రెండింగ్ వార్తలు

Mango Pakodi: పచ్చిమామిడి కాయ పకోడీలు ఇలా చేశారంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి

Dry Fruits For Skin : ఖరీదైన క్రీములు అవసరం లేదు.. డ్రైఫ్రూట్స్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి

Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు

IDIOT Syndrome : ఇంటర్నెట్‌లో ప్రతిదీ సెర్చ్ చేస్తే ఇడియట్.. ఈ రోగం ఉన్నట్టే!

నేటి యుగంలో బరువు తగ్గడం ప్రతి ఒక్కరికీ పెద్ద సవాలు. కానీ వాస్తవానికి బరువు తగ్గడానికి మీరు వ్యాయామం లేదా మీ ఆహారాన్ని నియంత్రించాల్సిన అవసరం లేదు. మీ ఆహారంలో సీజనల్ పండ్లు, కూరగాయలతో సహా ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం, సాధారణ జీవనశైలిని అనుసరించడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు.

ఈ సీజన్‌లో లభించే పండ్లలో కేలరీలు, చక్కెర చాలా తక్కువగా ఉంటాయి. వీటితో బరువు తగ్గడానికి చాలా మంచివి. అలాగే ఈ పండ్లు నిజానికి కొలెస్ట్రాల్-తగ్గించే ఏజెంట్లుగా పనిచేస్తాయి. ఈ పండ్లను తినడం ద్వారా ఈ వేసవిలో సులభంగా బరువు తగ్గవచ్చు. ఏ పండ్లు బరువు తగ్గేందుకు మీకు ఉపయోగకరంగా ఉంటాయో తెలుసుకుందాం..

పుచ్చకాయ

ఈ వేసవిలో బరువు తగ్గాలంటే ఈ పండు తినండి. ఊబకాయాన్ని తగ్గించడంలో పుచ్చకాయ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కేలరీలు, చక్కెర, చాలా నీరు కలిగి ఉంటుంది. జ్యూసీగా ఉండే ఈ పండులో పీచుపదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని తింటే కడుపు నిండుతుంది. ఆకలిని ప్రేరేపించదు. దీంతో శరీర బరువు తగ్గుతుంది. పుచ్చకాయ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందుకే వేసవిలో కచ్చితంగా బరువు తగ్గేందుకు పుచ్చకాయను తినండి.

కివి

కివిలో చక్కెర చాలా తక్కువగా ఉంటుంది. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె, పొట్టకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా కివి జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో గొప్పగా సహాయపడుతుంది. వేసవిలో ఈ పండును తింటే మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.

ఆరెంజ్

విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ పండు వేసవిలో బరువు తగ్గడానికి మంచి మార్గం. ఇది బరువును తగ్గించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. ఎందుకంటే ఇందులో కేలరీలు, చక్కెర చాలా తక్కువ. రోగనిరోధక శక్తికి కూడా ఈ పండు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.

దోసకాయ

దోసకాయ వేసవిలో సులభంగా దొరుకుతుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువును సులభంగా తగ్గిస్తుంది. అంతే కాకుండా వేసవిలో దోసకాయ తింటే డీహైడ్రేషన్ రాదు. చాలా మంది వేసవిలో దోసకాయను తినేందుకు ఇష్టపడుతారు. కడుపులో చల్లగా ఉంచుతుంది. మలబద్ధక సమస్యలకు కూడా దోసకాయ తినడం చక్కటి పరిష్కారం. పైన చెప్పిన పండ్లను తింటే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

తదుపరి వ్యాసం